ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్- ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్‌లు- కానీ!
ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్- చిన్నస్వామిలో ఈసారి మ్యాచ్‌లు- సొంత అభిమానుల ముందుకు ఛాంపియన్లు- కానీ ఆ రెండు మాత్రం!

Published : March 3, 2026 at 7:35 PM IST
|Updated : March 3, 2026 at 7:48 PM IST
RCB IPL 2026 : ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త అందింది. ఈసారి ఆర్సీబీ హోంగ్రౌండ్ బెంగళూరు నుంచి షిఫ్ట్ కానుందని కొన్నిరోజులుగా వర్తలు వస్తున్నాయి. గతేడాది తొక్కిసలాట ఘటన వల్ల చిన్నస్వామిలో ఇప్పుడప్పుడే మ్యాచ్‌లు జరగవు అని ప్రచారం సాగింది. అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ తాజా అప్డేట్తో ఈ ప్రచారానికి తెరదించింది. ఈసారి ఆర్సీబీ జట్టు తమ హోం మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
నమస్తే బెంగళూరు
'నమస్కారం బెంగళూరు! మేం వచ్చేస్తున్నాం. బెంగళూరు ఫ్యాన్స్ రెడీగా ఉండండి. మిమ్మల్ని మళ్లీ అలరించేందుకు మన ఛాంపియన్లు చిన్నస్వామి స్టేడియానికి వచ్చేస్తున్నారు' అని ఆర్సీబీ పోస్టులో పేర్కొంది. అలాగే చిన్నస్వామిలో మ్యాచ్‌లను నిర్వహించడంలో మార్గదర్శకత్వం, సహకారం, మద్దతు అందించినందుకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక పోలీసులకు మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలిపింది. ఐపీఎల్ సీజన్ కోసం సకాలంలో మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను మెరుగుపరచడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది.
ఏడులో ఐదే చిన్నస్వామిలో- మిగిలిన రెండు!
ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈఓ రాజేష్ మేనన్ మాట్లాడారు.'చిన్నస్వామి స్టేడియం అనేది మాకు హోం గ్రౌండ్‌గానే కాదు అంతకంటే ఎక్కువ. ఇది ఒక జట్టుగా మాకు గుర్తింపు ఇచ్చింది. ప్రతీ మ్యాచ్‌లో మా కోసం మా అభిమానులు కొత్త ఎనర్జీని స్టేడియానికి తీసుకొస్తారు. అది మా ఆటగాళ్లకు ప్రేరణనిస్తుంది. మా అభిమానులు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు. అందుకే తమ అభిమాన జట్టు హోంగ్రౌండ్లో పోటీ పడడాన్ని చూసేందుకు అర్హులు'
𝗪𝗲’𝗿𝗲 𝗰𝗼𝗺𝗶𝗻𝗴 𝗵𝗼𝗺𝗲. 🏟️❤️🥹
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 3, 2026
5️⃣ home games at the Chinnaswamy. ❤️🔥
2️⃣ in Raipur. 😎
Bengaluru, get ready. The champions return to entertain you! 👑🔥#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/WGBG8niDUv
'నిరంతర చర్చలు, అనుమతి పొందిన తర్వాత, RCB బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు ఆడుతుందని ప్రకటించిస్తున్నందుకు మేం సంతోషంగా ఉన్నాం. ఇక్కడ మళ్లీ మ్యాచ్‌లు నిర్వహణ సాధ్యం చేయడంలో మద్దతు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక పోలీసులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము' అని రాజేష్ మేనన్ అన్నారు. అయితే, మొత్తం ఏడు హోం గ్రౌండ్ల్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు రాయ్‌పుర్ వేదికగా ఆడనుంది. కానీ, ఈ రెండు మ్యాచ్‌లను రాయ్‌పుర్‌కు ఎందుకు షిఫ్ట్ చేశారో తెలియాల్సి ఉంది. అలాగే ఏయే జట్టుతో ఆర్సీబీ చిన్నస్వామిలో ఆడనుందో అనే దానిపై షెడ్యూల్ రిలీజ్ అయ్యాకే క్లారిటీ వస్తుంది.
Home is where our heart is. ❤️ pic.twitter.com/FbTsX39DQt
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 2, 2026
తొక్కిసలాట ఘటన
కాగా, గతేడాది ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచిన క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో ఫ్రాంచైజీ సంబరాలు నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు అనుకున్నదాని కంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో స్టేడియం గేటువద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో చిన్నస్వామి స్టేడియం భారీ ఈవెంట్లకు, క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు భద్రతాపరంగా సురక్షితం కాదని, అక్కడ మ్యాచ్‌లు ఆడించేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
ఇటీల క్లియరెన్స్
ఈ క్రమంలోనే గతేడాది మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో చిన్నస్వామిలో జరగాల్సిన మ్యాచ్‌లను నవీముంబయికి షిఫ్ట్ చేశారు. అలాగే దేశవాళీల్లోనూ ఆయా టోర్నీల్లో అక్కడ మ్యాచ్‌లు జరగలేదు. దీంతో 2026 ఐపీఎల్‌లోనూ అక్కడ మ్యాచ్‌లు జరగడం అసాధ్యమే అని ప్రచారం సాగింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అయితే అనేక చర్చల తర్వాత ఇటీవల చిన్నస్వామి స్టేడియానికి క్లియరెన్స్ వచ్చింది. అందుకే అక్కడ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఫ్రాంచైజీ రెడీ అవుతోంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ తమ సొంత అభిమానుల మధ్య బరిలోకి దిగనుంది. ఈ సీజన్ ఇదే నెలలో ప్రారంభం కానుంది. మార్చి 28న టోర్నీ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ ప్రకటన వస్తుంది.
WPL విక్టరీపై విరాట్ కోహ్లీ పోస్ట్- స్మృతి మంధానకు స్పెషల్ విషెస్
RCB ఫ్యాన్స్‌కు భారీ షాక్- ఇకపై చిన్నస్వామిలో మ్యాచ్‌లు లేనట్లే!

