ETV Bharat / sports

'ఎప్పుడు ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి?- ఎవరిని బ్యాటింగ్​కు పంపాలో నాకు బాగా తెలుసు'- రోహిత్ శర్మ

మరోసారి తెరపైకి రోహిత్ శర్మ మతిమరపు సన్నివేశం- ఈసారి మొబైల్ మర్చిపోయిన హిట్​మ్యాన్- కానీ ముఖ్యమైన విషయాలు గుర్తుంటాయన్న స్టార్ క్రికెటర్

Rohit Sharma
Rohit Sharma (Source : AP News)
author img

By ETV Bharat Sports Team

Published : May 6, 2026 at 7:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rohit Sharma Forgot : మైదానంలోకి దిగితే పరుగులు వరద పారించే స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు మతిమరుపు ఉంటుందని, విలువైన వస్తువులను సైతం మర్చిపోతుంటాడని తన టీమ్​మేట్స్ ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పారు. తాజాగా అతడి మతిపరుపు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే తాను వస్తువులనే మర్చిపోతానని, గేమ్ స్ట్రాటజీని కాదని, ముఖ్యమైన విషయాలు కచ్చితంగా గుర్తుంటాయని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఈసారి మొబైల్ ఫోన్!
రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్​లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ముంబయి ఇండియన్స్​ జట్టు సభ్యులు సూర్యకుమార్, తిలక్ వర్మ, రికెల్టన్, జస్ప్రీత్ బుమ్రా, విల్ జాక్స్​కో కలిసి తాజాగా ఓ ఈవెంట్​లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్​లో రోహిత్ మతిమరుపుతో తాజాగా తనకు ఎదురైన సందర్భం గురించి యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ షేర్ చేసుకున్నాడు. ఈసారి రోహిత్ ఫోన్ మర్చిపోయాడని చెప్పాడు. 'ఇటీవల మేం జామ్​నగర్​లోని వంతారకు వెళ్లాం. ఈ క్రమంలో రోహిత్ భయ్యా ఫ్యామిలీతోపాటు మాకంటే ముందే దిల్లీకి చేరుకున్నాడు. దీంతో నేను భయ్యాకు ఫోన్ చేస్తున్నా. కానీ లిఫ్ట్ చేయడం లేదు. అయితే నేను వంతారకు చేరుకున్నాక, 'ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు?' అని తనను అడిగితే 'ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను' అని చెప్పాడని అన్నాడు. దీంతో ఈవెంట్​లో ఒక్కసారిగా అంతా నవ్వేశారు.

దీనిపై రోహిత్ స్పందించాడు. 'హా! నేను అప్పుడప్పుడు వస్తువులు మర్చిపోతుంటానని అంగీకరిస్తాను. ఇక్కడ కూర్చొని నవ్వుతున్నవాళ్లు కూడా ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒకటి మర్చిపోయే ఉంటారు. అది కామన్. కానీ, ఏ సందర్భంలో ఏది ముఖ్యమైన విషయమో అది నేను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు ఎవరికి బౌలింగ్​ ఇవ్వాలి? ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్​కు పంపాలి? అనే విషయాలు పక్కా గుర్తుంటాయి' అని రోహిత్ అన్నాడు.

రోహిత్ మంచి మనసు!
ముంబయి రీసెంట్​హా వాంఖడే వేదికగా మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్​కు ముందు మైదానంలో రోహిత్ ప్రాక్టీస్ చేస్తుండగా, అతడు బాదిన ఓ బంతి అక్కడే పని చేస్తున్న గ్రౌండ్ స్టాఫ్​కు తగిలింది. మోకాలికి బంతి బలంగా తాకడంతో గ్రౌండ్ స్టాఫ్​ మెంబర్ అక్కడే కిందపడ్డాడు. దీంతో రోహిత్ ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి అతడి వద్దకు వెళ్లి పరిస్థితిని కనుక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబయి తన ఎక్స్​ అకౌంట్​లో షేర్ చేసింది. గ్రౌండ్‌స్టాఫ్‌ పట్ల రోహిత్ చూపిన కేర్, గౌరవాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.