TG 20 క్వాలిఫయర్ 1- ఫైనల్ బెర్త్‌పై హైదరాబాద్ కన్ను- ఖమ్మం పోటీనిస్తుందా?
టీజీ 20 తొలి క్వాలియఫర్ మ్యాచ్- ఖమ్మం జట్టుతో తలపడనున్న హైదరాబాద్ టీమ్- హోరాహోరీ పక్కా!

Published : July 9, 2026 at 1:05 AM IST
Hyderabad vs Khammam TG League : టీజీ 20 లీగ్‌లో పేరుకు తగ్గట్లే ఛాంపియన్ ఆటతీరుతో దూసుకుపోతున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కీలక పోరుకు రెడీ అయ్యింది. ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి గ్రూప్ స్టేజ్‌ను డామినేట్ చేసిన ఈ ఛాంపియన్స్ జట్టు గురువారం క్వాలిఫయర్ - 1 ఆడనుంది. ఈ మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్‌ను హైదరాబాద్ ఢీ కొట్టనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన టీమ్ క్వాలిఫయర్ 2కు వెళ్తుంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో 100 శాతం పోరాడడం పక్కా. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలేంటో ఓసారి చూసేద్దాం!
ఆ ఇద్దరు అన్‌స్టాపబుల్
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫేవరెట్‌గా బరిలో ఉంటుందనడంలో అనుమానం లేదు! ఆ జట్టు ఆటతీరే అందుక్కారణం. ఈ జట్టులో దాదాపు అందరూ ఆల్‌రౌండర్లు ఉండడం అదనపు బలం. ముఖ్యంగా కెప్టెన్ అభిరథ్ రెడ్డి తొలి మ్యాచ్ నుంచి జట్టు బ్యాటింగ్‌లో వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో 69.67 సగటున ఇప్పటిదాకా 418 పరుగులు బాదాడంటే అతడి విధ్వంసం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా బరిలో దిగుతూ తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అవుతున్నాడు.
బ్యాటింగ్‌తోపాటు మైదానంలో అసలైన కెప్టెన్ అనిపించుకుంటున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన బౌలర్‌ను ఎంపిక చేసుకోవడం, ఫీల్డింగ్ సెట్టింగ్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొడుతూ అసలైన నాయకుడిగా నిలుస్తున్నాడు. మరోవైపు, అజయ్ దేవ్ గౌడ్ బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని పరుగులు ఇచ్చినా క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని దెబ్బ తీస్తున్నాడు. ఇప్పటిదాకా అజయ్ 16 వికెట్లు కూల్చి పర్పుల్ క్యాప్ రేస్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
One step from the final. #HyderabadEChampions #TG20 #Cricket #SixerMaarSeetiMaar #AnvitaKhammamAces pic.twitter.com/DZ99tWnOuD
— Hyderabadechampions (@HydeChampions) July 8, 2026
నిలకడకు మరో పేరుగా!
పైన చెప్పిన ఇద్దరితోపాటు గణేశ్ గడుగు, ప్రణవ్ వర్మ నిలకడకు మరో పేరుగా నిలుస్తున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు అవసరమైన సమయంలో బ్రేక్ ఇస్తున్నారు. గణేశ్ ఎక్కువగా బ్యాటింగ్ (224 రన్స్) లో అదరగొడుతుండగా, ప్రణవ్ బంతి (9 వికెట్లు) తో ప్రభావం చూపిస్తున్నాడు. ప్రణవ్ కూడా బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడు. వీళ్లతోపాటు షణ్ముక అశ్విన్, అన్విత్ రెడ్డి, సాయి వికాస్ రెడ్డిపైనా అంచనాలు ఉన్నాయి. వీళ్లు మరోసారి రాణిస్తే క్వాలిఫయర్‌లో గెలుపొందడం పెద్ద కష్టమేమీ కాదు!
The force behind the E-Champions.
— Hyderabadechampions (@HydeChampions) July 8, 2026
Line. Length. Results.
Meet the Bowling Unit 🙌🏻#hyderabadechampions #TG20 #riseofhyderabad #Cricket #sixermaarseetimaar pic.twitter.com/qyU0LZe0na
ఖమ్మం బలంగానే!
హైదరాబాద్ ప్రత్యర్థి అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు కూడా పటిష్ఠంగా ఉంది. ఈ జట్టు గ్రూప్ స్టేజ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు నెగ్గి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఈ టీమ్‌కు టాపార్డర్ బ్యాటర్ కొడిమెల హిమతేజ అత్యంత బలం. అతడు బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటిదాకా 107.75 యావరేజ్‌తో 431 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ రేస్‌లో టాప్‌లో ఉన్నాడు. అతడితోపాటు జీఎస్కే రెడ్డి, వాఫీ కచ్చి కూడా తమదైన రోజు చెలరేగే ఆటగాళ్లే. బౌలింగ్‌లో కెప్టెన్ మిలింద్, వేద్ రెడ్డి, విద్యానంద్ రెడ్డి, వాఫీ కచ్చి రాణిస్తున్నారు. ఈ జట్టు చివరగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఊపుమీదుంది. ఇదే జోష్‌లో హైదరాబాద్‌పై గ్రూప్ స్టేజ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇలా ఇరుజట్లు కూడా బలమైన ఆటగాళ్లతో ఉండడంతో పోటీ ఉత్కంఠగా ఉండడం ఖాయంగా కనిపిస్తుంది.
𝐏𝐞𝐫𝐟𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐚𝐫𝐭! 🙌#AnvitaKhammamAces #ManaKhammamManaAata #TG20 pic.twitter.com/qdsqSUGeBn
— Anvita Khammam Aces (@anvitakammamace) July 8, 2026
ముఖాముఖి పోరు
ఈ టోర్నీలో హైదరాబాద్- ఖమ్మం జట్లు ఇప్పటికే లీగ్ దశలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఈ ఛాంపియన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఖమ్మం జట్టును హైదరాబాద్ 56 పరుగులతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ ఛాంపియన్స్ 211-9 పరుగుల చేయగా, ఛేజింగ్‌లో ఖమ్మం 155-9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయం క్వాలిఫయర్ 1లో ఖమ్మంపై పైచేయి సాధించడానికి ఆత్మి విశ్వాసం పెంచుతుంది.
తుది జట్లు అంచనా
హైదరాబాద్ - అభిరత్ రెడ్డి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, వైష్ణవ్ రెడ్డి ఎ (వికెట్ కీపర్), గడుగు గణేశ్, అన్విత్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్, అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్
ఖమ్మం - వాఫీ డైమండ్ కచ్చి, GSK రెడ్డి, కొడిమెల హిమతేజ, మిక్కిల్ జైస్వాల్, షేక్ అజర్, ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), సహేంద్ర మల్లు, చామ వి మిలింద్ (కెప్టెన్), విద్యానంద రెడ్డి, వేద్ రెడ్డి, హర్షిత్ సాయి వై
'రేస్ టు టైటిల్'- ఒకేరోజు రెండు నాకౌట్ మ్యాచ్‌లు- TG 20 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే!
TG20 ప్లేఆఫ్స్ లైనప్ ఖరారు- కరీంనగర్, రంగారెడ్డి చివరి బెర్తులు సొంతం

