ETV Bharat / sports

కివీస్​ టూర్ షెడ్యూల్ ఔట్- రోహిత్, విరాట్​ కెరీర్​లో ఇదే ఆఖరి పర్యటన!

భారత్ x న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్ ప్రకటన- 40 రోజుల లాంగ్ టూర్- మూడు ఫార్మాట్లలో 12 మ్యాచ్​లు !

India Tour Of New Zealand
India Tour Of New Zealand (Sourrce : AFP)
author img

By ETV Bharat Sports Team

Published : June 3, 2026 at 4:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ind vs NZ Series 2026 : భారత్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్​లో టీమ్ఇండియా కివీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్​లో ఆతిథ్య జట్టుతో భారత్ వన్డే, టీ20, టెస్టు సిరీస్​లు ఆడనుంది. ఈ సిరీస్​లకు సంబంధించిన ఫుల్ షెడ్యూల్​, తేదీలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. మరి ఈ పర్యటనలో ఏ సిరీస్​ ఎప్పుడెప్పుడు జరగనుందంటే?

లాంగెస్ట్​ టూర్
ఈ పర్యటన అక్టోబర్ - డిసెంబర్ మధ్యలో దాదాపు 40 రోజులు జరగనుంది. న్యూజిలాండ్ క్రికెట్ హిస్టరీలోనే ఇది అతి పెద్ద క్రికెట్ టూర్ కానుంది. గతంలో ఏ జట్టుకు కూడా కివీస్ ఇంత సుదీర్ఘ కాలం ఆతిథ్యం ఇవ్వలేదు. దీంతో ఈ టూర్​కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే ఇది ఇరుదేశాల మధ్య నెలకొన్న 100ఏళ్ల క్రీడా సంబంధాలకు నిదర్శనంగా నిలువనుంది.

టెస్టులతో షురూ
టీ20 సిరీస్​తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. 2026 అక్టోబర్ 27 న తొలి టీ20తో ఈ టూర్​ షురూ అవుతుంది. ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో భారత్- కివీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆ తర్వాత ఐదు మ్యాచ్​ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్​కు భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలో దిగే ఛాన్స్ ఉంటుంది. ఇక చివరగా టెస్టు సిరీస్​తో ఈ పర్యటన ముగుస్తుంది. ఇరు జట్లు మధ్య రెండు టెస్టు మ్యాచ్​లు ఉన్నాయి.

భారత న్యూజిలాండ్ పర్యటన పూర్తి షెడ్యూల్

టీ20 సిరీస్​

  • తొలి T20- అక్టోబర్ 22- క్రైస్ట్‌చర్చ్
  • రెండో T20- అక్టోబర్ 24- క్రైస్ట్‌చర్చ్
  • మూడో T20- అక్టోబర్ 27- వెల్లింగ్టన్
  • నాలుగో T20- అక్టోబర్ 30- ఆక్లాండ్
  • ఐదో T20- నవంబర్ 1- హామిల్టన్

వన్డే సిరీస్​

  • తొలి వన్డే- నవంబర్ 4- ఆక్లాండ్
  • రెండో వన్డే- నవంబర్ 7- వెల్లింగ్టన్
  • మూడో వన్డే- నవంబర్ 10- హామిల్టన్
  • నాలుగో వన్డే- నవంబర్ 13- మౌంట్ మాంగనుయి
  • ఐదో వన్డే - నవంబర్ 15- మౌంట్ మాంగనుయి

టెస్టు సిరీస్

  • తొలి టెస్టు - నవంబర్ 19-23- వెల్లింగ్టన్
  • రెండో టెస్టు - నవంబర్ 27 - డిసెంబర్ 01- క్రైస్ట్‌చర్చ్

ఇలా 40 రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య కివీస్​తో 5 వేదికల్లో మొత్తం 12 మ్యాచ్​లు ఆడనుంది.

ఆరేళ్ల తర్వాత
అయితే కివీస్ గడ్డపై ఆరేళ్ల తర్వాత టీమ్ఇండియా టెస్టు సిరీస్​ ఆడనుంది. 2019లో న్యూజిలాండ్​లో భారత్ చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడింది. ఇక 2022 తర్వాత ఆ దేశంలో భారత్ ఆడుతున్న తొలి వైట్ బాల్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. 2022 నవంబర్​లో కివీస్​లో టీమ్ఇండియా వన్డే సిరీస్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఈ పర్యటనతోనే కివీస్ గడ్డపై టీమ్ఇండియా ఆడనుంది.

ఆఖరి పర్యటన
మరోవైపు స్టార్లు రోహిత్, విరాట్​కు తమ కెరీర్​లో ఇదే ఆఖరి న్యూజిలాండ్ పర్యటన అయ్యే అవకాశం ఉంది. టీ20, టెస్టులకు గుడ్​బై చెప్పేసిన ఈ స్టార్లు వన్డే ఫార్మాట్​లోనే ఆడుతున్నారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్​కప్​లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరికి తమతమ కెరీర్​లో మరోసారి న్యూజిలాండ్​లో ఆడే అవకాశం రాకపోవచ్చు!

అఫ్గాన్ సిరీస్​
మరో మూడు రోజుల్లో టీమ్ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్​లో మళ్లీ సందడి చేయనుంది. భారత్ పర్యటనకు అఫ్గానిస్థాన్ రానుంది. ఈ టూర్​లో ఏకైక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 06న టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు ముల్లాన్​పుర్ వేదిక కానుంది. ఆ తర్వాత జూన్ 13న ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది. జూన్ 17న రెండో, 20న మూడో వన్డేలో అఫ్గాన్- భారత్ ఢీ కొట్టనున్నాయి.

2026 IPL : ఈ సీజన్​లో వైభవ్ సూర్యవంశీ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?

ఐపీఎల్​ షెడ్యూల్​లో మార్పులు- వచ్చే ఏడాది మార్చి 15 నుంచే టోర్నీ?