ETV Bharat / sports

వరల్డ్​కప్​నకు కివీస్ జట్టు ప్రకటన- చోటు దక్కించుకున్న RCB స్టార్ బౌలర్

2026 టీ20 వరల్డ్​కప్​ టోర్నీకి జట్టును ప్రకటించిన న్యూజిలాండ్- శాంట్నర్ కెప్టెన్సీలో బరిలో దిగనున్న కివీస్

New Zealand squad
New Zealand squad (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : January 7, 2026 at 9:55 AM IST

2 Min Read
Choose ETV Bharat

New Zealand Squad for The T20 World Cup : 2026 వరల్డ్​కప్​నకు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అయితే ఇటీవల వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​లో అదరగొట్టిన పేసర్ జాకబ్ డఫ్పీకి ఈ జట్టులో చోటు దక్కింది. దీంతో 31ఏళ్ల డఫ్పీ తొలిసారి తన కెరీర్​లో వరల్డ్​కప్​ టోర్నీ ఆడనున్నాడు.

జట్టు ఇలా
ఫిన్ అలెన్, మార్క్ చాప్​మన్, డేవన్ కాన్వే, డారిల్ మిచెల్, టిమ్ సైఫర్ట్​లతో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తుంది. కాన్వేతోపాటు ఫిన్ అలెన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక కెప్టెన్​ శాంట్నర్​, ఇష్ సొధి, మిచెల్ బ్రేస్​వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర నాలుగురు ఆల్​రౌండర్లను ఎంపిక చేశారు. ఈ ప్లేయర్లు బ్యాటింగ్​తోనే కాకుండా బౌలింగ్​లోనూ రాణించగల సత్తా ఉన్నవాళ్లు. అలాగే మ్యాచ్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, ఆడమ్ మిల్నే, జిమ్మి నీషమ్​ లాంటి టాప్​ క్లాస్ బౌలర్లతో బౌలింగ్ విభాగం దుర్భేద్యంగా కనిపిస్తుంది. ఈ స్టార్ బౌలర్ల క్యాంప్​లో ఆర్సీబీ స్టార్ జాకబ్ డఫ్పీ ఉండనున్నాడు. అలా బ్యాటింగ్​, బౌలింగ్​లో కివీస్ జట్టు పటిష్ఠంగా కనిపిస్తుంది.

ఆర్సీబీ స్టార్ జాకబ్
ఐపీఎల్ స్టార్ ఫ్రాంచైజీ ఇటీవల అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో జాకబ్ డఫీని రూ.2 కోట్ల బేస్​ప్రైజ్​కు దక్కించుకుంది. గతేడాది డిసెంబర్​లో అతడు వెస్టిండీస్​పై టెస్టు సిరీస్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడాడు. ప్రస్తుతం భీకర ఫామ్​లో ఉన్న డఫీని కివీస్ బోర్డు వరల్డ్​కప్​ ఎంపిక చేసింది. 2025లో డఫీ మొత్తం 39 ఇన్నింగ్స్​ల్లో 17.11 యావరేజ్​తో 81 వికెట్లు నేలకూల్చాడు. దీంతో అతడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సర్ రిచర్డ్ హాడ్లీ 40ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. రిచర్డ్ హాడ్లీ 1985వ సంవత్సరంలో 29 ఇన్నింగ్స్​లో 79 వికెట్లు తీసి ఈ రికార్డ్ నెలకొల్పాడు. ఇక ప్రస్తుతం అద్భుతమై ఫామ్​లో ఉన్న డఫీని వరల్డ్​కప్​లో తొలి మ్యాచ్​ నుంచే బరిలోకి దింపడం పక్కా!

వరల్డ్​కప్​లో కివీస్ గ్రూప్ మ్యాచ్​లు

  • అఫ్గానిస్థాన్- ఫిబ్రవరి 08- చెన్నై
  • యూఏఈ- ఫిబ్రవరి 10- చెన్నై
  • సౌతాఫ్రికా- ఫిబ్రవరి 14- అహ్మదాబాద్
  • కెనడా- ఫిబ్రవరి 17- చెన్నై

వరల్డ్​కప్​కు న్యూజిలాండ్ జట్టు : మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి

T20 World Cup 2026
భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా వచ్చే నెల 07న టీ20 వరల్డ్​కప్​ ప్రారంభం కానుంది. ఫైనల్​ మ్యాచ్​ 08న జరగనుంది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్​కు అర్హత సాధిస్తే శ్రీలంకలో ఫైనల్​ మ్యాచ్ జరుగుతుంది. లేదంటే భారత్​లోనే తుది పోరు ఉంటుంది. ​ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత్ సహా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాతో సహా అనేక దేశాలు తమతమ జట్లను ప్రకటించేశాయి. ఇంకా మరికొన్ని జట్లు తమతమ స్క్వాడ్​లను ప్రకటించాల్సి ఉంది.

'భారత్​లో ఆడాల్సిందే- లేదంటే పాయింట్లు పోతాయ్'- బంగ్లాదేశ్​కు ICC వార్నింగ్!

40ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన RCB బౌలర్- వేలంలో ఆమ్ముడైన వారంలోనే 'డఫీ' రేర్​ ఫీట్