93ఏళ్లలో భారత్ తొలిసారి ఇలా- సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అరుదైన ఫీట్
టెస్టు చరిత్రలోనే తొలిసారి- భారత్ అరుదైన ఫీట్

Published : November 14, 2025 at 11:06 AM IST
Ind vs SA 1st Test : కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో భారత్ తొలి టెస్టు ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగింది. ఐదు నెలల గ్యాప్ తర్వాత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. అలాగే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ టెస్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా అరుదైన ఫీట్ నమోదు చేసింది.
తొలిసారి ఇలా!
ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా ఉంది. 93 ఏళ్ల టెస్టు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీమ్ఇండియా తొలిసారి ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లతో బరిలోకి దిగింది. 1932లో భారత్ క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. అప్పట్నుంచి ఇప్పటిదాకా 596 టెస్టులు ఆడింది. అయితే గతంలో ఎప్పుడూ కూడా భారత్ నలుగురు కంటే మించి లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకోలేదు. తొలిసారి యశస్వీ జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లతో జట్టు కూర్పు చేసింది.
సాయి సుదర్శన్ ఔట్
కాగా, ఈ టెస్టు మ్యాచ్‌కు టీమ్ఇండియా జట్టులో రెండు మార్పులు చేసింది. సాయి సుదర్శన్‌ను తప్పించింది. నితీశ్ కుమార్ ఫిట్నెస్ కారణంగా ఎంపిక కాలేదు. ఈ రెండు స్థానాల్లో పంత్, అక్షర్ పటేల్ బరిలో దిగారు. 2024 ఫిబ్రవరి తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అక్షర్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
A look at #TeamIndia's Playing XI 🙌
— BCCI (@BCCI) November 14, 2025
Updates ▶️ https://t.co/okTBo3qxVH#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/i7UcpmmkF7
రబాడా, బ్రెవిస్ దూరం!
ఇక సౌతాఫ్రికాలో స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా పక్కటెముక గాయం కారణంగా తొలి టెస్ట్ ఆడటం లేదు. రబాడాతోపాటు యంగ్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా జట్టుకు దూరమయ్యాడు. అయితే సెనురాన్ ముత్తుసామి జట్టులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతడు ఇటీవల పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. కాగా, ఇదే సిరీస్‌కు దూరమైన కెప్టెన్ టెంబ బవుమా జట్టులోకి తిరిగి వచ్చాడు.
భారత్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా తుది జట్టు : ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్
భారత్ x సౌతాఫ్రికా తొలి టెస్టు- లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా- 44 రోజుల్లోనే భారత్ రికార్డ్ బ్రేక్

