'IPLలో క్రికెట్ ఉండదు- అది బాలీవుడ్ సినిమా!'- RCB మాజీ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్
IPL క్రికెట్ కాదు, బాలీవుడ్ హంగామా- PSLలో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లంటూ ఫారిన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Published : April 11, 2026 at 3:46 PM IST
Rilee Rossouw On IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రొసో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో పోలుస్తూ ఐపీఎల్ టోర్నమెంట్ బాలీవుడ్ సినిమాలాంటిది అని అన్నాడు. ఇక్కడ క్రికెట్ కంటే ఎక్కువ బాలీవుడ్ హంగామానే ఉంటుందని అని చెప్పాడు. అలాగే ఐపీఎల్ సుదీర్ఘంగా సాగే టోర్నమెంట్ అని, అదే పీఎస్ఎల్ తొందరగా ముగిసిపోయే లీగ్ అని పేర్కొన్నాడు.
IPL లాంగ్ ప్రాసెస్
ప్రస్తుతం రొసొ పీఎస్ఎల్లో ఆడుతున్నాడు. ఇందులో క్వెట్టా గ్లాడియెటర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్గా రావల్పిండి మ్యాచ్‌తో సమయంలో పీఎస్ఎల్- ఐపీఎల్ మధ్య తేడా గురించి ప్రశ్నించగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ఆడటం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని, అదే పాకిస్థాన్ టోర్నమెంట్ త్వరగా ముగుస్తుందని అన్నాడు. దీంతో పీఎస్ఎల్లో పోటీపడటం వల్ల జట్ల మధ్య ఉత్కంఠ మ్యాచ్‌లు జరుగుతాయని రొసో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల మేనేజ్మెంట్లల్లో చాలామంది బాలీవుడ్ రంగానికి చెందినవారేనని, అందుకే ఈ లీగ్ నిజమైన క్రికెట్ ఆటలా కాకుండా, ఒక సినిమా మాదిరిగా కనిపిస్తుందని రొసో అభిప్రాయపడ్డాడు.
'ఐపీఎల్ టోర్నమెంట్ చాలా లాంగ్ ప్రాసెస్. అంతేకాకుండా అందులో ఓనర్లు బాలీవుడ్‌కు చెందినవారు ఉంటారు. అందుకే అది క్రికెట్ టోర్నీలాగా కాకుండా బాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ డిఫరెంట్. ఇది తొందరగా ముగుస్తుంది. ఇందులో పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది' అని రొసొ చెప్పుకొచ్చాడు.
Rilee Rossouw compares IPL and PSL. 🏆
— Sheri. (@CallMeSheri1_) April 11, 2026
- Rilee Rossouw said, " ipl is a very long tournament, and psl is a much more compact tournament where the competition is a lot more fierce. ipl obviously has the whole bollywood backing it, so it's a lot more of a movie than actual… pic.twitter.com/yb4K01QSRL
ఫ్యాన్స్ ఫైర్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్‌లో ఛాన్స్ దొరకని ఆటగాళ్లే పీఎస్ఎల్లోకి వెళ్తుంటారని, అతడికి కూడా ఐపీఎల్‌లో అవకాశం రాకపోవడం వల్లే పీఎస్ఎల్లో ఆడుతున్నాడని చురకలు అంటిస్తున్నారు. అలాగే ఐపీఎల్ అనేది గ్లోబల్ లెవెల్ లీగ్ అని, కానీ పీఎస్ఎల్ను కేవలం పాకిస్థానీయులే చూస్తారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ మేరకు రొసొపై మండిపడతూ కామెంట్లు చేస్తున్నారు.
రొసొ ఐపీఎల్ కెరీర్
2014లో రొసొ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. తొలి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున కూడా ఆడాడు. ఇక 2024లో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అయితే అతడు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 22 మ్యాచ్‌ల్లో 473 పరుగులు మాత్రమే చేశాడు.
PSLలో ఫర్వాలేదు!
కానీ, పీఎస్ఎల్లో మాత్రం రొసొ గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇప్పటిదాకా ఆ టోర్నీలో అతడు 99 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 3 సెంచరీలు సహా 2366 పరుగులు ఉన్నాయి. అయితే ఐపీఎల్ కంటే పీఎస్ఎల్లోనే ఎక్కువగా అవకాశాలు రావడం, అక్కడే రాణించడంతో అతడు ఐపీఎల్‌పై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ప్రస్తుత సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో అతడు చేసింది 79 పరుగులే.

