సండే డబుల్ ధమాకా- ఒక్కరోజే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా మ్యాచ్‌లు!
క్రికెట్ ఫ్యాన్స్‌కు సూపర్ సండే- దీపావళికి ముందు రోజే డబుల్ ధమాకా

Published : October 16, 2025 at 5:25 PM IST
Sunday Cricket Matches : భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ వేరు. టీమ్ఇండియా మ్యాచ్ ఏదైనా వీకెండ్లో వస్తుందంటే ఆ మజా వేరుగా ఉంటుంది. అలాంటిది ఒక్క ఆదివారమే టీమ్ఇండియా రెండు వన్డే మ్యాచ్‌లు ఆడడం చూస్తే. ఇంకేముంది ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషిగా ఉంటారు. ఇప్పుడు క్రికెట్ లవర్స్‌కు అలాంటి ఆదివారమే రానుంది. అక్టోబర్ 19న ఫ్యాన్స్‌కు రెండు భారీ మ్యాచ్‌లు చూసే అవకాశం కలగనుంది. దీంతో దీపావళి పండగకు ముందే సండే డబుల్ ధమాకా ఉండనుంది. మరి ఆ మ్యాచ్‌లు ఏంటంటే?
భారత్ x ఆస్ట్రేలియా
ఈ ఆదివారం (అక్టోబర్ 19న) భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ఆరంభించనుంది. ఈ టూర్లో భాగంగా ఆదివారం తొలి వన్డేలో ఇరుజట్లు తలపడనున్నాయి. పెర్త్‌లోని ఆప్టస్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఉదయం 9:00 గంటలకు ఆట ప్రారంభమవుతుంది. భారత్ వన్డేల్లో తొలిసారి యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో అంతర్జాతీయ మ్యాచ్ అడనుంది.
అటు ఆస్ట్రేలియా కూడా బలమైన జట్టుతోనే టీమ్ఇండియాను ఢీ కొట్టనుంది. మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆసీస్ యువ పేసర్లగా బలంగా కనిపిస్తుంది. దీంతో మైదానంలో హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా టీమ్ఇండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో బరిలో దిగనున్నారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసం ఆత్రుకగా ఎదురుచూస్తున్నారు.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత్ జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
భారత్ x ఇంగ్లాండ్
మరోవైపు, భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో మరో పోరుకు సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ఇంగ్లాండ్‌తో భారత్ మహిళల జట్టు ఆదివారం ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇందులో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ రెడీ అవుతుండగా, నాట్ సీవర్ నాయకత్వంలో ఇంగ్లాండ్ బరిలో దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని భారత్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో మహిళల మ్యాచ్‌పైనా ఫుల్ బజ్ ఉంది. ఇలా రానున్న ఆదివారం ఒకే రోజు టీమ్ఇండియా పురుషుల, మహిళల జట్లు కీలక మ్యాచ్‌ల్లో వేర్వేరుగా వేర్వేరు ప్రత్యర్థులను ఢీ కొట్టనున్నాయి. ఇది క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. రెండు జట్లు కూడా అదరగొట్టి, రెండింట్లోనూ భారత్ నెగ్గాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Indore 📍
— BCCI Women (@BCCIWomen) October 16, 2025
Aim 👉 Hit 👉 Earn points......but all comes with a unique challenge 😉
All fielding objectives achieved from #TeamIndia's energetic session ahead of #INDvENG ✅
Get your #CWC25 tickets 🎟 now: https://t.co/vGzkkgwpDw#WomenInBlue pic.twitter.com/F1WpvBefrn
మహిళల ప్రపంచకప్ భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతీ రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), భ్రాంత్ యాస్త్ కౌర్, రజోత్ యాస్త్ కౌర్, రజోత్ కౌర్ మరియు స్నేహ రానా
ఆసీస్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన వరల్డ్ రికార్డులు- తొలి బ్యాటర్‌గా ఘనత
యాక్షన్ మోడ్‌లోకి రోహిత్, విరాట్- ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?

