ETV Bharat / sports

బుమ్రా డామినేషన్​కు చెక్- టాప్​లోకి దూసుకొచ్చిన 36 ఏళ్ల స్టార్ పేసర్

జస్ప్రీత్ బుమ్రాకు భారీ షాక్ - 2ఏళ్ల తర్వాత టాప్ ప్లేస్ కోల్పోయిన భారత స్టార్ బౌలర్

ICC Rankings 2026
జస్ప్రీత్ బుమ్రా (ఫైల్) (Source : AP News)
author img

By ETV Bharat Sports Team

Published : August 26, 2026 at 4:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

ICC Rankings 2026 : టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆధిపత్యానికి తెరపడింది. గత రెండేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్​లో​ నెం.1 బౌలర్​గా కొనసాగుతున్న బుమ్రా తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా స్టాప్ పేసర్, 36ఏళ్ల మిచెల్ స్టార్క్ లేటెస్ట్ ర్యాంకింగ్స్​లో బుమ్రాను వెనక్కినెట్టి టాప్​లోకి దూసుకెళ్లాడు.

15ఏళ్ల కెరీర్​లో తొలిసారి!
ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్​లో స్టార్క్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని 872 రేటింగ్స్​తో టాప్​లోకి వచ్చాడు. తన 15ఏళ్ల కెరీర్​లో టెస్టుల్లో నెం1 బౌలర్​గా నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే తన సుదీర్ఘ కెరీర్​లో స్టార్క్ అనేకసార్లు టాప్ 10లోకి వచ్చాడు. రీసెంట్​గా ఇంగ్లాండ్​తో టెస్టుల్లో అత్యుత్తమంగా ఆడడంతో టాప్ 3 లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్​పై రెండో టెస్టులో ఏకంగా 10 వికెట్లు కూల్చి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్​గానూ నిలిచాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్​లో నెం 1 బౌలర్​గా నిలిచాడు.

రెండేళ్ల తర్వాత దిగజారిన బుమ్రా ప్లేస్
కాగా, గత రెండేళ్లుగా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో బుమ్రాదే ఆధిపత్యంగా సాగింది. 2024 ఫిబ్రవరిలో అతడు తొలిసారి టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. అప్పట్నుంచి ఈ రెండేళ్ల కాలంలో ఎక్కువ రోజులు బుమ్రానే నెం 1 పొజిషన్​లో కొనసాగుతూ వచ్చాడు. తాజాగా ఒక స్థానం కోల్పోయి రెండో ప్లేస్​లో (862 రేటింగ్స్) కొనసాగుతున్నాడు. అయితే గాయం కారణంగా అతడు ​ శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. లేకుండా ఇప్పుడు కూడా అతడు అగ్రస్థానంలోనే కొనసాగేవాడేమో! ఎందుకంటే, శ్రీలంక సిరీస్ ప్రారంభానికి ముందు 870 రేటింగ్స్​తో అగ్రస్థానంలో ఉన్న బుమ్రా, ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు దూరమవ్వడం వల్ల రేటింగ్ పాయింట్స్ 862కి పడిపోయాయి.

టాప్ 5 బౌలర్లు

  • మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) - 872 రేటింగ్స్
  • జస్ప్రీత్ బుమ్రా (భారత్)- 862 రేటింగ్స్
  • మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్)- 861 రేటింగ్స్
  • ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 841 రేటింగ్స్
  • మార్కో యాన్సెన్ (సౌతాఫ్రికా) - 825 రేటింగ్స్

ఇక టెస్టు బ్యాటింగ్ విభాగానికొస్తే, టీమ్ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ టాప్ 10 లోకి దూసుకొచ్చాడు. ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్న అతడు ప్రస్తుతం ఏడో స్థానంలో (711 రేటింగ్స్) ఉన్నాడు. భారత కెప్టెన్ శుభ్​మన్ గిల్ కూడా 711 పాయింట్లతో పంత్​తోపాటుగా సంయుక్తంగా ఏడో ప్లేస్​లో ఉన్నాడు. గాలెలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పంత్ 39, 66 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టాప్ పదిలోకి వచ్చాడు. టీమ్ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండు స్థానాలు దిగజారి టాప్ 10 నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం జైస్వాల్ 701 రేటింగ్స్​తో 11వ ర్యాంక్​లో ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (874) నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్​గా ఉన్నాడు.

టాప్ బ్యాటర్లు

  • హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) - 874 రేటింగ్స్
  • జో రూట్ (ఇంగ్లాండ్) - 850 రేటింగ్స్
  • స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 840 రేటింగ్స్
  • ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) - 811 రేటింగ్స్
  • టెంబ బవూమా (సౌతాఫ్రికా) - 775 రేటింగ్స్

లంకకు ఫాలో ఆన్ ఇచ్చిన భారత్- రెండో ఇన్నింగ్స్‌లోనూ తొలి దెబ్బ!

ఆసియా గేమ్స్ క్రికెట్ షెడ్యూల్ రిలీజ్ - భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్​కు