వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం- నేరుగా సెమీఫైనల్‌లోకి ఎంట్రీ
వరల్డ్ కప్ 2025- వెస్టిండీస్‌పై భారత్ విక్టరీ- ఇంటిముఖం పట్టిన వెస్టిండీస్

Published : March 1, 2026 at 10:56 PM IST
India Vs West Indies : ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 కీలక పోరులో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి, భారత్ అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
విండీస్‌ను కట్టడి చేసిన బుమ్రా
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ఓపెనర్లు షై హోప్, రోస్టన్ ఛేజ్ ఆరంభంలో మంచిగా రాణించారు. రోస్టన్ ఛేజ్ 40 పరుగులు చేయగా, షై హోప్ 32 పరగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన షిమ్రోన్ హెట్‌మయెర్ పరుగుల వేగాన్ని మరింత పెంచాడు. కేవలం 12 బంతుల్లోనే 27 పరగులు చేశాడు. ఈ సమయంలోనే వెస్టిండీస్ పరుగుల వేగానికి భారత్ బౌలరు జస్ప్రీత్ బుమ్రా బ్రేక్ వేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆ జట్టును కట్టడి చేశాడు. షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ 14 పరుగులు చేశాడు. ఇక చివరిలో జేసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్ చెలరేగడంతో వెస్టీండిస్ 195 పరుగులు చేసింది. జేసన్ హోల్డర్ 37 పరుగులు చేయగా, రోవ్‌మన్ పావెల్ 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. వరణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య చెరో వికెట్ తీశారు.
A special knock from Sanju Samson powered India into the #T20WorldCup semi-finals with a win over West Indies 👊 📸
— ICC (@ICC) March 1, 2026
Read more on the action from Kolkata 👉 https://t.co/BjIcRa4jle pic.twitter.com/AFqAPZRLKF
సంజూ శాంసన్ విశ్వరూపం
అనంతరం 196 పరగుల లక్ష్యంతో టీమ్ఇండియా బరిలోకి దిగింది. ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెరో పది పరుగులే చేసి పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. 18 పరుగలకే వెనుదిరిగాడు. భారత్ స్కోరు 58 పరుగులే చేసింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న సంజూ శాంసన్ తన బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. సంజూకు తిలక్ వర్మ జత కట్టాడు. జోరుమీదున్న ఈ జోడికి హోల్డర్ బ్రేక్ వేశాడు. తిలక్‌ను పెవిలియన్‌కు పంపించాడు. కానీ శాంసన్ మాత్రం తగ్గలేదు. హార్దిక్‌తో కలిసి అప్పుడప్పుడు ఫోర్లు కొడుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. అయితే 19 ఓవర్ రెండో బంతికి హార్దిక్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.
చివరి క్షణాల్లో ఉత్కంఠ
ఆ ఓవర్లో వచ్చిన దూబె రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఆఖరి ఓవర్‌కు వచ్చే సరికి భారత్‌కు ఏడు పరుగులు చేయాల్సి వచ్చింది. తొలి బంతిలోనే శాంసన్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని కూడా బౌండరీకి తరలించి జట్టును సెమీస్‌కు చేర్చాడు. శాంసన్ల కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 97 పరుగులు చేశాడు.
Sanju Samson's magical innings of 97* powered India into the semi-finals of the #T20WorldCup 2026🪄
— ICC (@ICC) March 1, 2026
He wins the @aramco POTM🏅
📝: https://t.co/NqHEWKEn3o pic.twitter.com/ye0N1cvfCV
సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో ఢీ
ఈ విజయంతో సూపర్-8 గ్రూప్ నుంచి భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో భారత్- ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తుంటే, మరోసారి ప్రపంచకప్ ముద్దాడటం ఖాయంగా కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
India are through to the #T20WorldCup semi-finals ✨ pic.twitter.com/431RyYOLqw
— ICC (@ICC) March 1, 2026
సూపర్ -8 గ్రూప్-1లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించిన ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వెస్టిండీస్‌పై గెలిచిన భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. వెస్టిండీస్ (3 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు), జింబాబ్వే (0) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

