ముంబయిని వీడి KKRకు వెళ్లనున్న రోహిత్ శర్మ?- 'అది మాత్రం కన్ఫార్మ్' అంటూ MI రిప్లై
ముంబయి ఇండియన్స్‌ను రోహిత్ శర్మ వీడనున్నాడా?- వచ్చే సీజన్ కోల్కతాతోనేనా?- ముంబయి పోస్టు వైరల్

Published : October 30, 2025 at 5:33 PM IST
Rohit Sharma IPL 2026 : సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ ఫ్యూచర్‌పై మరోసారి చర్చ మొదలైంది. వచ్చే సీజన్‌కు అతడు ముంబయి ఇండియన్స్‌ను వదిలి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీకి మారనున్నాడని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రెండేళ్ల కిందట రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో, వచ్చే సీజన్‌కు రోహిత్ నిజంగానే ముంబయిని వదిలేసి కేకేఆర్‌కు ఆడాలనుకుంటున్నాడేమోనని నెటిజన్లు అనుకుంటున్నారు. దీనికితోడు కోల్‌కతా రీసెంట్గా చేసిన ఎక్స్ పోస్టు ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ పరోక్షంగా దీనిపై స్పందించింది. మరి కేకేఆర్ పోస్టు ఏంటి? ఇప్పుడు ముంబయి రిప్లైగా చేసిన పోస్టు ఏంటో తెలుసుకుందాం!
కోల్‌కతా ఎక్స్ పోస్ట్!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో 202 పరుగులతో రాణించి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన రోహిత్ వన్డే ర్యాకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. దీంతో కెరీర్లో తొలిసారి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. దీంతో రోహిత్‌కు మాజీ క్రికెటర్లు, సహచరులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ఓ పోస్ట్ చేసింది.
Top of the world and well deserved. Congratulations, Rohit 👏💙 pic.twitter.com/rKAxveOtJe
— KolkataKnightRiders (@KKRiders) October 29, 2025
ఈ పోస్టుకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ 'కేకేఆర్‌కు రోహిత్ వస్తున్నాడా?' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు కేకేఆర్ 'కన్ఫార్మ్, వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్' అని రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. 'కన్ఫార్మ్ అంటే అర్థం ఏంటి?' అని కొందరు అడగగా, మరికొందరు ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ డీల్ చూడనున్నామంటూ కామెంట్లు పెట్టారు. దీంతో అభిమానులు కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. రోహిత్ కోల్‌కతాకు వెళ్లడం ఖాయమేనని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
CONFIRM World No.1 Men's ODI Batter 💪💙
— KolkataKnightRiders (@KKRiders) October 29, 2025
ముంబయి ఫ్రాంచైజీ పోస్టు
ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తాజా పోస్టుతో ఈ ప్రచారాలకు గురువారం తెరదించింది. 'రేపు మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు. అది మాత్రం పక్కా నిజం. కానీ రాత్రి (K night) వేళలో సూర్యుడు ఉదయించడం కష్టమే కాదు అసాధ్యం కూడా' రాసుకొచ్చింది. దీనికి బ్యాగ్రౌండ్లో ముంబయి లోగోతో ఉన్న రోహిత్ ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్టులో కేకేఆర్‌కు సంబంధించిన నైట్ (Knight) అనే ఇంగ్లీష్ పదాన్ని హైలైట్ చేసింది. దీంతో రోహిత్ కేకేఆర్‌కు వెళ్లనున్నాడన్న ప్రచారాన్ని పరోక్షంగా ముంబయి కొట్టిపారేసింది! ఇలా తాజా పోస్టుతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్కు ముంబయి ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది.
𝗦𝘂𝗻 𝘄𝗶𝗹𝗹 𝗿𝗶𝘀𝗲 𝘁𝗼𝗺𝗼𝗿𝗿𝗼𝘄 𝗮𝗴𝗮𝗶𝗻 ye toh confirm hai, but at (K)night… मुश्किल ही नहीं, नामुमकिन है! 💙 pic.twitter.com/E5yH3abB4g
— Mumbai Indians (@mipaltan) October 30, 2025
MIతో రోహిత్ జర్నీ
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ ప్లేయర్లలో ఒకరు. బ్యాటింగ్‌తోపాటు కెప్టెన్సీలోనూ తనదైన మార్క్ చూపిస్తూ తమ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబయిని రోహిత్ ఛాంపియన్‌గా నిలిపాడు. 2011లో ముంబయితో చేరిన రోహిత్ 14ఏళ్లుగా అదే జట్టుతో కొనసాగుతున్నాడు.
✅ Highest individual ODI score: 𝟚𝟞𝟜
— Mumbai Indians (@mipaltan) October 29, 2025
✅ Most tons in ODI World Cups: 𝟟*
✅ Most ODI double tons: 𝟛*
✅ Most ODI sixes for India: 𝟛𝟜𝟡*
✅ ODI runs: 𝟙𝟙𝟛𝟟𝟘*
✅ ODI tons: 𝟛𝟛*
&
✅ ℕ𝕠. 𝟙 𝕣𝕒𝕟𝕜 𝕆𝔻𝕀 𝕓𝕒𝕥𝕥𝕖𝕣 pic.twitter.com/1ESfK8XyQf
అయితే రెండేళ్ల కిందట రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించింది. దీంతో గత రెండు సీజన్లలో రోహిత్ ప్లేయర్‌గానే కొనసాగుతున్నాడు. అప్పట్నుంచి రోహిత్‌కు ముంబయి మేనేజ్మెంట్కు మధ్య గ్యాప్ పెరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ముంబయి ఇండియన్స్‌కు లక్కీ ఛాన్స్- ఏకంగా టాప్- 1లోకే
'ముంబయి రిటైన్ లిస్ట్‌లో ఆ ముగ్గురు పక్కా- రోహిత్ విషయంలో అలా చేస్తారేమో!'- హర్భజన్

