'విరాట్ స్ఫూర్తి వల్లే సెన్సేషనల్ విక్టరీ- ఆయన నాకు అండగా నిలిచారు'- PV సింధు
జపాన్ ఓపెన్ విజయంపై పీవీ సింధు కీలక వ్యాఖ్యలు - క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాలే విజయానికి దోహదం చేశాయంటూ కామెంట్స్

Published : July 21, 2026 at 2:13 PM IST
PV Sindhu on Virat Kohli : 2026 జపాన్ ఓపెన్ విన్నర్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా టీమ్ఇండియా క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి కష్టల్లో ఉన్నప్పుడు తనకు విరాట్ అండగా నిలిచాడని పేర్కొంది. కెరీర్‌లో కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను విరాట్‌ను కలిశానని, ఆ సమయంలో అతడి మాటలు ఆమెలో స్ఫూర్తి నింపాయని చెప్పింది. ఈ మేరకు తాజాగా సింధు వ్యాఖ్యలు చేసింది.
"నేను విరాట్ భాయ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటా. నా కెరీర్‌లో కష్టాలు ఎదుర్కొంటున్న దశలో విరాట్‌ను నేను కలిశాను. వరుసగా గాయాలపాలవ్వడం, ఫామ్ కోల్పోయి అనుకూల ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైమ్‌లో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలని అనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే నేను విరాట్ భాయ్‌కి ఫోన్ చేశాను. ఆయన కూడా తొందరగా స్పందించారు. ఆ తర్వాతి రోజే ఆయనను కలిశా. అప్పుడు కోహ్లీ నాను అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు నా కమ్‌బ్యాక్‌కు ఉపయోగపడ్డాయి. విరాట్ భాయ్ చెప్పిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి సలహా నా మనసులోనూ, నా భర్త దత్ మనసులోనూ బలంగా నాటుకుపోయాయి. ఏ వ్యక్తి ఆలోచనా విధానాన్నైనా పూర్తిగా మార్చగల శక్తి కొందరికి ఉంటుందని అంటుంటారు. అందుకు విరాట్ భాయ్ మాటలే నిదర్శనం" అని విరాట్ తనకు ఇచ్చిన సలహాలు, మద్దతును సింధు గుర్తు చేసుకుంది. ఈ మేరకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపింది.
PV Sindhu said, “I reached out to Virat bhai at one of the lowest points of my career. Injuries were piling up, the results weren’t coming, and I just needed someone who understood. I met Virat the very next day, what we spoke about will always stay between us. But I’ll always be… pic.twitter.com/EwNhzlUVYa
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2026
కాగా, సింధు గత వారం జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి అకనే యమగుచిని ఓడించి సింధు విజేతగా నిలిచింది. ఆమె వరుసగా రెండు గేమ్‌లలో 21-17, 21-17 తేడాతో ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారతీయ తొలి షట్లర్‌గా సింధు రికార్డు సృష్టించింది.
PV SINDHU BECOMES THE FIRST EVER INDIAN TO WIN THE JAPAN OPEN! 🇯🇵🤩
— The Khel India (@TheKhelIndia) July 19, 2026
- Sindhu defeats Home Favourite and Three-time World Champion Akane Yamaguchi
QUEEN SINDHU FINALLY WINS S750
TITLE! pic.twitter.com/mJQONE5NwQ

