FIFA 'గోల్డెన్ బూట్' రేస్- ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాళ్లు- లిస్ట్‌లో లేని రొనాల్డో!
రసవత్తరంగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్- ఆటగాళ్ల మధ్య 'గోల్డెన్ బూట్' రేస్- లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

Published : July 3, 2026 at 8:05 PM IST
FIFA Golden Boot Race 2026 : ఫిఫా ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. 48 జట్లతో ప్రారంభమైన టోర్నమెంట్లో ఇప్పుడు 16 జట్లు మిగిలిగాయి. ఈ 16 జట్లు రౌండ్ ఆఫ్ 16లో పోటీపడనున్నాయి. దీంతో టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. బలమైన జట్లుగా భావించిన జర్మనీ, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. కానీ, ఫ్రాన్స్, అర్జెంటీనా, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్ వంటి జట్లు ట్రోఫీ రేసులో నిలిచాయి. అయితే ఈసారి కప్ ఎవరు గెలుస్తారనే దాని కంటే, గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్‌కు దక్కేది) ఏ ఆటగాడికి లభిస్తుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ఫుట్‌బాల్ లెజెండ్స్ లియోనల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ అని భావిస్తున్న తరుణంలో ఈ స్టార్లపై కన్ను పడింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలతో టోర్నీలో తమదైన ముద్ర వేశారు. కీలకమైన గోల్స్ చేసి తమ జట్లను విజయల్లో కీలక పాత్ర పోషించారు. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్ మెస్సితోపాటు ఎంబాపే తదితరులు ఉన్నారు. దీంతో గోల్డెన్ బూట్ రేసు రసవత్తరంగా మారింది. మరి ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటిదాకా రాణించిన ప్లేయర్లు ఎవరు? ఈ రేస్‌లో ఎవరెన్ని గోల్స్‌తో ఉన్నారో చూద్దాం!
కైలియన్ ఎంబాపే
ఈ ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన జట్టును రౌండ్ ఆఫ్ 16కు చేర్చడంలో ఎంబాపే కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఎంబాపే ఆరు గోల్స్ చేశాడు. సెనెగల్, ఇరాక్, స్వీడన్‌లపై రెండేసి గోల్స్ కొట్టాడు. వీటితోపాటు ఆయా మ్యాచ్‌ల్లో రెండు అసిస్ట్‌లు కూడా అందించాడు. అయితే ఈ రేస్‌లో ఇద్దరు ప్లేయర్లు సమానంగా గోల్స్ సాధిస్తే, అత్యధిక అసిస్ట్‌లు అందించిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డును అందజేస్తారు. కాగా, 2022 వరల్డ్‌కప్‌లో ఎంబాపేకే గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది.
On continue notre chemin, tous ensemble !!!! 🇫🇷💪🏽 pic.twitter.com/4PG2vWVOKq
— Kylian Mbappé (@KMbappe) July 1, 2026
లియోనెల్ మెస్సి
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తున్నాడు. వరుస గోల్స్‌తో తన జట్టును సులభంగా ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. తన అద్భుతమైన ఆటతో అభిమానులను అలరిస్తున్న ఈ దిగ్గజం, ఇప్పటివరకు ఆరు గోల్స్ చేశాడు. గ్రూప్ దశలో అల్జీరియాపై మెస్సీ హ్యాట్రిక్ సాధించగా, ఆస్ట్రియాపై రెండు గోల్స్ చేశాడు. నాకౌట్ దశలో జోర్డాన్‌పై కూడా ఒక గోల్ చేశాడు. అయితే మెస్సి ఇప్పటిదాకా ఎలాంటి అసిస్ట్‌లు అందించలేదు. అందుకే ఈ రేస్‌లో మెస్సి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇవాళ రౌండ్ ఆఫ్ 32లో కేప్ వెర్డేతో మ్యాచ్ ఉంది. మరి ఈ మ్యాచ్‌లో మెస్సి ఒక గోల్ సాధిస్తే ఈ లిస్ట్‌లో టాప్‌లోకి దూసుకెళ్తాడు. అయితే కెరీర్లో ఆరో ప్రపంచ కప్‌లో ఆడుతున్న మెస్సి మాత్రం ఇప్పటివరకు గోల్డెన్ బూట్ గెలుచుకోకపోవడం ఆశ్చర్యకరం.
Lionel Messi becomes the first player to score in seven consecutive #FIFAWorldCup games 🌟 pic.twitter.com/pMhHcidn7H
— FIFA World Cup (@FIFAWorldCup) June 28, 2026
హ్యారీ కేన్
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ ఈ ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఐదు గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపే, మెస్సి తర్వాత స్థానంలో కొనసాగుతున్నాడు. అతను క్రొయేషియా, డిఆర్ కాంగో జట్లపై రెండేసి గోల్స్, పనామాపై ఒక గోల్ కొట్టాడు. కాగా, కేన్ గతంలో 2018 ప్రపంచ కప్‌లో 'గోల్డెన్ బూట్'ను గెలుచుకున్నాడు.
This is what it means.
— Harry Kane (@HKane) July 1, 2026
Got the job done. See you in Mexico. 🦁🦁🦁 pic.twitter.com/GRBSaF8hBL
ఎర్లింగ్ హాలాండ్
నార్వే స్టార్ ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ ఈ ప్రపంచ కప్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. మెరుపు వేగంతో కదిలే ఈ ఆటగాడు తన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో హాలాండ్ ఖాతాలో ఐదు గోల్స్ ఉన్నాయి. ఇరాక్, సెనెగల్ జట్లపై రెండేసి గోల్స్, అలాగే ఐవరీ కోస్ట్‌పై ఒక గోల్ సాధించాడు.
వినిసియస్ జూనియర్
ఈ ప్రపంచ కప్‌లో బ్రెజిల్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడంలో వినిసియస్ జూనియర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో జూనియర్ నాలుగు గోల్స్ సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన డెంబెలే కూడా నాలుగు గోల్స్‌తో ఈ రేస్‌లో ఉన్నాడు. అలాగే పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మూడు గోల్స్ సాధించాడు. అయితే రొనాల్డో టాప్ 5లో లేడు. ఇకపై ఆడనున్న మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించి రేసులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Cristiano Ronaldo ✨#FIFAWorldCup pic.twitter.com/cDkBhF1jzy
— FIFA World Cup (@FIFAWorldCup) July 3, 2026
రిటైర్మెంట్ రూమర్స్ వేళ 'రొనాల్డో ప్రపంచ రికార్డ్'- ఫిఫాలో తొలి ప్లేయర్‌గా ఘనత
విక్టరీ పరేడ్‌లో 10 లక్షల మంది- ఊపిరాడక ముగ్గురు అభిమానులు మృతి- ఫిఫాలో విషాదం!

