ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం- కివీస్ ఓటమితో పాకిస్థాన్ ఖుష్!

T20 World Cup - ఇంగ్లాండ్​పై న్యూజిలాండ్ విజయం- కివీస్ ఓటమితో పాకిస్థాన్​ అశలు సజీవం!- ఆసక్తికరంగా గ్రూప్ 2 సెమీస్ రేస్

England vs New Zealand
England vs New Zealand (Source : AP News)
author img

By ETV Bharat Sports Team

Published : February 27, 2026 at 10:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

England vs New Zealand T20 World Cup : సూపర్ 8లో ఇంగ్లాండ్ హ్యాట్రిక్ నమోదు చేసింది. తాజాగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో గ్రూప్ 2లో సెమీస్ రేసు ఇంకా ఆసక్తికరంగా మారింది. కివీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్​ను ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లో ఛేదించింది. టామ్ బంటన్ (33 పరుగులు) రాణించాడు. విల్ జాక్స్ (32 పరుగులు), రెహాన్ అహ్మద్ (19 పరుగులు, 7 బంతుల్లో) చివర్లో మెరుపులు మెరిపించడంతో ఉత్కంఠ పోరులో ఇంగ్లిష్ జట్టు విజయం సాధించింది. కివీస్ బౌలర్లలో రచిన్ 3, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, గ్లెన్ ఫిలిప్స్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

తాజా ఓటమితో కివీస్ సెమీఫైనల్ అవకాశాలు అత్యంత సంక్లిష్టం అయ్యాయి. సూపర్ 8లో ఒక్కో విజయం, ఓటమి (మరో మ్యాచ్ రద్దు)తో న్యూజిలాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ ఫలితంతో పాకిస్థాన్ సంతోషంగా ఉంది. కివీస్ ఓడడంతో పాక్​ సెమీస్​ రేస్​లో ఉంది. రేపు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్​లో పాక్ భారీ తేడాతో నెగ్గితే సెమీస్​కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం కివీస్ రన్​రేట్ +1.390 (3 పాయింట్లు)తో ఉండగా, పాకిస్థాన్ -0.461 (1 పాయింట్) మూడో ప్లేస్​లో ఉంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (39 పరుగులు), టిమ్ (35 పరుగులు) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ తలో 2, లియామ్ డాసన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

జాక్స్ అరుదైన రికార్డ్
తొలుత బౌలింగ్ అనంతరం బ్యాటింగ్​లో అదరగొట్టిన విల్ జాక్స్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుత టోర్నీలోనే ఈ అవార్డును విల్ జాక్స్ మూడుసార్లు అందుకోవడం విశేషం. దీంతో సింగిల్ టీ20 వరల్డ్​కప్​ ఎడిషన్​లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న రెండో క్రికెటర్​గా సికందర్ రజాతో సమానంగా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌడండర్ షేన్ వాట్సన్ టాప్​లో ఉన్నాడు. అతడు 2012 టీ20 ప్రపంచకప్ ఎడిషన్​లో 4 సార్లు ఈ అవార్డు అందుకున్నాడు.

సింగిల్ T20 వరల్డ్​కప్​ ఎడిషన్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్లు

  • 4 - షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- 2012
  • 4 - విల్ జాక్స్ ( విల్ జాక్స్)- 2026
  • 3 - సికందర్ రజా (జింబాబ్వే)- 2022

స్పిన్నర్లదే బలం
ఈసారి ఆయా జట్లు గతంలోకంటే భిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పిన్నర్లతో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేయిస్తున్నాయి. ఈ మ్యాచ్​లోనూ ఇరుజట్లు ఎక్కువగా స్పిన్ బలాన్నే ప్రదర్శించాయి. ఓవరాల్​గా 40 ఓవర్ల మ్యాచ్​ (రెండు జట్ల బ్యాటింగ్ కలిపి)లో స్పిన్నర్లే మొత్తం 31 ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. దీంతో టీ20 వరల్డ్​కప్​లో ఎక్కువ ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేసిన మ్యాచ్​గా భారత్- పాక్ మ్యాచ్​తో సమంగా నిలిచింది.

ఇదే సీజన్​లో శ్రీలంక వేదికగా ఇటీవల జరిగిన భారత్- పాక్​ మ్యాచ్​లోనూ స్పిన్నర్లు 31 ఓవర్లు బౌలింగ్ చేశారు. అలాగే ఈ టోర్నీలోనే శ్రీలంక- న్యూజిలాండ్ మ్యాచ్​లోనూ 30 ఓవర్లు స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. అంటే ఈ ఎడిషన్​లోనే మూడు మ్యాచ్​ల్లో 30పై చిలుకు ఓవర్లను స్పిన్నర్లు బౌలింగ్ చేశారు.

T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో అత్యధిక ఓవర్ల స్పిన్ బౌలింగ్

  • 31.0 ఓవర్లు - భారత్ vs పారిస్థాన్ - కొలంబో, 2026
  • 31.0 ఓవర్లు - న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్- కొలంబో, 2026
  • 30.0 ఓవర్లు - శ్రీలంక vs న్యూజిలాండ్- కొలంబో, 2026
  • 26.0 ఓవర్లు - ఆస్ట్రేలియా vs పాకిస్థాన్- కొలంబో, 2012
  • 25.4 ఓవర్లు - భారత్ vs వెస్టిండీస్- మీర్పూర్, 2014

'నాన్​సెన్స్​కు బ్యాట్​తోనే సమాధానం- ముందుకు సాగిపోండి సార్!'- అభిషేక్​పై యువీ ప్రశంసలు

సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ- చిత్తుగా ఓడిన వెస్టిండీస్​- టీమ్ఇండియా ఫ్యాన్స్ ఖుష్!