పాకిస్థాన్ పేసర్ ఆమిర్‌కు ఇంగ్లాండ్ పౌరసత్వం- IPLలో ఆడడంపై ఏమన్నాడంటే?
బ్రిటీష్ పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మాజీ పేసర్ - ఇకపై ఓవర్సీస్ ప్లేయర్‌గా పీఎస్ఎల్ బరిలో - మరి ఐపీఎల్ సంగతేంటంటే?

Published : August 5, 2026 at 4:57 PM IST
Mohammad Amir IPL : పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్‌కు ఇంగ్లాండ్ దేశపు పౌరసత్వం లభించింది. అతడి బ్రిటీష్ పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు అతడు డొమెస్టిక్ ప్లేయర్‌గా ది హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఆడేందుకు ఒక విధంగా ఆమిర్‌కు లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై అతడు కూడా స్పందించాడు. మరి ఆమిర్ ఏమన్నాడంటే?
సొంత దేశంలో ఓవర్సీస్ ప్లేయర్‌గా!
ఆమిర్‌కు తన భార్య నర్జీస్ ఆమిర్ ద్వారా బ్రిటీష్ పౌరసత్వం లభించింది. ఫలితంగా ది హండ్రెడ్ లీగ్‌లో ఓవర్సీస్ ప్లేయర్‌గా తన పేరును రిజిస్టర్ చేసుకున్న ఆమిర్ ఇప్పుడు లోకల్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. దీంతో తన సొంత దేశం పాకిస్థాన్ డొమెస్టిక్ టోర్నీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లోకల్ ప్లేయర్‌గా ఆడే అవకాశం కోల్పోయాడు. ఇకపై అతడు పీఎస్ఎల్లో ఓవర్సీస్ ఆటగాడిగా బరిలోకి దిగనున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఆడడంపైనా మాట్లాడాడు.
నా తొలి ప్రాధాన్యం అదే!
అయితే తనకు తొలి ప్రాధాన్యం మాత్రం పీఎస్ఎల్ అని ఆమిర్ స్పష్టం చేశాడు. ఇక ఐపీఎల్లో ఆడడంపై ఇంకా ఆలోచించలేదని చెప్పాడు. 'నేను 2027లో ఓవర్సీస్ ప్లేయర్‌గా పీఎస్ఎల్లో బరిలోకి దిగుతాను. నాకు క్రికెటర్‌గా పీఎస్ఎల్ టోర్నీనే తొలి ప్రాధాన్యం. అయితే ఐపీఎల్లో ఆడడం గురించి నేను ఇప్పుడు ఆలోచిచడం లేదు' అని ఆమిర్ ది హండ్రెల్ లీగ్ సందర్భంగా మీడియాతో పేర్కొన్నాడు.
పేరు నమోదుకు లైన్ క్లియర్!
పాకిస్థాన్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడడంపై నిషేధం ఉంది. అయితే ఇప్పుడు ఆమిర్ బ్రిటిష్ పౌరుడు కాబట్టి, నిబంధనల ప్రకారం అతడు ఐపీఎల్ కోసం తన పేరును నమోదు చేసుకోవచ్చు! గతంలో పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు అజార్ మహ్మూద్ ఇలాగే బ్రిటిష్ పౌరసత్వం తీసుకొని ఐపీఎల్లో ఆడాడు. 2012 -2015 సీజన్ల మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఇప్పుడు ఆమిర్ కచ్చితంగా పేరు రిజిస్టర్ చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఒకవేళ ఆమిర్ తన పేరును నమోదు చేసుకున్నా అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి చూపించే అవకాశం లేదు. ఎందుకంటే? పాక్ ప్లేయర్లను ఎంచుకుంటే విమర్శలపాలయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఆమిర్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో యాక్టీవ్‌గా లేడు. పైగా వచ్చే ఐపీఎల్ నాటికి 35 ఏళ్లు పూర్తవుతాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా ఆమిర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించవు!

