ETV Bharat / sports

చరిత్ర సృష్టించిన హర్మన్​ప్రీత్- తొలి మ్యాచ్​లో రికార్డులే రికార్డులు

మహిళల ప్రీమియర్ లీగ్- ఆర్సీబీ శుభారంభం- తొలి రోజే నమోదైన పలు రికార్డులు

MIW vs RCBW
MIW vs RCBW (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : January 10, 2026 at 1:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Harmanpreet Kaur WPL Records : ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు బాదిన భారత క్రికెటర్​గా నిలిచింది. ​తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 20 పరుగులు చేసిన హర్మన్ ఈ రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మను హర్మన్ అధిగమించింది.

నవీ ముంబయి వేదికగా ముంబయి- ఆర్సీబీ మ్యాచ్​తో ఈ ఎడిషన్ డబ్ల్యూపీఎల్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్​లో ముంబయి తొలుత బ్యాటింగ్​కు దిగింది. ఇందులో హర్మన్ దూకుడుగా ఆడే క్రమంలో 20 పరుగులకు పెవిలియన్ చేరింది. అయితే అంతకంటే ముందే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్మన్ ఈ ఘనత అందుకుంది. దీంతో హర్మన్ (871 పరుగులు) డబ్ల్యూపీఎల్​లో అత్యధిక పరుగుల సాధించిన భారత క్రికెటర్​గా నిలిచింది. ఆమె తర్వాత దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ షఫాలీ వర్మ (865 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతోంది.

కాగా, 2023లో డబ్ల్యూపీఎల్ ప్రారంభమైంది. ఇందులో హర్మన్ ఇప్పటిదాకా 28 మ్యాచ్​ల్లో 39.59 సగటుతో 871 పరుగులు చేసింది. ఇందులో 8 హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. 95 పరుగులు అత్యధిక స్కోర్​గా ఉంది. అటు షఫాలీ వర్మ 27 మ్యాచ్​ల్లో 36 సగటుతో 865 పరుగులు చేసింది. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఓవరాల్​గా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్​లో నాట్ సీవర్ టాప్​లో ఉంది. ఆమె 30 మ్యాచ్​ల్లో 1031 పరుగులు చేసింది. అలాగే ఈ టోర్నీలో ఇప్పటిదాకా 1000 రన్స్​ మార్క్ అందుకున్న ఏకైక క్రికెటర్​ కూడా నాట్ సీవరే.

WPLలో టాప్ 5 స్కోరర్లు

  • నాట్ సీవర్ (ముంబయి ఇండియన్స్)- 1031 పరుగులు
  • ఎలిస్ పెర్రీ (ఆర్సీబీ)- 972 పరుగులు
  • మెగ్ లానింగ్ (దిల్లీ క్యాపిటల్స్)- 952 పరుగులు
  • హర్మన్​ప్రీత్ కౌర్ (ముంబయి ఇండియన్స్)- 871 పరుగులు
  • షఫాలీ వర్మ (దిల్లీ క్యాపిటల్స్)- 865 పరుగులు

ఆ బౌలర్​దీ రికార్డే
ఇదే మ్యాచ్​లో ఆర్సీబీ బౌలర్ లారెన్ బెల్ కూడా అరుదైన ఘనత సాధించింది. బుల్లెట్​లాంటి బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయ్యింది. ఆమె నాలుగు ఓవర్ల స్పెల్​లో 3.50 ఎకనామీతో 14 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసుకుంది. ఇందులో ఒక మెయిడెన్ కూడా ఉండడం విశేషం. అలాగే తన స్పెల్​లో ఏకంగా 19 బంతులను డాట్ బాల్స్​గా మలిచింది.

ఈ క్రమంలోనే లారెల్ అద్భుత ఘతన అందుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్​లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన రెండో బౌలర్​గా నిలిచింది. అయితే ఈ రికార్డు షబ్నిమ్ ఇస్మాయిల్ పేరిట ఉంది. ముంబయి ఇండియన్స్ తరపున ఇస్మాయిల్ సింగిల్ ఇన్నింగ్స్​లో 20 బంతులను డాట్ బాల్స్​గా మలిచింది.

ఇక మ్యాచ్​విషయానికొస్తే, ఆర్సీబీ ఉత్కంఠ విజయం అందుకుంది. 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి ఓవర్లన్నీ (20) ఆడి అందుకుంది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సిన దశలో నదైన్ డి క్లెర్క్ (63* పరుగులు) అద్భుతంగా పోరాడింది. తొలి రెండు బంతులు డాట్​ ఆడినా, ఆ తర్వాత నాలుగు బంతులకు వరుసగా 6,4,6,4 బాది ఆర్సీబీకి అద్భుతమైన విజయం అందించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 154-6 స్కోర్ చేసింది. సజీవన్ సజన (45 పరుగులు, 25 బంతుల్లో), నికొలే కేరీ (40 పరుగులు) రాణించారు.

WPL 2026: కొత్త కెప్టెన్లు క్రేజీ టీమ్స్ ఈసారి కప్పు ఎవరిదో?

WPL షెడ్యూల్ రిలీజ్- 22 మ్యాచ్​లు- రెండే వేదికలు