ETV Bharat / sports

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు- టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం

భారత్ - న్యూజిలాండ్ తొలి వన్డే- ముగిసిన కివీస్ ఇన్నింగ్స్- రాణించిన డారిల్ మిచెల్, కాన్వే, నికోల్స్- టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం!

Ind vs NZ
Ind vs NZ (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : January 11, 2026 at 5:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ind vs NZ 1St ODI : వడోదర వేదికగా భారత్​తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి సరిగ్గా 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవన్ కాన్వే (56 పరుగులు), హెన్రీ నికోల్స్ (62 పరుగులు), డారిల్ మిచెల్ (84 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.

ఓపెనర్ల సెంచరీ
న్యూజిలాండ్​కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ మంచి పునాది వేశారు. ఈ ఇద్దరు తొలి వికెట్​కు 21.4 ఓవర్లలో 117 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే చెరో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. నిలకడగా సాగిపోతున్న ఈ జోడీని హర్షిత్ రాణా విడగొట్టాడు. ఆ తర్వాత 23.6 ఓవర్ వద్ద కాన్వే కూడా ఔటయ్యాడు. వన్ డౌన్​లో వచ్చిన విల్ యంగ్ (12)ను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత డేంజరస్ గ్లెన్ ఫిలిప్ (12) కూడా స్వల్ప స్కోర్​కే పెవిలియన్ చేరాడు.

అతడిని కుల్దీప్ బోల్తా కొట్టించాడు. కాసేపటికే మిచెల్ హే (18 పరుగులు) కూడా ఔటయ్యాడు. దీంతో కివీస్ 198 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. ఒవైపు వికెట్లు పడుతుంటే మిచెల్ మాత్రం దుకుడుగా ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మిచెల్ అర్ధ శతకం పూర్తి చేశాడు. సెంచరీ వైపునకు దూకుపోతున్న మిచెల్​ను ప్రసిద్ధ్ కృష్ణ ఎల్​బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఇక ఆఖర్లో క్రిస్టియన్ క్లర్క్ (24 పరుగులు, 17 బంతుల్లో) వేగంగా ఆడడంతో కివీస్ 300 మార్క్ అందుకుంది.

భారత పిచ్​లపై డారిల్ మిచెల్ వన్డేలు గణాంకాలు

  • ఇన్నింగ్స్ : 13
  • పరుగులు: 670
  • యావరేజ్ : 55.83
  • స్ట్రైక్ రేట్ : 109.12
  • హాఫ్ సెంచరీలు : 3
  • సెంచరీలు : 2
  • అత్యధిక స్కోరు : 134 పరుగులు

భారత్‌పై డారిల్ మిచెల్ చివరి ఐదు వన్డే స్కోర్లు

  • 130 పరుగులు
  • 134 పరుగులు
  • 17 పరుగులు
  • 63 పరుగులు
  • 84 – ఈ మ్యాచ్​లో

విరాట్ అరుదైన రికార్డు
ఈ మ్యాచ్​లో ఆడడంతోనే విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్​లో ఇది విరాట్​కు 309వ వన్డే మ్యాచ్​. దీంతో భారత్​ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్​ల్లో ప్రాతినిధ్యం వహించిన ఐదో క్రికెటర్​గా నిలిచాడు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ (308 మ్యాచ్​లు)ని అధిగమించాడు. కాగా, ఈ లిస్ట్​లో భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్ టాప్​లో ఉన్నాడు. సుదీర్ఘ కెరీర్​లో సచిన్ భారత్ తరఫున 463 మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 400 వన్డే మ్యాచ్​లు ఆడిన ఏకైక భారత క్రికెటర్​గానూ సచిన్ పేరిట రికార్డ్ ఉంది.

టీమ్ఇండియా తరఫున అత్యధిక వన్డే మ్యాచ్​లు ఆడిన క్రికెటర్లు

  • సచిన్ తెందుల్కర్ - 463 మ్యాచ్​లు
  • మహేంద్రసింగ్ ధోనీ - 347 మ్యాచ్​లు
  • రాహుల్ ద్రవిడ్ - 340 మ్యాచ్​లు
  • మహ్మద్ అజారుద్దిన్ - 334 మ్యాచ్​లు
  • విరాట్ కోహ్లీ - 309*
  • సౌరభ్ గంగూలీ - 308

భారత్ x న్యూజిలాండ్ : ఫుల్​ ఫామ్​లో రో-కో - నయా జోష్​లో టీమ్ఇండియా!

కివీస్‌తో వన్డే సిరీస్- రిషబ్ పంత్ ఔట్​- రీప్లేస్‌మెంట్​గా ధ్రువ్​ జురెల్​