'ఒక్క రన్, ఒకే ఒక్క రన్'- దిల్లీపై గుజరాత్ థ్రిల్లర్ విక్టరీ
దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్- ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం

Published : April 9, 2026 at 6:48 AM IST
IPL 2026 DC Vs GT : దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఛేదనలో కేఎల్ రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. నిశాంక 24 బంతుల్లో 41 పరుగులు, డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో 41 రన్స్‌తో మెరుపులు మెరిపించినా దిల్లీకి ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ రషీద్ ఖాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
ఆఖర్లో ఉత్కంఠ
గుజరాత్ గెలుపు కోసం చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ ఓవర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. క్రీజులో ఉన్న విప్రజ్ నిగమ్ తొలి బంతికి ఫోర్ బాదాడు. అయితే రెండో బంతికి అతడు ఔటయ్యాడు. ఇక క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ మూడో బంతికి సింగిల్ తీసి మిల్లర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతికి మిల్లర్ సిక్స్ బాది దిల్లీని విజయం అంచులదాకా చేర్చాడు. అయితే ఒత్తిడిలో ఉన్నప్పటికీ చివరి రెండు బంతులను ప్రసిద్ధ్ డాట్స్‌గా మలిచి గుజరాత్‌కు విజయం అందించాడు.
Watch it yourself to believe it 🤯
— IndianPremierLeague (@IPL) April 8, 2026
A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅
Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో టాప్-4లో ముగ్గురు అర్ధ శతకాలు బాదారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. జాస్ బట్లర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 52 రన్స్‌తో రాణించాడు. వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ 12, గ్లెన్ ఫిలిప్స్ 14 పరుగులు నిరాశ పర్చారు. దిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, లుంగి ఎంగిడి, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
Rashid Khan back to his BEST 👌
— IndianPremierLeague (@IPL) April 8, 2026
The @gujarat_titans’ spinner is the Player of the Match for his game-changing spell 🌟
RELIVE HIS SPELL: https://t.co/9UdshYvFy7#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/26zcm9qieV
ఇద్దరికీ మొదటిదే!
ప్రస్తుత సీజన్లో దిల్లీ జట్టుకు ఇదే తొలి ఓటమి కాగా, అటు గుజరాత్ టైటాన్స్‌కు ఇది మొదటి విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్‌తో ఆడిన దిల్లీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. మరోవైపు, తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టిన గుజరాత్ రెండింట్లోనూ ఓటమి చెందింది. ఇక పట్టికలో ప్రస్తుతం నాలుగు పాయింట్లతో దిల్లీ నాలుగో స్థానంలో ఉండగా, రెండు పాయింట్లతో గుజరాత్ ఆరో ప్లేస్‌లో కొనసాగుతోంది.
Delight 🥳 or Despair 😞
— IndianPremierLeague (@IPL) April 8, 2026
Which side were you on tonight?#TATAIPL | #KhelBindaas | #DCvGT | @gujarat_titans | @DelhiCapitals pic.twitter.com/YJCPB9K4al
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ స్వల్ప తేడాతో నెగ్గిన సందర్భాలు (పరుగుల పరంగా)
- 1 పరుగు vs దిల్లీ క్యాపిటల్స్, దిల్లీ, 2026
- 6 పరుగులు vs ముంబయి ఇండియన్స్, అహ్మదాబాద్, 2024
- 7 పరుగులు vs లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, లఖ్‌నవూ, 2023
- 8 పరుగులు vs కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి, 2022
- 14 పరుగులు vs దిల్లీ క్యాపిటల్స్, పుణె, 2022
కాగా, ఐపీఎల్లో ఒక్క పరుగు తేడాతో ఓటమి చెందడం దిల్లీ జట్టుకు ఇది తొలిసారేం కాదు. ఈ మ్యాచ్‌తో సహా ఇప్పటిదాకా దిల్లీ క్యాపిటల్స్ నాలుగు సార్లు 1 పరుగు స్వల్ప తేడాతో విజయం ముంగిట ఆగిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. ఇన్నిసార్లు ఏ జట్టు కూడా ఇంత తక్కువ తేడాతో ఓడిపోలేదు.
1 పరుగు స్వల్ప తేడాతో దిల్లీ కోల్పోయిన మ్యాచ్‌లు
- vs చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై- 2015
- vs గుజరాత్ లయన్స్, దిల్లీ- 2016
- vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అహ్మదాబాద్- 2021
- vs గుజరాత్ టైటాన్స్, దిల్లీ- 2026
రఫ్పాడించిన రిజ్వీ- ముంబయిపై దిల్లీ గ్రాండ్ విక్టరీ
'ఒక్క ఫెయిల్యూర్‌తో అలా అనడం కరెక్ట్ కాదు'- హిట్‌మ్యాన్‌కు కెప్టెన్ గిల్ మద్దతు

