'రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావ్?'- వైభవ్‌కు రవిశాస్త్రి ఫన్నీ క్వశ్చన్
ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ - భారత మాజీ కోచ్ రవి శాస్త్రి అడిగిన ఒక సరదా ప్రశ్న ఇప్పుడు నెట్టింట్లో వైరల్

Published : June 1, 2026 at 7:26 AM IST
Ravi Shastri Funny Question Vaibhav : ఐపీఎల్ 2026 సీజన్‌లో రికార్డులతో మోత మోగించాడు 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. దీంతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. అతడు కొట్టిన భారీ సిక్సర్లు చూసిన తర్వాత, భారత మాజీ కోచ్ రవి శాస్త్రి అడిగిన ఒక సరదా ప్రశ్న ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
రోజుకు ఎన్ని పాలు తాగుతారు?
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ వరుసగా భారీ షాట్లు ఆడాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్‌లో వైభవ్ పవర్ హిట్టింగ్‌కు ముగ్ధుడైన రవి శాస్త్రి "ఆప్ ఏక్ దిన్ మే కిత్నా దూద్ పీతే హై? (రోజుకు ఎన్ని పాలు తాగుతావ్?)" అని వైభవ్‌ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశం కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతటి బలం, టైమింగ్‌తో సిక్సర్లు బాదుతున్న యువ ఆటగాడి శక్తి రహస్యం ఏమిటో తెలుసుకోవాలనే రవిశాస్త్రి ఆసక్తి మాత్రమే అని తెలుస్తోంది. అయితే వైభవ్ దీనికి సమాధానం చాలా సింపుల్‌గా చెప్పాడు. "నేను ఇప్పుడు పాలు తాగడం లేదు. నా ఆటనే నేను నమ్ముతాను. నాకు ఆత్మవిశ్వాసం ఉంది. మొదటి బంతి నా జోన్‌లోకి వస్తే దాన్ని కొట్టేందుకు ప్రయత్నిస్తాను" అని చెప్పాడు.
Age no bar for this truly special teenager 👏🙌
— IndianPremierLeague (@IPL) May 31, 2026
Vaibhav Sooryavanshi is the winner of the 𝙈𝙤𝙨𝙩 𝙑𝙖𝙡𝙪𝙖𝙗𝙡𝙚 𝙋𝙡𝙖𝙮𝙚𝙧 Award with 4⃣3⃣6⃣.5⃣ points 🩷#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/DowJeSDF5X
ఒత్తిడిలో ఆడటం నేర్చుకున్నా: వైభవ్
అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం అత్యంత విలువైన ఆటగాడు (ఎంవీపీ) అవార్డును వైభవ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అతడు ఈ సీజన్ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పాడు. "ఈ సీజన్‌లో ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో ఎలా ఆడాలో, పరిస్థితులకు అనుగుణంగా నా ఆటను ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నాను. ప్రతి మ్యాచ్‌ను ఒకే విధంగా ఆడలేం, పరిస్థితిని అంచనా వేసి జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడాలి. నేను నా ఆటను నమ్ముతాను. ఈ బంతిని కొట్టగలను అనిపిస్తే పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాను. నేను చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా, అందుకే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిపెట్టాలనుకుంటున్నా. గాయాల బారిన పడకుండా చూసుకోవాలి. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అందరూ నాకు చాలా మద్దతు ఇచ్చారు. వారితో కలిసి ఉండటం వల్ల ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించింది. జట్టులోని వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంటుంది " అని అన్నాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని కూడా ప్రశంసించాడు.
Swept the field with his skills. Swept the season with awards 🏆
— IndianPremierLeague (@IPL) May 31, 2026
1️⃣5️⃣ years old and already needing a bigger trophy cabinet 👏#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/bIYKIHfgRD
ఆరెంజ్ క్యాప్ సొంతం
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ మాత్రం హైలెట్‌గా నిలిచాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 48.50 సగటు, 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ సీజన్‌లో మొత్తం 72 సిక్సర్లు బాదిన వైభవ్, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. 15 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, మాజీ ఆటగాళ్లను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు.
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ- 19ఏళ్ల IPLలో నయా హిస్టరీ!
'15ఏళ్ల ఏజ్‌లో మేం గల్లీ క్రికెట్ కూడా సరిగ్గా ఆడలేదు'- వైభవ్‌పై అమితాబ్ ప్రశంసలు

