ETV Bharat / sports

గౌరవ్ రెడ్డి సెంచరీ- మెదక్​పై నల్గొండ ఘన విజయం

గెలుపు ట్రాక్ ఎక్కిన నల్గొండ- శతకంతో రాణించిన గౌరవ్ రెడ్డి- ఇంటి బాట పట్టిన మెదక్!

Medak vs Nalgonda
Medak vs Nalgonda (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : July 3, 2026 at 5:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

Medak vs Nalgonda TG 20 Leauge : అనురాగ్ నల్గొండ నైట్స్ గెలుపు ట్రాక్ ఎక్కింది. గత మ్యాచ్​లో ఖమ్మం చేతిలో ఓడిన నల్గొండ, తాజాగా మెదక్​ను చిత్తు చేసింది. ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్​లో మెదక్​పై నల్గొండ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెదక్ నిర్దేశించిన 181 పరుగుల టార్గెట్​ను నల్గొండ 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ గౌరవ్ రెడ్డి (101 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. జశ్వంత్ మోతె (34 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. మెదక్ బౌలర్లలో అర్జున్, మధుకర్ చెరో 1 వికెట్ పడగొట్టారు.

ఓ మోస్తారు ఛేదనను నల్గొండ ఘనంగానే ఆరంభించింది. గౌరవ్ రెడ్డి తొలి నుంచే దూకుడుగా ఆడడంతో పవర్ ప్లేలోనే భారీగా పరుగులు వచ్చాయి. జస్వంత్ కూడా ఆకట్టుకున్నాడు ఈ ఇద్దరు తొలి వికెట్​కు 40 బంతుల్లోనే 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 6.4 ఓవర్ వద్ద జస్వంత్ ఔట్ అయ్యాడు. అయినా గౌరవ్ జోరు తగ్గలేదు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్​ డౌన్​లో వచ్చిన నితీశ్ (21) స్వల్ప స్కోరుకే మధుకర్ బౌలింగ్​లో 12.2 వద్ద ఔటయ్యాడు. కానీ అప్పటికే నల్గొండ గెలుపు ఖాయమైంది. చివర్లో సెంచరీతోపాటు గౌరవ్ మ్యాచ్​ను కూడా ముగించాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన మెదక్ ఫాల్కన్స్​ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్ (48 పరుగులు నాటౌట్), వరుణ్ ఎర్రమ్ (44 పరుగులు) రాణించారు. శ్రుంజిత్ రెడ్డి (30 పరుగులు), తెలుకుపల్లి రవితేజ (33 పరుగులు) ఫర్వాలేదనిపించారు. నల్గొండ బౌలర్లలో ఇయాన్ సతాని, చింతల రక్షన్ రెడ్డి, అనికేత్ రెడ్డి తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

తాజా ఓటమితో మెదక్ టీజీ 20 లీగ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది! ఇప్పటిదాకా ఆరు మ్యాచ్​లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే దాంట్లో నెగ్గింది. మిగిలిన ఐదు మ్యాచ్​ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరోవైపు, నల్గొండ నాలుగో విజయంతో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. ఇప్పటిదాకా ఆరు మ్యాచ్​లు ఆడిన నల్గొండ రెండు ఓటములు, నాలుగు విజయాలు 8 పాయింట్లతో ప్లేఆఫ్స్​కు దగ్గరైంది. ఇక ఆడిన ఐదు మ్యాచ్​ల్లోనూ నెగ్గిన హైరదాబాద్ ఈ ఛాంపియన్స్ 10 పాయింట్లతో టాప్​లో ఉంది.

నల్గొండ తుది జట్టు
జశ్వత్ మోతే, గౌరవ్ రెడ్డి, పాట్కూరి నితీశ్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), దివేశ్ సింగ్, ఊర్వేష్ కక్కడ్, అర్ఫాజ్ అహ్మద్ మహ్మద్, హర్షవర్ధన్ సింగ్ (వికెట్ కీపర్), ఇల్యాన్ సతాని, చింతల రక్షణ రెడ్డి, అనికేత్ రెడ్డి

మెదక్ తుది జట్టు
నమన్ అగర్వాల్, శృంజిత్ రెడ్డి, విక్రమ్ నాయక్ (వికెట్ కీపర్), వరుణ్ యర్రం, నోమన్ అహ్మద్, అర్జున్ గొర్రపల్లి, తెలుకుపల్లి రవితేజ (కెప్టెన్), బన్నీ జగన్, ఘాజీ అబ్బాస్, కార్తికేయ కాక్, మధుకర్ మన్నె

రిటైర్మెంట్ రూమర్స్ వేళ 'రొనాల్డో ప్రపంచ రికార్డ్'​- ఫిఫాలో తొలి ప్లేయర్​గా ఘనత

భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్- షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ