ETV Bharat / sports

రోహిత్, విరాట్ రీ ఎంట్రీలో ఫ్యాన్స్​కు షాక్- తొలి వన్డేకు వర్షం ముప్పు!

భారత్ x ఆస్ట్రేలియా మ్యాచ్- తొలి వన్డేకు వర్షం అడ్డంకి!

Ind vs Aus 1st ODI
Ind vs Aus 1st ODI (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : October 18, 2025 at 4:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ind vs Aus 1st ODI : మరో కొన్ని గంటల్లోనే భారత్- ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపైనే ఉన్నాయి. దాదాపు 7 నెలల తర్వాత ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్​లో రీ ఎంట్రీ ఇవ్వనుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల ఆశలకు గండి పడేటట్లు ఉంది. రేపు మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

వర్షం అడ్డంకి!
పెర్త్ వేదికగా జరగనున్న భారత్- ఆసీస్ తొలి వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. మ్యాచ్ సమయానికి వర్షం కురుస్తుందని అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ నివేదిక ప్రకారం 63 శాతం వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా సమయం ప్రకారం ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో సమయంలో వర్షం జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

మ్యాచ్ రద్దు అవుతుందా?
అయితే ఈ విషయంలో ఫ్యాన్స్​కు ఆనందం కలిగించే వార్త ఏంటంటే, వర్షం వల్ల మ్యాచ్‌ మొత్తంగా రద్దయ్యే ప్రమాదం లేదట. ప్రారంభం సమయం జల్లులు పడే అవకాశం ఉందట. అంతేకానీ మ్యాచ్ పూర్తిదా రద్దయ్యే ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది. కాకపోతే స్వల్ప వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందట. ఇక ఆ తర్వాత ఏ మాత్రం వర్షం కురిసే అవకాశాలు లేవట!

పిచ్ రిపోర్ట్
పెర్త్ స్టేడియంలోని పిచ్ తరచుగా ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా ఉంటుంది. పేసర్లకు అనుకున్నంత పేస్, బౌన్స్ లభిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభంలో ఇది ఎక్కువగా ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా 6 వన్డేలు జరిగాయి. ఇందులో అత్యధికంగా ఐదుసార్లు ఛేజింగ్ చేసిన జట్టే నెగ్గింది. ఒకసారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సగటుకు స్కోర్ 172 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్​ యావరేజ్ 171 రన్స్. ఇక్కడ 259 పరుగులు అత్యధిక టాప్ స్కోర్.

టీమ్ఇండియా జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్

ఆస్ట్రేలియా జట్టు : మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కోనోలీ, బెన్ డ్వార్షుషస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్

'వాళ్లు ప్రపంచంలోనే బెస్ట్ క్రికెటర్లు - ఆ విషయంలో అస్సలు సిగ్గు పడను'- శుభ్​మన్ గిల్

భారత్ x ఆస్ట్రేలియా రికార్డులు- గత సిరీస్​ రిజల్ట్స్- ఎవరిది పైచేయి?