ETV Bharat / sports

జింబాబ్వేపై భారత్ ఘన విజయం- సెమీస్ ఆశలు సజీవం

T20 World Cup 2026 : గెలుపు బాట పట్టిన భారత్- జింబాబ్వేపై భారీ తేడాతో ఘన విజయం - సెమీస్ ఆశలు సజీవం

India vs Zimbabwe
India vs Zimbabwe (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : February 26, 2026 at 10:37 PM IST

3 Min Read
Choose ETV Bharat

India vs Zimbabwe : సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 257 పరుగుల భారీ ఛేదనలో జింబాబ్వే ఓనర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితం అయ్యింది. బ్రియాన్ బెన్నెట్ (97* పరుగులు) భారీ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. టీమ్ఇండియా బౌలర్లలో అర్షదీప్ 3, వరణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

కాగా, ఛేదనలో జింబాబ్వే పూర్తిగా చేతులేమి ఎత్తేయలేదు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికీ ఆత్మ విశ్వాసంతోనే పోరాడింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ అద్భుతంగా పోరాడాడు. కెప్టెన్ సికందర్ రజా (31 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. వీళ్ల పోరాటంతో జింబాబ్వే ఓటమి అంతరాన్ని తగ్గించుకుంది. ఇక మెరుపు ఇన్నింగ్స్​తో హాఫ్ సెంచరీ సాధించిన టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డ్ లభించింది.

రెండో బ్యాటర్​గా ఘనత
జింబాబ్వే బ్యాటర్​ బెన్నెంట్ ఈ మ్యాచ్​లో సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయాడు. అయినప్పటికీ అతడు అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్​లో భారత్​పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్​గా నిలిచాడు. ఈ లిస్ట్​లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ టాప్​లో ఉన్నాడు. 2010 ఎడిషన్​లో అతడు భారత్​పై 98 పరుగులు సాధించాడు. ఇదే పొట్టి కప్పులో భారత్​పై ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్.

భారత్ ధనాధన్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ఇండియా 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (55 పరుగులు), హార్దిక్ పాండ్య (50* పరుగులు, 23 బంతుల్లో), తిలక్ వర్మ (44* పరుగులు), ఇషాన్ కిషన్ (38 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (33 పరుగులు) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎంగరవ, బ్లెస్సింగ్స్ ముజర్బాని, మపోస, సికందర్ రజా తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

సెమీఫైనల్ రేస్​పై క్లారిటీ
తాజా మ్యాచ్ ఫలితంతో గ్రూప్ 1 సెమీస్ రేస్​పై ఓ క్లారిటీ వచ్చింది. జింబాబ్వేపై భారత్ నెగ్గడంతో సౌతాఫ్రికా సెమీస్​కు అర్హత సాధించింది. అలాగే ఈ విజయంతో భారత్ కూడా తమ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సూపర్ 8లో ఇప్పటిదాకా రెండు మ్యాచ్​ల్లో ఒక విజయం సాధించిన టీమ్ఇండియా 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ గ్రూప్​లో మిగిలిన ఒక స్థానం కోసం భారత్- వెస్టిండీస్ మధ్య పోటీ ఉంది. మార్చి 01న ఈ రెండు జట్లే తలపడాల్సి ఉంది. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా సెమీస్​కు అర్హత సాధిస్తుంది. ఎలాంటి సమీకరణాలు చూసుకోవాల్సిన పని లేదు. ఇక సూపర్ 8లో వరుసగా రెండు ఓటములతో జింబాబ్వే సెమీస్​ రేసు నుంచి నిష్క్రమించింది.

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఒక మ్యాచ్​లో నమోదైన అత్యధిక స్కోర్లు (ఇరు జట్ల స్కోర్లు కలిపి)

  • 459 పరుగులు - సౌతాఫ్రికా vs ఇంగ్లాండ్ - వాంఖడే 2016
  • 440 పరుగులు - భారత్ vs జింబాబ్వే - చెన్నై 2026 *
  • 418 పరుగులు - భారత్ vs ఇంగ్లాండ్- డర్బన్ 2007
  • 413 పరుగులు - వెస్టిండీస్ vs సౌతాఫ్రికా- జొహెన్నస్​బర్గ్ 2007
  • 401 పరుగులు - వెస్టిండీస్ vs జింబాబ్వే- వాంఖడే 2026

భారత్ చెత్త రికార్డ్
ఈ మ్యాచ్​లో రెండు నో బాల్స్​తో కలిపి భారత్ ప్రస్తుత టోర్నీలో ఇప్పటిదాకా మొత్తం 7 నోబాల్స్ వేసింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్​లో సింగిల్ ఎడిషన్​లో అత్యధిక నోబాల్స్ వేసిన జట్టుగా కెనడాతో సమానంగా నిలిచింది. కాగా, ఈ ఏడులో ఆల్​రౌండర్ శివమ్ దూబే ఒక్కడే 5 నోబాల్స్ వేయడం గమనార్హం.

విధ్వంసం సృష్టించిన భారత్ - జింబాబ్వే ముంగిట భారీ టార్గెట్!

సెమీస్ రేస్- భారత్ ఛాన్స్​లేంటి?- ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి?- రేపే క్లారిటీ!