భారత్ ఘోర ఓటమి- 185 పరుగుల భారీ తేడాతో ఆసీస్ విజయం- వన్డే సిరీస్ క్లీన్ స్వీప్
ఆసీస్‌పై భారత్ ఘోర ఓటమి- 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్- సెంచరీలతో రాణించిన హీలీ, మూనీ

Published : March 1, 2026 at 4:54 PM IST
Australia Women vs India Women : ఆస్ట్రేలియా పర్యటనలో మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఆసీస్‌తో ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమ్ఇండియా, తాజాగా మూడో మ్యాచ్‌లోనూ ఓడి 3-0తో సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్ రానా (44 పరుగులు) జెమీమా రోడ్రిగ్స్ (42 పరుగులు) ఇద్దరే రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలనా కింగ్ 4, జార్జియా వేర్‌హామ్ 2, నికోల కేరీ, అనబెల్ సదర్లాండ్, అష్లీ గార్డ్నర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ (158 పరుగులు, 98 బంతుల్లో, 27 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకంతో రప్ఫాడించగా, బెత్ మూనీ (106 పరుగులు) సెంచరీతో రాణించింది. జార్జియా వోల్ (62 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించింది. చివర్లో నికోల కేరీ (34 పరుగులు నాటౌట్, 15 బంతుల్లో) మెరుపులు మెరపించడంతో ఆసీస్ స్కోర్ 400 దాటింది. భారత్ బౌలర్లలో శ్రీ చరణి, స్నేహ్ రానా చెరో 2, రేణుకా సింగ్ ఠాకూర్, కాశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
తాజా ఓటమితో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ పర్యటనలో ఇరుజట్లు ఏకైక టెస్టులో తలపడనున్నాయి. మార్చి 06న టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు పెర్త్ స్టేడియం వేదిక కానుంది.
గతేడాది వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత భారత్ ఆడిన వన్డే సిరీస్ ఇదే. ఈ క్రమంలోనే భారీ అంచనాలతో టీమ్ఇండియా ఆసీస్ పర్యటనలో అడుగుపెట్టింది. టీ20 సిరీస్‌లో ఆ అంచనాలకు తగ్గట్లే ఆడింది. తొలి, మూడో మ్యాచ్‌ల్లో విజయం సాధించి టీ20 సిరీస్ పట్టేసింది. అదే జోరు వన్డే సిరీస్‌లోనూ కొనసాగాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ఇక్కడ భారత్‌కు ఘోర పరాభవమే మిగిలింది. వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన తర్వాత ఆడిన తొలి సిరీస్‌నే క్లీన్ స్వీప్ అవ్వడం ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తుంది.
A fine 42 (29) from Jemimah Rodrigues to give #TeamIndia a good start 🙌
— BCCI Women (@BCCIWomen) March 1, 2026
Captain Harmanpreet Kaur and Harleen Deol at the crease now 🤝
Updates ▶️ https://t.co/PqlLKl0Fz3#AUSvIND pic.twitter.com/Sb06B1m9HF
20ఏళ్ల రికార్డ్ బ్రేక్
ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీతో రఫ్పాడించిన హీలీ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంటర్నేషనల్ వన్డే సిరీస్‌లో భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ బాదిన క్రికెటర్‌గా హీలీ రికార్డ్ సృష్టించింది. ఇదివరకు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ క్లైర్ టైలర్ (Claire Taylor) పేరిట ఉండేది. ఆమె 2006లో ఇంగ్లాండ్‌పై జరిగిన వన్డేలో 156 రన్స్ చేసింది. తాజా మ్యాచ్‌తో హీలీ 20ఏళ్ల రికార్డ్ బద్దలుకొట్టింది. అలాగే వన్డే హిస్టరీలో ఇప్పటిదాకా ఈ ఇద్దరే మహిళల భారత్ జట్టుపై 150+ స్కోర్లు చేసిన క్రికెటర్లుగా నిలిచారు.
భారత్ తుది జట్టు - స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లిన్ డియోల్, దీప్తి శర్మ, కాష్వీ గౌతమ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ రానా
ఆస్ట్రేలియా తుది జట్టు - అలిస్సా హీలీ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, బెత్ మూనీ (వికెట్ కీపర్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్‌హామ్, నికోలా కారీ, అలానా కింగ్, లూసీ హామిల్టన్

