ధోనీ 45 బర్త్‌డే : గ్రౌండ్‌లో సహనం కోల్పోయిన 5 అరుదైన సందర్భాలివే!
ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనీకి మైదానంలో పట్టరాని కోపం - ఆ అరుదైన 5 సందర్భాలివే!

Published : July 7, 2026 at 12:19 PM IST
MS Dhoni Birthday : మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఎంతటి ప్రెజర్ ఉన్నా చాలా కూల్‌గా ఉండే ప్లేయర్. క్రికెట్ హిస్టరీలో మూడు ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన కెరీర్‌లో ఇంటర్నేషనల్ లెవెల్‌లో 17 వేలకు పైగా పరుగులు చేయడంతో పాటు వికెట్ కీపర్‌గా 800 పైగా డిస్మిసల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఏకంగా 5 కప్పులు అందించాడు. ఎప్పుడూ చాలా కూల్‌గా తన పని తాను చేసుకుపోయే ధోనీ కూడా కొన్నిసార్లు మైదానంలో సహనం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. జులై 7 ధోనీ తన 45వ పుట్టినరోజు నేపథ్యంలో ఆ రేర్ మూమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
5⃣3⃣8⃣ Intl Matches 🙌
— BCCI (@BCCI) July 7, 2026
1⃣7⃣,2⃣6⃣6⃣ Intl Runs 👌
8⃣2⃣9⃣ Intl Dismissals behind the stumps 👏
Winning Captain of ICC Men's T20 World Cup 2007, ICC Men's ODI World Cup 2011, ICC Champions Trophy 2013 🏆🏆🏆
Happy Birthday to Former #TeamIndia Captain @msdhoni, an absolute icon of… pic.twitter.com/rsovep8gWI
ప్లేయర్స్‌పై ఫ్రస్ట్రేషన్
2025 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‌లో ధోనీ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ సెట్ చేసే టైమ్‌లో శివమ్ దూబే అలాగే మతీషా పతిరాన తన సూచనలు సరిగ్గా పాటించకపోవడంతో ధోనీ వారిపై చాలా సీరియస్ అయ్యాడు. కెప్టెన్‌గా ఉన్న ధోనీ అలా తన టీమ్‌మేట్స్‌పై ఫ్రస్ట్రేషన్ చూపించిన ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎప్పుడూ కూల్‌గా ఉండే మహీలో ఇలాంటి యాంగిల్ చూడటం అభిమానులకు కూడా చాలా కొత్తగా అనిపించింది.
అంపైర్లతో వాగ్వాదం
2019లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఒక సంఘటన ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఆ మ్యాచ్‌లో నడుము కంటే ఎత్తులో వచ్చిన ఒక బంతిని అంపైర్ మొదట నోబాల్‌గా ప్రకటించి ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో అస్సలు ఊహించని విధంగా ధోనీ నేరుగా డగౌట్ నుంచి మైదానంలోకి వచ్చి అంపైర్లు ఉల్హాస్ గాంధే, బ్రూస్ ఆక్సెన్ ఫర్డ్‌లతో గట్టిగా వాదనకు దిగాడు. దీంతో ఆ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా పడింది.
మనీష్ పాండేపై సీరియస్
2018లో సౌతాఫ్రికాతో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో మనీష్ పాండేపై ధోనీ ఆగ్రహంతో అరిచిన మూమెంట్‌ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో రెండో పరుగు తీసే అవకాశం ఉన్నప్పటికీ మనీష్ పాండే సరిగ్గా స్పందించకపోవడంతో ధోనీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో వీళ్లిద్దరూ కలిసి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా కూడా సింగిల్స్ విషయంలో కోఆర్డినేషన్ మిస్ అవ్వడంతో మహీ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. టార్గెట్ ఛేజింగ్‌లో ధోనీ ఎంత ఫోకస్డ్‌గా ఉంటాడో చెప్పడానికి ఈ సంఘటన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
బంగ్లా బౌలర్‌తో క్లాష్
2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో ధోనీ ఫిజికల్‌గా అగ్రెసివ్ అయిన ఒక అరుదైన మూమెంట్ ఇది. పరుగు తీస్తున్న సమయంలో అప్పుడే కొత్తగా టీమ్‌లోకి వచ్చిన పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కావాలనే అడ్డు రావడం ధోనీకి తీవ్ర కోపం తెప్పించింది. ఆ రన్ పూర్తి చేసే క్రమంలో ధోనీ బలంగా ముస్తాఫిజుర్‌ను ఢీకొట్టడంతో అది కాస్తా పెద్ద వివాదంగా మారింది. ఈ కారణంగా ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసినందుకు ధోనీకి మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పడగా, బ్యాటర్‌కు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడిన ముస్తాఫిజుర్‌పై కూడా ఐసీసీ యాక్షన్ తీసుకుంది.
టెక్నికల్ ఎర్రర్‌తో అసహనం
ఆస్ట్రేలియాతో జరిగిన 2012 సీబీ సిరీస్ మ్యాచ్‌లో రివ్యూ సిస్టమ్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. మైఖేల్ హస్సీ అవుట్ విషయంలో గ్రౌండ్‌లో ఉన్న స్క్రీన్‌పై ఒక టెక్నికల్ ఎర్రర్ రావడం వల్ల పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ నిర్ణయంపై ఏమాత్రం సంతృప్తి చెందని కెప్టెన్ ధోనీ నేరుగా వెళ్లి ఫీల్డ్ అంపైర్ బిల్లీ బౌడెన్‌తో వాగ్వాదానికి దిగాడు. టెక్నాలజీ వల్ల వచ్చిన ఈ మిస్టేక్‌తో ధోనీ తన సహనాన్ని కోల్పోయి అందరి ముందే పబ్లిక్‌గా తన అసహనాన్ని వ్యక్తం చేసిన రేర్ మూమెంట్ ఇది. ఈ విధంగా కెప్టెన్ కూల్ కూడా కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం అనేది క్రికెట్ ప్రపంచంలో ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు.
సాక్షితో ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్- సల్మాన్ ఖాన్ స్పెషల్ విషెస్ - MS Dhoni Birthday
పెంపుడు కుక్కలతో మహీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. అందరినీ ఫిదా చేశాడుగా!

