పాకిస్థాన్ బ్యాటర్ ఊచకోత- విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్- శ్రీలంకపై పాకిస్థాన్ భారీ స్కోర్- వరల్డ్ రికార్డ్ కొట్టిన షహిబ్జాదా

Published : February 28, 2026 at 9:27 PM IST
Pakistan vs Sri Lanka : కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోర్ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్లు షహిబ్జాదా ఫర్హాన్ (100 పరుగులు) సెంచరీతో అదరగొట్టగా, ఫకర్ జమాన్ (84 పరుగులు) రాణించాడు. దీంతో పాక్ భారీ స్కోర్ అందుకుంది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక 3, డాసున్ షనక 2, దుష్మంత చమీర 1 వికెట్ దక్కించుకున్నారు.
విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్!
ప్రస్తుత వరల్డ్‌కప్ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న షహిబ్జాదా ఈ మ్యాచ్‌లో సెంచరీతో అలరించాడు. దీంతో అతడు పలు అరుదైన ఘనతలు సాధించాడు. దీంతో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇప్పటిదాకా 6 మ్యాచ్‌ల్లో 76.60 యావరేజ్‌తో 383 పరుగులు చేశాడు. స్టైక్ రేట్ 160.25గా ఉంది. దీంతో టీ20 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా షహిబ్జాదా రికార్డు సృష్టించాడు.
ఈ క్రమంలోనే విరాట్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ లిస్ట్‌లో విరాట్ టాప్‌లో ఉన్నాడు. 2014 ఎడిషన్‌లో విరాట్ 319 పరుగుల చేశాడు. గత 12ఏళ్లుగా ఈ రికార్డ్ కోహ్లీ పేరిటే ఉంది. ఇప్పుడు 29ఏళ్ల షహిబ్జాదా తన పేరును రికార్డుల్లోకెక్కించుకున్నాడు.
𝐀 𝐒𝐚𝐡𝐢𝐛𝐳𝐚𝐝𝐚 𝐅𝐚𝐫𝐡𝐚𝐧 𝐬𝐩𝐞𝐜𝐢𝐚𝐥 𝐢𝐧 𝐊𝐚𝐧𝐝𝐲 👌
— T20 World Cup (@T20WorldCup) February 28, 2026
The swashbuckling batter stormed to a glorious second #T20WorldCup 2026 ton in a crunch game 💯
Watch the highlights here 👉 https://t.co/h1ssIM03pm pic.twitter.com/KBgNhu7rm6
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు బాదిన క్రికెటర్లు
- 383 పరుగులు - సాహిబ్జాదా ఫర్హాన్- పాకిస్థాన్ (2026)
- 319 పరుగులు - విరాట్ కోహ్లీ- భారత్ (2014)
- 317 పరుగులు - తిలకరత్నే దిల్షాన్- శ్రీలంక (2009)
- 303 పరుగులు - బాబర్ ఆజమ్- పాకిస్థాన్ (2021)
- 302 పరుగులు - మహేల జయవర్ధనే- శ్రీలంక (2010)
- 296 పరుగులు - విరాట్ కోహ్లీ- భారత్ (2022)
- 295 పరుగులు - తమీమ్ ఇక్బాల్- బంగ్లాదేశ్ (2016)
- 289 పరుగులు - డేవిడ్ వార్నర్- ఆస్ట్రేలియా (2021)
- 281 పరుగులు - మహ్మద్ రిజ్వాన్- పాకిస్థాన్ (2021)
- 281 పరుగులు - రహ్మానుల్లా గుర్బాజ్- ఆఫ్గానిస్థాన్ (2024)
ఇంటర్నేషనల్ T20I ల్లో పాకిస్థాన్‌కు అత్యధిక స్కోర్లు
- 232/6 vs ఇంగ్లాండ్- నాటింగ్‌హామ్, 2021
- 212/8 vs శ్రీలంక- పల్లెకెలె, 2026 వరల్డ్‌కప్
- 208/3 vs వెస్టిండీస్- కరాచీ, 2021
- 207/1 vs న్యూజిలాండ్- ఆక్లాండ్, 2025
- 207 vs యూఏఈ- షార్జా, 2025
- 207/6 vs ఆస్ట్రేలియా- లాహోర్, 2026
అత్యధిక సిక్స్‌లు
కాగా, సిక్స్ల్లోనూ షహిబ్జాదా మరో రికార్డ్ కొట్టాడు. ఈ ఎడిషన్‌లో అతడు ఇప్పటిదాకా 18 సిక్స్‌లు కొట్టాడు. ఇందులో ఇన్నింగ్స్‌లోనే 5 సిక్స్‌లు బాగాడు. ఈ క్రమంలో సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ (17 సిక్స్‌లు)ను అధిగమించాడు.
టీ20 వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్
- 18* సిక్స్‌లు - షహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) (2026)
- 17* సిక్స్‌లు - షిమ్రన్ హెట్మయర్ (వెస్టిండీస్) (2026)
- 17 సిక్స్‌లు - నికొలస్ పూరన్ (వెస్టిండీస్) (2024)
- 16 సిక్స్‌లు - క్రిస్ గేల్ (వెస్టిండీస్) (2012)
- 16 సిక్స్‌లు - రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్) (2024)
ఓపెనర్లే 176 రన్స్
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఇద్దరే 176 పరుగులు బాదడం విశేషం. ఫకర్ జమాన్- షహిబ్జాదా 15.5 ఓవర్లలో 176 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అంటే 11.12 రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. మిగిలిన బ్యాటర్లంతా కలిపి 4.1 ఓవర్లలో కేవలం 36 పరుగులే చేయడం గమనార్హం.

