బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరభ్ గంగూలీ - దాదా షో షురూ
బిగ్‌బాస్ హోస్ట్‌గా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ- రేపట్నుంచే రెగ్యులర్ ఎపిసోడ్స్

Published : August 30, 2026 at 6:59 PM IST
Ganguly Bigg Boss 2026 : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అంటే మన మాజీ కెప్టెన్ ఆయన సిరీస్ల్లోనో, సీరియల్స్‌లోనో నటిస్తున్నాడనుకోకండి. గంగూలీ కనిపించేది వ్యాఖ్యాతగా. బెంగాలీ బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత బెంగాళీ భాషలో బిగ్‌బాస్ రీ లాంఛ్ అవుతోంది. ఈ క్రమంలో షో లో పాల్గొననున్న కంటెస్టెంట్లను కన్ఫర్మ్ చేస్తూ నిర్వాహకులు ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.
మూడో సీజన్‌కు గంగూలీ!
బెంగాళీ భాషలో బిగ్‌బాస్ పదేళ్ల కిందటే ప్రారంభమైంది. మొదటి సీజన్‌కు మిథున్ చక్రవర్తి, రెండో సీజన్‌కు నటుడు జీత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే పలు కారణాల వల్ల ఆ తర్వాత ఈ షో జరగలేదు. ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్‌ను బెంగాళీలో తీసుకొస్తున్నారు. ఈ మూడో సీజన్ బిగ్‌బాస్ ప్రోగ్రామ్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ గంగూలీ బెంగాళీ ఆడియెన్స్‌ను అలరించనున్నారు.
అయితే ఇలాంటి షోకు హోస్ట్‌గా చేయడానికి గల కారణాలను కూడా గంగూలీ వెల్లడించాడు.‘‘'బిగ్‌బాస్ ఒక డిఫరెంట్ షో. అందరికీ దగ్గరైన ప్రోగ్రామ్, సుదీర్ఘ విరామం తర్వాత బెంగాల్‌లో మళ్లీ మొదలు కానుంది. ఇంతకు ముందు వచ్చిన బిగ్‌బాస్ షో ఎపిసోడ్స్‌ను ప్రతి రోజు చూసే సమయం ఉండేది కాదు. వీకెండ్ మాత్రం కచ్చితంగా చూసేవాడిని. అన్నింటికంటే ముఖ్యంగా సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా ఎలా చేశారో బాగా పరిశీలించాను. ఈ షోను హోస్ట్ చేయడం నాకు కూడా ఆసక్తికరంగానే ఉంది' అని గంగూలీ అన్నాడు.
ఈ సీజన్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. వీరిని సినిమా, క్రీడలు, మ్యూజిక్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ వివిధ రంగాల్లో నుంచి సెలక్ట్ చేశారు. డిజైనర్ శ్యామ్ భట్ ఈ బిగ్‌బాస్ హౌస్‌ను 7000 చదరపు అడుగుల్లో సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో 55 కెమెరాలు అమర్చారు. లోపల కంటెస్టెంట్ల ప్రతి మూమెంట్‌ను కెమెరాలతో రికార్డు చేయనున్నారు. ఈరోజు (ఆగస్టు 30) రాత్రే ఈ బిగ్‌బాస్ సీజన్- 3 గ్రాండ్ ప్రీమియర్ వేడుక జరగనుంది. ఈ గ్రాండ్ ప్రీమియర్‌కు టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ కూడా విచ్చేసి సందడి చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఇక రేపట్నుంచి నుంచి రెగ్యులర్ ఎపిసోడ్‌లు ఉంటాయి. ఓటీటీలో జియో హాట్‌స్టార్ వేదికగా 24x7 స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
భారీ రెమ్యూనరేషన్!
బిగ్‌బాస్ అనేది సుదీర్ఘమైన షో. రెండు నెలలకు పైగా ఈ షో సాగుతుంటుంది. అయితే ఇంత లాంగ్ ప్రోగ్రామ్ కోసం దాదా భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సీజన్‌కే రూ.120 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం బుల్లితెర హోస్టుల్లో ఇది ఒక రికార్డు అవుతుంది. అలాగే గంగూలీ గతంలోనూ బుల్లితెరపై హోస్టింగ్ చేశాడు. బెంగాళీలో దాదాగిరి అన్‌లిమిటెట్ అనే క్విజ్ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అయితే బిగ్‌బాస్ రియాలిటీ షో కాబట్టి, ఇందులో కంటెస్టెంట్లపై దాదా ఎలాంటి పంచ్‌లు వేస్తాడు? వాళ్లు చేసే తప్పులను ఎలా ఎత్తి చూపుతాడని ఆసక్తిగా ఉంది.
'33 వేల మందికి టికెట్ డబ్బులు వాపసు ఇచ్చేస్తాం'- మెస్సి ఈవెంట్‌పై సీఎం సువేందు
15ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ - చిన్నోడి ఖాతాలో మరో రికార్డ్

