బట్లర్, గిల్ హాఫ్ సెంచరీలు- లఖ్‌నవూపై గుజరాత్ ఈజీ విన్!
గుజరాత్ టైటాన్స్ రెండో విజయం- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ మిస్- ఐపీఎల్ 2026

Published : April 12, 2026 at 7:09 PM IST
GT vs LSG IPL 2026 : గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరదొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగిన వేళ ఎకాన స్టేడియం వేదికగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 165 పరుగుల ఛేదననను గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్ (56), బట్లర్ (60) రాణించారు. చివర్లో వాషింగ్టర్ సుందర్ (21*) ఆకట్టుకున్నాడు. లఖ్‌నవూ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, మహ్మద్ షమీ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
లఖ్‌నవూ హ్యాట్రిక్ మిస్
ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత లఖ్‌నవూ రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో కోల్‌కతాను ఓడించి గాడిన పడ్డట్లే కనిపించింది. దీంతో హ్యాట్రిక్ విజయాలపై కన్నేయగా, గుజరాత్ దెబ్బ కొట్టింది. మరోవైపు, గుజరాత్‌కు ఈ సీజన్లో ఇది రెండో విజయం.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ (30) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్ల నుంచి భారీ ఇన్నింగ్స్ రాకపోవడంతో లఖ్‌నవూ ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది. కెప్టెన్ రిషబ్ పంత్ (18), మిచెల్ మార్ష్ (11), ఆయుశ్ బదోనీ (9), పూరన్ (19), అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరి (18), జార్జి లిండే (16) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4, అశోక్ శర్మ 2, మహ్మద్ సిరాజ్, రబాడ చెరో 1 వికెట్ పడగొట్టారు.
Captain Gill & Jos the Boss lead from the front as GT bags 2 points 💪#GujaratTitans make it look easy, as they cruise past #LucknowSuperGiants with a 7-wicket win!#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/DQa6F2gGFd
— Star Sports (@StarSportsIndia) April 12, 2026
పూరన్ అరుదైన రికార్డ్
ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 19 పరుగులే చేసిన ఓ అరుదైన ఘనత సాధించాడు. లఖ్‌నవూ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు కొట్టాడు. అతడు ఇప్పటిదాకా 1422 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ (1410 పరుగులు)ను అధిగమించాడు.
LSG తరఫు అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్లు
- 1422 పరుగులు - పూరన్
- 1410 పరుగులు- కేఎల్ రాహుల్
- 1038 పరుగులు- ఆయుశ్ బదోని
- 952 పరుగులు- మార్కస్ స్టోయినిస్
- 901 పరుగులు - క్వింటన్- డి కాక్
ఆరో ఓటమి
ఈ మ్యాచ్‌తో లఖ్‌నవూ చెత్త రికార్డు కొనసాగుతోంది. సొంతగడ్డపై వరుసగా ఆరో ఓటమి మూటగట్టుకుంది. ఇవన్నీ కూడా తొలుత బ్యాటింగ్ చేసిన సందర్భాలే కావడం గమనార్హం.
CSK చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి
- DC చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి
- SRH చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి
- RCB చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి
- DC చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి
- GT చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి *
ప్రసిద్ధ్ అరుదైన రికార్డు
నాలుగు వికెట్లతో లఖ్‌నవూ పతనాన్ని శాసించిన ప్రసిద్ధ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ప్రసిద్ధ్ ఇప్పటిదాకా 70 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 2025 నుంచి 19 మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ 19 మ్యాచ్‌ల్లోనే అతడు మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అంతకుముందు 51 మ్యాచ్‌ల్లో అతడు ఈ అవార్డుకు ఎంపిక కాలేదు. ఇక 2025 నుంచి అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న ప్లేయర్‌గా శ్రేయస్ అయ్యర్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడికి ఈ పురస్కారం నాలుగుసార్లు దక్కింది. ఆ తర్వాత ప్రసిద్ధ్తోపాటు కృనాల్, సమీర్ రిజ్వీలకు మూడేసి సార్లు దక్కింది.
Consistent, fiery, and always evolving! 🔥#PrasidhKrishna continues to show why he’s been one of the most lethal pace threats in the #TATAIPL since 2025 ⚡️#IPLRivalryWeek 2026 ➡️ #LSGvGT | LIVE NOW 👉 https://t.co/0HrC1UNn6k | #TATAIPL pic.twitter.com/f3dTlRURZ0
— Star Sports (@StarSportsIndia) April 12, 2026

