పాలమూరు vs వరంగల్ మ్యాచ్ రద్దు- TG 20 నుంచి రెండు జట్లు ఔట్!
పాలమూరు- వరంగల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి- మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు- ఇరుజట్లకు చెరో పాయింట్!

Published : July 3, 2026 at 10:52 PM IST
Palamuru vs Warangal : టీజీ 20 లీగ్ 2026లో వర్షం కారణంగా తొలిసారి మ్యాచ్ రద్దైంది. శుక్రవారం సాయంత్రం ఉప్పల్ వేదికగా పాలమూరు- వరంగల్ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. ఎంత సేపటికీ వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన పాలమూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వరంగల్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే రెండు ఓవర్లు పూర్తి అవ్వగానే వర్షం ఆటకు అంతరాయం కలిగింది. దీంతో 2.3 ఓవర్ వద్ద గేమ్ ఆగిపోయింది. ఆ తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఆట నిలిచిపోయే సమయానికి వరంగల్ 2.3 ఓవర్లలో 23-1 స్కోర్‌తో ఉంది. క్రీజులో రిషికేత్ సిసోదియా (0), హర్షిత్ చౌదరి (6) ఉన్నారు.
ఇరు జట్లు ఔట్!
తాజా మ్యాచ్‌తో ఇప్పటిదాకా ఇరుజట్లు కూడా చెరో ఆరు మ్యాచ్‌లు ఆడేశాయి. అందులో ఒక్కో విజయమే సాధించాయి. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో చెరో పాయింట్ దక్కింది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం వరంగల్ (3 పాయింట్లు) ఆరు, పాలమూరు ((3 పాయింట్లు) ఏడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ జట్లు లీగ్ స్టేజ్‌లో ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంతో పాలమూరు, వరంగల్ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే.

