ముకుల్ ధనాధన్ ఇన్నింగ్స్- కోల్‌కతాపై లఖ్‌నవూ విజయం
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం

Published : April 10, 2026 at 6:54 AM IST
IPL 2026 LSG vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్‌ను లఖ్‌నవూ 7 వికెట్లు కోల్పోయి ఓవర్లన్నీ ఆడి ఛేదించింది. ఛేదనలో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో యువ సంచలనం ముకుల్ చౌదరి ఆటే హైలైట్. అతడు ఏడో నెంబర్లో బ్యాటింగ్క వచ్చి (54 పరుగులు, 27 బంతుల్లో) రఫ్పాడించాడు. ఆయుశ్ బదోనీ (54 పరుగులు) కూడా హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, అనుకల్ రాయ్ చెరో 2, సునీల్ నరైన్, కార్తిక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనలో లఖ్‌నవూకు మంచి ఆరంభంమే దక్కింది. నాలుగు ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 41-0. అప్పటికి ఓపెనర్లు మిచెల్ మార్ష్ (15), ఎయిడెన్ మార్క్రమ్ (22) ఊపుమీదున్నారు. కానీ వైభవ్ అరోరా వీళ్లిద్దర్నీ ఐదో ఓవర్లో పెవిలియ్ చేర్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (10), నికోలస్ పూరన్ (13), అబ్దుల్ సమద్ (2)కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో కష్టాల్లో ఉన్న జట్టును తొలుత బదోనీ ఆదుకున్నాడు. కానీ అతడికి మరోవైపు సహకారం కరవైంది. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో 12.5 ఓవర్ వద్ద బదోనీ కూడా ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లో షమీ (1) పెవిలియన్ చేరాడు. దీంతో కేకేఆర్ గెలుపు దాదాపు ఖరారైంది.
ముకుల్ మెరుపులు
16 ఓవర్లకు లఖ్‌నవూ 128- 7 స్కోర్‌తో నిలిచింది. ముకుల్ అప్పటికి ఆరు బంతులు ఆడి రెండు పరుగులే చేశాడు. కానీ ఆ తర్వాతే ముకుల్ రెచ్చిపోయాడు. వైభవ్ వేసిన 17వ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదాడు. ఆ తర్వాత కార్తిక్ ఓవర్లో రెండు సిక్స్‌లు, గ్రీన్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది లఖ్‌నవూ విజయంపై ఆశలు పెంచాడు. దీంతో ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరం అయ్యాయి. ఈ ఓవర్లో తొలి బంతికి ఆవేశ్ సింగిల్ తీశాడు. రెండో, ఐదో బంతులను సిక్స్‌లుగా మలిచిన ముకుల్ స్కోర్లు సమం చేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఆఖరి బంతికి లెగ్ బై సింగిల్ తీసి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు.
𝙒𝙝𝙚𝙧𝙚 𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙈𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🌟
— IndianPremierLeague (@IPL) April 9, 2026
Match Highlights ▶️ https://t.co/oRJ8xhisZo #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/siPbp8yuRj
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (41 పరుగులు), అంగరిష్ రఘువంశీ (45 పరుగులు), కామెరూన్ గ్రీన్ (32 పరుగులు), రొమన్ పావెల్ (39 పరుగులు) ఫర్వాలేదనిపించారు. లఖ్‌నవూ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మనిమారన్ సిద్ధార్థ్, దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ తలో 1 వికెట్ పడగొట్టారు.
Mapped to perfection 😎
— IndianPremierLeague (@IPL) April 9, 2026
Mukul Choudhary's night to remember 👏👏
Relive his knock ▶️ https://t.co/BBfJfN7tYX #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/fStyb8UNlG
నాలుగో 'సారీ'
ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లోనూ కేకేఆర్ గెలుపు ఖాతా తెరవలేదు. ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్, లఖ్‌నవూతో మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది. మధ్యలో పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో కేకేఆర్ కేవలం 1 పాయింట్‌తో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ఈ నెల 11న కోల్‌కతా తమ తదుపరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడాల్సి ఉంది.
'ఒక్కో పరుగుకు రూ.1 కోటి!'- IPLలో తుస్సుమంటున్న కాస్ట్లీ ప్లేయర్
కోల్‌కతా X పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దు- ఇరు జట్లకు చెరో పాయింట్

