ETV Bharat / sports

రూ.15వేల కోట్లకు రాజస్థాన్ రాయల్స్ విక్రయం- కొత్త ఓనర్లు ఎవరంటే?

IPL మధ్యలో రాజస్థాన్ రాయల్స్ విక్రయం- IPLతోపాటు ఆ రెండు లీగ్​ల్లోని జట్లు కూడా- భారీ ధరకు డీల్ క్లోజ్!

Rajasthan Royals Sold
Rajasthan Royals Sold (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : May 3, 2026 at 4:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rajasthan Royals Sold : 2026 ఐపీఎల్ మధ్యలోనే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేతులు మారింది. ప్రస్తుత మేనేజ్​మెంట్ మనోజ్ బాదలే నుంచి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ మిత్తల్​ - ఆదర్ పూనావాలాలు సంయుక్తంగా మెజార్టీ వాటాను 1.65 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,600 కోట్లు) కొనుగోలు చేశారు. ఈ మేరకు డీల్ కుదిరినట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

93 శాతం వాటా ఆ ఇద్దరిదే
స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని అదర్ పూనావాలా ఈ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిసి మొత్తం 93 శాతం వాటా ఉంటుంది. ఇందులో మిట్టల్ కుటుంబానికి 75 శాతం, పూనావాలాకు 18 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 7 శాతం వాటాను ప్రస్తుత యజమాని మనోజ్ బదాలేతోపాటు ఇన్వెస్టర్లు కలిగి ఉంటారు. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐతోపాటు బోర్డు పాలక మండలి నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. అందుకే 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.

వీళ్లంతా ఓనర్లే!
ఈ ఒప్పందంతో, బాదల్‌తో పాటు మిత్తల్​ కుటుంబ సభ్యులు లక్ష్మీ మిత్తల్, ఆదిత్య మిత్తల్, వనిషా మిత్తల్ భాటియా, అండ్ ఆదర్ పూనావాలా రాజస్థాన్ రాయల్స్ బోర్డులో చేరనున్నారు. కాగా, మిట్టల్ కుటుంబం రాజస్థాన్‌ చురు జిల్లాలోని సదుల్‌పుర్‌కు చెందినది.

ఆ రెండు జట్లు కూడా
కాగా, ఈ డీల్​తో IPL జట్టుతో పాటు, మిత్తల్ ఫ్యామిలీ అండ్ ఆదార్ పూనావాలాకు సౌతాఫ్రికా (SAT20) లీగ్‌లోని 'పార్ల్ రాయల్స్​', కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 'బార్బడోస్ రాయల్స్​' జట్టుకు కూడా యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. ఇలా ఈ మూడు వేర్వేరు లీగుల్లోని మూడు జట్లను కలిపి 1.65 బిలియన్ డాలర్లకు విక్రయించారు.

రాయల్స్ పాత డీల్ ఫెయిల్
అయితే రాజస్థాన్ విక్రయానికి ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు మార్చి నెలలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు విక్రయం పూర్తైనట్లు కథనాలు వచ్చాయి. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్‌ సొమానీకు చెందిన కన్సార్షియం రూ.15,300 కోట్ల ధరకు ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుంది. కానీ కల్ సొమానీ నిర్ణీత సమయంలో నిధులు సేకరించడంలో విఫలమైంది. దీంతో అనూహ్యంగా డీల్ నుంచి తప్పుకుంది. దీంతో మిత్తల్ గ్రూప్, పూనావాలా రేస్​లోకి వచ్చారు. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా హక్కులు దక్కించుకున్నాయి.

ఆర్సీబీ సేల్
ఈ ఏడాది మార్చిలో ఐపీఎల్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్ముడైంది. డియాజియో గ్రూప్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్‌ కన్సార్టియం కంపెనీలు ఆర్సీబీని రూ.16,000 కోట్లకు కొనుగోలు దక్కించుకున్నాయి. అలా ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్ముడవ్వగా, తాజాగా రాజస్థాన్ రాయల్స్ విక్రయం పూర్తైంది.

రాజస్థాన్ రాయల్స్ 2026
ప్రస్తుత సీజన్​లో రాజస్థాన్ మెరుగ్గానే రాణిస్తోంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్​లు ఆడగా అందులో ఆరింట నెగ్గింది. నాలుగు మ్యాచ్​ల్లో ఓడి ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన నాలుగింట మూడు మ్యాచ్​ల్లో విజయం సాధిస్తే ఈజీగా ప్లేఆఫ్స్​కు అర్హత సాధించవచ్చు. ఇక మే 09న రాజస్థాన్ తన తదుపరి మ్యాచ్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్​ను ఢీ కొట్టనుంది.

RR ఫ్రాంచైజీలో షేన్ వార్న్ వాటా- మాజీ క్రికెటర్ ఫ్యామిలీకి రూ.460 కోట్లు! ఎలాగంటే?

'RCB ఫర్ సేల్'- లలిత్ మోదీ సంచలన పోస్ట్- కన్​ఫ్యూజన్​లో ఫ్యాన్స్!