ETV Bharat / sports

క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన ఫలితం- ప్రింటర్ పనిచేయకపోవడంతో మ్యాచ్‌లో ఓటమి- 'ఇదేం రూల్ బాబు?'

క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన ఫలితం - ప్రింటర్ పని చేయకపోవడంతో ఆతిథ్య జట్టకు తప్పని ఓటమి

Cricket Match Lost Due To Printer Broke
ప్రతీకాత్మక చిత్రం (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : August 31, 2026 at 8:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

Cricket Match Lost Due To Printer : క్రికెట్​లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల మేరకు మ్యాచ్‌లలో గెలుపోటములను నిర్ణయిస్తారు. కొన్నిసార్లు 'డక్‌వర్త్- లూయిస్' (DLS) పద్ధతి కారణంగా ఫలితం రాబడితే, ఇంకొన్నిసార్లు 'సూపర్ ఓవర్' ద్వారా మ్యాచ్ ఫలితం తేలుతుంది. ఈ నిబంధనల ఆధారంగా వచ్చిన ఫలితాన్ని ప్రతి జట్టు అంగీకరించాల్సిందే. కానీ, ఒక ప్రింటర్ (Faulty Printer) కారణంగా ఒక జట్టు మ్యాచ్ ఓడిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును! ఇది నిజంగానే జరిగింది. ఉత్తర ఐర్లాండ్‌లోని క్రికెట్ మ్యాచ్​లో ప్రింటర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒక జట్టు మ్యాచ్​లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అసలు కథేంటంటే?
ఉత్తర ఐర్లాండ్‌లోని 'నార్త్ వెస్ట్ క్రికెట్ యూనియన్ ప్రీమియర్ లీగ్'లో భాగంగా రీసెంట్​గా 'బాలీస్పాలెన్' (Ballyspallen) - 'ఎగ్లింటన్' (Eglinton) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​కు బాలీస్పాలెన్ జట్టు ఆతిథ్యం ఇస్తుంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎగ్లింటన్ జట్టు 48.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, వర్షం కారణంగా బాలీస్పాలెన్ ఇన్నింగ్స్ రెండు ఓవర్ల తర్వాత నిలిచిపోయింది. ఆ సమయానికి బాలీస్పాలెన్ 19 పరుగులు చేసింది. అయితే, వర్షం ఆగిన తర్వాత, డక్​వర్త్ పద్ధతి ఆధారంగా మ్యాచ్‌ను కొనసాగిస్తామని అంపైర్లు ప్రకటించారు.

ప్రింటర్ లోపంతో విజేతగా ప్రకటన
అయితే వాతావరణం కారణంగా ఓవర్ల సంఖ్య తగ్గుతుందని భావించారు. కానీ, అక్కడ ప్రింటర్ పనిచేయకపోవడం వల్ల డక్​వర్త్​ పద్ధతిలో మ్యాచ్​ టార్గెట్​ను నిర్దేశించే షీట్లును ప్రింట్ చేయలేకపోయారు. దీంతో అసలు సమస్య తలెత్తింది. ఆ షీట్లు లేకుండా డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ టార్గెట్​ను ఫిక్స్ చేయడం సాధ్యం కాలేదు. డక్​వర్త్​ షీట్లు అందుబాటులో లేకపోవడంతో వర్షం ఆగిన తర్వాత ఒక్క బంతిని కూడా వేయలేకపోయారు. దీని ఫలితంగా, సందర్శక జట్టు ఎగ్లింటన్‌ను నిర్వాహకులు విజేతగా ప్రకటించారు.

అసలు రూల్ ఏంటంటే?
'నార్త్ వెస్ట్ క్రికెట్ యూనియన్' రూల్స్ ప్రకారం, డక్​వర్త్​ పద్ధతిలో టార్గెట్​ను నిర్దేశించే షీట్లను రెండు జట్లకు, అంపైర్లకు అందించాలి. అయితే ఇందుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్, కంప్యూటర్, ప్రింటర్, పేపర్, ఇంక్ అన్నింటినీ కూడా ఆతిథ్య జట్టే నిర్వాహకులకు అందించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, ఆతిథ్య జట్టే దానికి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే బాలీస్పాలెన్ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. బాలీస్పాలెన్ ఎదుర్కొన్న ఒక సాంకేతిక సమస్య వల్ల లీగ్​లో విజయం సాధించే అవకాశాలను దూరం అయ్యాయి. అయితే ఇలాంటి రూల్స్ ఐసీసీలో మాత్రం లేవు.

మహిళల​ ఆసియా కప్​: థాయిలాండ్​పై 94 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

క్రికెటర్ల వసతి సౌకర్యాలపై BCCI అభ్యంతరం- మౌనం వీడిన ఆసియా క్రీడల నిర్వాహకులు - ఏమన్నారంటే?