సన్‌రైజర్స్‌పై పంజా విసిరిన పంజాబ్- భారీ టార్గెట్‌ను ఊదేసిన అయ్యర్ సేన
సొంతగడ్డపై పంజాబ్ ఆల్‌రౌండ్ షో- సన్‌రైజర్స్‌పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ- అభిషేక్ మెరుపులు వృథా!

Published : April 11, 2026 at 7:22 PM IST
PBKS vs SRH IPL 2026 : సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 220 పరుగుల భారీ లక్ష్య ఛేధనలో ఓపెనర్లు ప్రయాంశ్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51) హాఫ్ సెంచరీలతో గట్టి పునాది వేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (69*) కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు మూడో విజయం అందించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో శివంగ్ కుమార్ 3, హర్ష్ దూబే 2 వికెట్ పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చిన కెప్టెన్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (74 పరుగులు), ట్రావిస్ హెడ్ (38 పరుగులు), హెన్రీచ్ క్లాసెన్ (39 పరుగులు), ఇషాన్ కిషన్ (27) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో శశాంక్ సింగ్, అర్షదీప్ సింగ్ చెరో 2, జెవియర్ 1 వికెట్ దక్కించుకున్నారు.
ఇద్దరికీ మూడోదే
కాగా, ఈ మ్యాచ్‌తో పంజాబ్ ప్రస్తుత టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్, చెన్నైతో గెలవగా, కేకేఆర్‌తో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మరోవైపు సన్‌రైజర్స్‌కు ఇది మూడో ఓటమి. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో ఓడగా, కేకేఆర్‌తో నెగ్గి బోణీ కొట్టింది. ఆ తర్వాత వరుసగా లఖ్‌నవూ, పంజాబ్‌తో ఓటమిపాలైంది. దీంతో 7 పాయింట్లతో పంజాబ్ రెండో స్థానంలో ఉండగా, 2 పాయింట్లతో సన్‌రైజర్స్ ఆరో ప్లేస్‌లో కొనసాగుతోంది.
𝑷𝒖𝒏𝒋𝒂𝒃𝒊 𝒎𝒖𝒏𝒅𝒆𝒚𝒂𝒏 𝒕𝒆 𝒅𝒐𝒖𝒃𝒕 𝒏𝒊 𝒌𝒂𝒓𝒊! 💥 pic.twitter.com/xCoZdzTgNy
— Punjab Kings (@PunjabKingsIPL) April 11, 2026
IPLలో 200పైగా పరుగుల లక్ష్యాన్ని అత్యధిక సార్లు విజయవంతంగా ఛేదించిన జట్లు
- 10 - పంజాబ్ కింగ్స్
- 6 - ముంబయి ఇండియన్స్
- 5 - రాజస్థాన్ రాయల్స్
- 4 - సన్‌రైజర్స్ హైదరాబాద్
- 4 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో ఛేదించిన అత్యధిక టార్గెట్లు
- 262 పరుగులు vs KKR- కోల్‌కతా, 2024
- 220 పరుగులు vs SRH- ముల్లాన్‌పుర్, 2026
- 210 పరుగులు vs CSK- చెన్నై, 2026
- 206 పరుగులు vs CSK- అబుదాబి, 2014
- 206 పరుగులు vs SRH- హైదరాబాద్, 2014
- 206 పరుగులు vs RCB- ముంబయి , 2022
ఛేజింగ్‌లో అహా అయ్యర్
కొంతకాలంగా ఐపీఎల్లో ఛేజింగ్ అనగానే అయ్యర్ రెచ్చిపోతున్నాడు. అతడు క్రీజులు ఉన్నాడంటే తమ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమా ఇస్తున్నాడు. ఇదే సీజన్లో రీసెంట్గా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అయితే 2024 నుంచి అయ్యర్ 13 ఇన్నింగ్స్ ఛేదనలోనే ఆడాడు. ఇందులో 171.82 స్టైక్ రేట్‌తో 555 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ఈ గణాంకాలు చాలు. ఐపీఎల్లో ఛేదనలో అయ్యర్ ఏ రేంజ్లో ప్రభావం చూపిస్తున్నాడో తెలుసుకోవడానికి!
Short ball, and punished! 💥
— Star Sports (@StarSportsIndia) April 11, 2026
With the chase getting tricky, Sarpanch Shreyas is stepping up in style, guiding PBKS towards yet another successful run chase! 👊#TATAIPL 2026 | #PBKSvSRH | LIVE NOW 👉https://t.co/eMC05Ko99R pic.twitter.com/c6POk5DDhJ
గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్‌కు షాక్- కెప్టెన్ అయ్యర్‌కు భారీ జరిమానా!
కోల్‌కతా X పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దు- ఇరు జట్లకు చెరో పాయింట్

