రింకు సింగ్ వస్తున్నాడు- తండ్రి మరణించిన మర్నాడే జట్టులోకి!
Rinku Singh World Cup 2026- తండ్రి మరణించిన బాధలోనూ జట్టుతో చేరనున్న రింకు సింగ్- ఆదివారం మ్యాచ్‌లో అందుబాటులోకి!

Published : February 27, 2026 at 10:16 PM IST
Rinku Singh World Cup 2026 : టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ శనివారం జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో శుక్రవారం తన తండ్రి మరణించారు. దీంతో రింకు తన సొంత ఊరికి వెళ్లాడు. అయితే శనివారం సాయంత్రానికల్లా రింకు మళ్లీ జట్టుతో చేరనున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయా మీడియాతో వెల్లడించాయి. దీంతో తండ్రి చనిపోయిన మరుసటి రోజే దేశం కోసం ఆడేందుకు సిద్ధమైన రింకుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
కాగా, ఇటీవల అనారోగ్యానికి గురైన రింకు తండ్రి ఖాన్‌చంద్ సింగ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీంతో రింకు రీసెంట్గా అత్యవసర పరిస్థితుల్లో జట్టును వీడాడు. అయితే బుధవారం సాయంత్రానికి భారత్ శిబిరంలో చేరాడు. కానీ జింబాబ్వే మ్యాచ్‌లో బరిలో దిగే ఛాన్స్ రాలేదు. అయితే శుక్రవారం తెల్లవారుజామున నొయిడాలోని ఓ ఆస్పత్రిలో ఖాన్‌చంద్ తుది శ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఇక ఆదివారం భారత్ కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరాలంటే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో రింకు జట్టులోకి వస్తున్నాడు. అతడికి తుది జట్టులోనూ చోటు దక్కే ఛాన్స్ ఉంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Cricketer Rinku Singh will join Team India in Kolkata tomorrow: BCCI management confirmed to ANI
— ANI (@ANI) February 27, 2026
India will face the West Indies at Eden Gardens Stadium in Kolkata on March 1.
అనారోగ్యం- ట్రీట్మెంట్
కొంతకాలంగా ఖాన్‌చంద్ అడ్వాన్స్డ్ స్టేజ్ లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గత నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
గ్యాస్ ఏజెన్సీలో కార్మికుడిగా
రింకు తండ్రి ఖాన్‌చంద్ సింగ్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ కార్మికుడిగా పనిచేశారు. కొడుకు క్రికెట్లోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం అదే ప్రొఫెషన్లో కొనసాగారు. సింపుల్‌గా ఉండేవారు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రింకు క్రికెటర్ అయ్యాక సిలిండర్ డెలివరీ ఉద్యోగం మానేయాలని తన తండ్రిని పలుమార్లు కోరాడట. కానీ, దానికి ఆయన అంగీకరించలేదు. తన కుటుంబాన్ని పోషించడానికి, తన పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఖాన్‌చంద్ చాలా కృషి చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ రింకుకు క్రికెటపై ఉన్న ఆసక్తి గమనించి అతడి కలలు నెరవేర్చేందుకు సపోర్ట్‌గా నిలిచారు.
భజ్జీ సానుభూతి!
మరోవైపు టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, రింకు సింగ్ తండ్రి మరణంపై స్పందించారు. రింకు తన క్రికెట్ బాధ్యతలకు కట్టుబడి ఉన్నప్పటికీ, ఈ సమయంలో అతని కుటుంబానికి ఇది చాలా కష్టమైన సమయం అని అన్నాడు. రింకు తండ్రి మరణం వార్త విని ఆయన చాలా బాధపడ్డానని, తన ప్రార్థనలు ఎల్లప్పుడూ రింకు కుటుంబంతో ఉంటాయని పేర్కొన్నాడు.
MPతో ఎంగేజ్మెంట్
గతేడాది జూన్ 8న సమాజ్‌వాది పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో రింకు సింగ్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నారు. అయితే మూడు నెలల్లోనే వీళ్ల పెళ్లి జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం 2026 జూన్‌లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, అంతలోనే రింకు ఇంట్లో విషాదం జరిగింది. కాగా, రింకూ కాబోయే భార్య ప్రియా సరోజ్ అతి చిన్న వయసులోనే లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైన అతి కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. ఆమె తండ్రి కూడా స్థానికంగా ఎమ్మెల్యే.
టీమ్ఇండియాలోకి స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ!- సిక్స్‌ల వీరుడు వచ్చేస్తున్నాడు
MPతో రింకు మ్యారేజ్‌కు లైన్ క్లియర్- రెండు ఫ్యామిలీస్ ఓకే- పెళ్లి భాజాలు మోగడమే లేట్!

