సూర్యకుమార్‌కు భారీ షాక్- టాప్ 10 నుంచి ఔట్
ICC ర్యాంకింగ్స్ అప్డేట్ - టాప్ 2లో ఇద్దరు మనోళ్లే- దూసుకొచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్

Published : July 8, 2026 at 4:12 PM IST
ICC T20 Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. లేటెస్ట్ ర్యాకింగ్స్లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టాప్‌లోనే కొనసాగుతుండగా, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( 687 రేటింగ్స్) టాప్ 10 నుంచి ఔట్ అయ్యాడు. అతడు తాజా ర్యాకింగ్స్లో 5 స్థానాలు కోల్పోయి 13వ ర్యాంక్‌కు దిగజారాడు. ఇక ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాకప్ బెతెల్ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ 10లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం అతడు ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాడు.
అయితే ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత సూర్య టీ20 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేదు. దీంతో ర్యాంక్ పడిపోవడం సహజమే! ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ ఆడాడు. అయితే అందులో విఫలం కావడంతో సూర్య టీమ్ఇండియాలో చోటు కోల్పోయాడు. అతడిని గత నెలలో జరిగిన ఐర్లాండ్ పర్యటన, ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అలాగే ఇదే నెలలో జింబాబ్వేతో ఆడనున్న సిరీస్‌కు కూడా సూర్య ఎంపిక కాలేదు. దీంతో మున్ముందు సూర్య ర్యాంక్ మరింత పడిపోయే ఛాన్స్ ఉంటుంది!
England's T20I stars made important gains in the latest ICC Men's Player Rankings 🙌https://t.co/suYR1nWEKz
— ICC (@ICC) July 8, 2026
టాప్ 5 బ్యాటర్లు
- ఇషాన్ కిషన్ (భారత్) - 897 రేటింగ్స్
- అభిషేక్ శర్మ (భారత్) - 881 రేటింగ్స్
- షహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) - 841 రేటింగ్స్
- ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) - 798 రేటింగ్స్
- పాథుమ్ నిస్సంక (శ్రీలంక) - 751 రేటింగ్స్

