అష్లీ గార్డ్నర్ మెరుపులు- గుజరాత్ గ్రాండ్ విక్టరీ
మహిళల ప్రీమియర్ లీగ్ - యూపీ వారియర్స్‌పై గుజరాత్ విజయం

Published : January 10, 2026 at 6:24 PM IST
Gujarat Giants Women vs UP Warriorz Women : 2026 మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం నవీ ముంబయి వేదికగా యూపీ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 10 పరుగుల తేడాతో నెగ్గింది. 208 భారీ ఛేదనలో యూపీ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 197 పరుగులకే పరిమితమైంది. లిచీఫీల్డ్ (78 పరుగులు) పోరాడింది. చివర్లో ఆశ శోభన (27 పరుగులు) మెరుపులు మెరిపించిన ఫలితం లేదు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్, సోఫీ డివైన్, వేర్హమ్ తలో 2, గార్డ్నర్, గైక్వాడ్ చెరో 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అష్లీ గార్డ్నర్ (65 పరుగులు, 41 బంతుల్లో) మెరుపులు మెరిపించింది. అనుష్క శర్మ (44 పరుగులు), సోఫీ డివైన్ (38 పరుగులు), జార్జియా వేర్హామ్ (27 పరుగులు) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2, డియేంట్ర డాటిన్, శిఖ పాండే తలో 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ ప్లేయర్ జార్జియా వేర్‌హమ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
5⃣0⃣-run partnership 🆙
— Women's Premier League (WPL) (@wplt20) January 10, 2026
Phoebe Litchfield 🤝 Shweta Sehrawat #UPW need 76 runs from 36 deliveries.
Updates ▶️ https://t.co/0Vl9vFyTyq#TATAWPL | #KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/LHtdwneyd5
డబ్ల్యూపీఎల్‌లో ఒక మ్యాచ్ మొత్తంలో నమోదైన అత్యధిక స్కోర్లు
- 438 - ఆర్సీబీ vs యుపీ వారియర్స్ - లఖ్‌నవూ - 2025
- 404 - గుజరాత్ vs యూపీ వారియర్స్ - నవీ ముంబయి- 2026*
- 403 - గుజరాత్ vs ఆర్సీబీ - వడోదర- 2025
- 391 - గుజరాత్ vs ఆర్సీబీ - బ్రబౌర్న్- 2023
- 387 - ముంబయి vs ఆర్సీబీ- బ్రబౌర్న్- 2025
గుజరాత్ తొలిసారి
ఈ మ్యాచ్‌లో విజయంతో గుజరాత్ జెయింట్స్ ఓ చెత్త రికార్డు పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టింది. డబ్ల్యూపీఎల్ హిస్టరీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం గుజరాత్ జెయింట్స్‌కు ఇదే తొలిసారి. 2023 నుంచి గత మూడు సీజన్లలో గుజరాత్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొంది.
End of a high-scoring contest in Navi Mumbai! @Giant_Cricket 🧡 kick-off their #TATAWPL 2026 campaign with a 🔟-run victory over #UPW
— Women's Premier League (WPL) (@wplt20) January 10, 2026
Scorecard ▶️ https://t.co/0Vl9vFyTyq#KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/TUpevakZ6v
WPL ప్రతీ సీజన్‌లో గుజరాత్ ఓపెనింగ్ మ్యాచ్ ఫలితం
- 2023 - ఓడిపోయింది
- 2024 - ఓడిపోయింది
- 2025 - ఓడిపోయింది
- 2026 - గెలిచింది
చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్- తొలి మ్యాచ్‌లో రికార్డులే రికార్డులు
WPL 2026 : మ్యాచ్ టైమింగ్స్? లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్- ఫ్రీ గా చూడొచ్చా?

