ETV Bharat / sports

విక్టరీ నెం '6'- కరీంనగర్​ను చిత్తు చేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

టీజీ 20లో దూసుకుపోతున్న హైదరాబాద్- వరుసగా ఆరో విజయం నమోదు- తాజా మ్యాచ్​లో కరీంనగర్​ను ఓడించిన అభిరథ్ సేన

Hyderabad vs Karimnagar
Hyderabad vs Karimnagar (ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : July 4, 2026 at 10:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad vs Karimnagar : టీజీ20లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు విజయాలతో టాప్​లో ఉన్న హైదరాబాద్, తాజాగా హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న కరీంనగర్ డైమండ్స్​కు చెక్ పెట్టింది. ఫలితంగా అభిరథ్ సేన టోర్నీలో రికార్డ్ స్థాయిలో వరుసగా ఆరో విజయం నమోదు చేసింది. ఉప్పల్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్​లో కరీంనగర్​పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 187 పరుగుల ఛేదనను హైదరాబాద్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైష్ణవ్ రెడ్డి (65), ప్రణవ్ వర్మ (38) రాణించారు. కెప్టెన్ అభిరథ్ రెడ్డి (26 పరుగులు), సాయి వికాస్ రెడ్డి (36 పరుగులు) అదిరే ఆరంభం అందించారు. కరీంనగర్ బౌలర్లలో దినేశ్, హరీశ్, తేజ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్​కు దిగిన కరీంనగర్ 6 వికెట్లు నష్టానికి 186 పరుగులు చేసింది. చందన్ సాహని (90 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. చివర్లో నారాయణ్ (45 పరుగులు), హర్షిత్ ఠాకూర్ (20 నాటౌట్, 9 బంతుల్లో) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అఖిల్ రాథోడ్ 2, దేవ్ మెహత 1, అజయ్ గౌడ్ 1 వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టార్గెట్ 187 పరుగులు.

Hyderabad Team
బహుమతి అందిస్తున్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​ (ETV Bharat)

ఎదురు లేని హైదరాబాద్
ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ఎదురే లేదు. ఆ జట్టుకు ఇది వరుసగా ఆరో విజయం. ఇప్పటిదాకా ఆరు మ్యాచ్​లు ఆడగా ఆరింట్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్​లో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఛాంపియన్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్ స్టేజ్​లో తమ ఆఖరి మ్యాచ్ జులై 06న నల్గొండ నైట్స్​తో ఆడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్​కు వెళ్లిన హైదరాబాద్​కు అది నామమాత్రపు మ్యాచే. కానీ ఆ జట్టు అందులోనూ నెగ్గి రికార్డు నెలకొల్పాలని భావిస్తోంది.

మరోవైపు, ఈ మ్యాచ్​కు ముందు కరీంనగర్ హ్యాట్రిక్ విజయాలు సాధించి జోరుమీదుంది. తొలి రెండు మ్యాచ్​ల్లో ఓడినా, తర్వాత మూడు మ్యాచ్​ల్లో వరుసగా నెగ్గి ప్లేఆఫ్స్​ రేసులో ఆశలు నిలుపుకుంది. తాజా ఓటమితో అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు గ్రూప్ స్టేజ్​లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. జులై 07న పాలమూరుతో ఆడాల్సి ఉంది. ఇందులో నెగ్గితేనే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.

Hyderabad Team
బహుమతి అందిస్తున్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​ (ETV Bharat)

హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తుది జట్టు : అభిరత్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, అన్విత్ రెడ్డి, గడుగు గణేష్, వైష్ణవ్ రెడ్డి ఎ, ప్రణవ్ వర్మ, పి అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ్ అశ్విన్

కరీంనగర్ డైమండ్స్ తుది జట్టు : సాత్విక్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కె సింహా, రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), చందన్ సహాని, నారాయణ్ తేజ, హరీష్ ఠాకూర్, శుభమ్ శర్మ, రత్లావత్ దినేష్, ఆశిష్ శ్రీవాస్తవ, సతీష్ కుమార్

Hyderabad Team
బహుమతిని అందిస్తున్న దివిజ (ETV Bharat)
Hyderabad Team
బహుమతిని అందిస్తున్న దివిజ (ETV Bharat)

రాణించిన హైదరాబాద్ బౌలర్లు- కరీంనగర్​ను ఆదుకున్న చందన్

ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి వైభవ్ ఎంట్రీ- 37ఏళ్ల నాటి సచిన్ రికార్డ్ బ్రేక్