ETV Bharat / sports

ఆర్సీబీకి షాక్- గుజరాత్ టైటాన్స్​ గ్రాండ్ విక్టరీ

గుజరాత్​ టైటాన్స్ ఆల్​రౌండ్ షో - ఆర్సీబీ చిత్తు చిత్తు

GT vs RCB IPL 2026
GT vs RCB IPL 2026 (Source : AP News)
author img

By ETV Bharat Sports Team

Published : April 30, 2026 at 11:18 PM IST

1 Min Read
Choose ETV Bharat

GT vs RCB IPL 2026 : సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయినా 15.5 ఓవర్లో అందుకుంది.కెప్టెన్ గిల్ (43), బట్లర్ (39) రాణించారు ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, రొమారియో షెపర్డ్ 2, సుయాశ్ శర్మ 1 వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పడిక్కల్ (40) టాప్ స్కోరర్. అర్షద్ ఖాన్ 3, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ చెరో 2, సిరాజ్, రబాడా తలో 1 వికెట్ దక్కించుకున్నారు.