ఆస్ట్రేలియా క్రికెటర్‌తో పాడిన ఆశా భోస్లే- అప్పట్లో ఆ పాట సూపర్ హిట్!
ఆశా భోస్లే మరపురాని జ్ఞాపకం- ఆరు దశాబ్దాల కెరీర్లో వేల పాటలు - ఓసారి ఆస్ట్రేలియా క్రికెటర్‌తోనూ జతకట్టిన గాయని

Published : April 12, 2026 at 4:03 PM IST
Asha Bhosle Brett Lee : ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) అనారోగ్యంతో ఆదివారం ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణంతో యావత్ సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఆరు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో ఆమె 12 వేలకుపైగా పాటలు పాడి, తన గాత్ర మాధుర్యంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ క్రమంలోనే ఆశా భోస్లే సుదీర్ఘ కెరీర్లో అనేక మంది గాయకులతో కలిసి పనిచేశారు. అయితే తన కెరీర్లో భాగంగానే ఆశా భోస్లే ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్ లీతో కలిసి ఒక హిందీ పాట పాడారని మీకు తెలుసా? వాళ్లిద్దరు ఎప్పుడు పాడారు? ఆ పాట ఏంటో తెలుసుకుందాం!
బ్రెట్ లీతో ఆశా భోస్లే పాడిన పాట
సాధారణంగా సంగీతంతోపాటు ఆశా భోస్లే క్రికెట్‌ను కూడా ఇష్టపడేవారు. ఆ ఆట పట్ల ఆమెకున్న మక్కువ, ఒక సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీతో కలిసి పనిచేసేలా చేసింది. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ వచ్చిన బ్రెట్ లీ, ఆశో భోస్లేతో పాటను చిత్రీకరించారు. వీళ్లద్దరూ కలిసి 'యు ఆర్ ది వన్ ఫర్ మీ' (You Are the One for Me) అనే పాట పాడారు. ఇందులో 'నేను నీవాడి, నీ వాడిగానే ఉంటాను' (Main Tumhara Hu, Tumhara Hi Rahunga) అనే రెండు లైన్లను హిందీలో పాడడం విశేషం.
అయితే ఆశా భోస్లేతో కలిసి పనిచేయడం గురించి తన అనుభవాన్ని బ్రెట్ లీ తన ఆటోబయోగ్రఫీ మై లైఫ్‌లో షేర్ చేసుకున్నాడు. ఈ పాటతో బ్రెట్ లీ- ఆశా భోస్లే సంగీత, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. ఇది 2007లో రిలీజైంది. ఈ పాటలో బ్రెట్ లీ కూడా కనిపించాడు. అప్పట్లో ఈ ట్రాక్ భారీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆశా భోస్లే కన్నుమూయడంతో దీనికి సంబంధించిన వీడియో, పాట మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Remember this when Asha Ji and Brett Lee made music together.
— Akul (𝑨𝑻10) (@Loyalsachfan10) April 12, 2026
An era doesn’t end it echoes forever.
Thank you for the timeless melodies #AshaBhosle ji.
Om Shanti 🙏 pic.twitter.com/mZY57TFDKM
అమూల్యమైన బహుమతి
ఆశాతో పాట చిత్రీకరిస్తున్న విషయాన్ని అప్పట్లో తన టీమ్‌మేట్స్‌కు చెప్పలేదని బ్రెట్ లీ పుస్తకంలో రాసుకొచ్చాడు. 'నేను చాలా సరదాగా గడిపాను. ఈ పాట గురించి నా సహచరులెవరికీ చెప్పలేదు. అలా సిటీలో తిరగానికి వెళ్తున్నానని చెప్పి, షూటింగ్ చేసేవాడిని. అయితే నాలుగు నెలల తర్వాత ఆశ సిడ్నీలోని ఒపెరా హౌస్‌లో పాడేందుకు వచ్చినప్పుడు కలిశాను. అప్పుడు తన సొంత ఆల్బమ్‌పై ఆటోగ్రాఫ్ చేసి నాకు ఇచ్చారు. ఆ బహుమతి అమూల్యమైనది. అది నాకు ఎప్పటికీ అత్యంత విలువైనది' అని బ్రెట్ లీ ఆటోబయోగ్రఫీ రాశారు.
సచిన్ పోస్టు
ఆశా భోస్లేకు- క్రికెట్ గాడ్ సచిన్ టెందుల్కర్‌తో ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె తెందుల్కర్‌ను ఎంతగానో గౌరవించేవారు. తాజాగా ఆశా భోస్లే మృతి పట్ల సచిన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక భావోద్వేగభరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు. 'ఈరోజు భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులకు అత్యంత విషాదకరమైన రోజు. ఆశాజీ మా కుటుంబంలో ఒక అంతర్భాగం. ఈరోజు మా దుఃఖాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. మేం దిగ్బ్రాంతికి గురయ్యాం. ఆమె మనకు లెక్కలేనన్ని మధురమైన పాటల జ్ఞాపకాలు అందించారు. కొన్ని క్షణాల పాటు కాలం కూడా స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ఆమె అమర గీతాల ద్వారా, ఆశాజీ ఎప్పటికీ మాతోనే ఉంటారు' అని సచిన్ రాసుకొచ్చారు.
A deeply sad day for India, and for music lovers across the world.
— Sachin Tendulkar (@sachin_rt) April 12, 2026
For us, Asha Tai was family. Today, words feel too small for the loss we feel. One moment the heart falls silent, and the next, it drifts through the countless melodies she gifted all of us.
It feels as…

