సెహ్వాగ్, ద్రవిడ్ వారసులకు బిగ్ ఛాన్స్- అండర్ 19 టీమ్‌లో చోటు- సత్తా చాటుతారా?
ఆర్యవీర్ సెహ్వాగ్‌కు తొలిసారి భారత్ అండర్ 19 టీమ్ నుంచి కాల్- అన్వయ్ ద్రవిడ్‌కు మరోసారి వన్డే జట్టులో చోటు- సెప్టెంబర్ 18 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు

Published : August 27, 2026 at 2:01 PM IST
India Under 19 Squad : భారత క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. బ్యాటింగ్‌లో ఇద్దరి స్టైల్ పూర్తిగా డిఫరెంట్. అయితే ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు భారత పర్యటనకు రానుండగా గురువారం బీసీసీఐ జట్లను ప్రకటించింది. అందులో రెండు పేర్లు వెంటనే అందరిని ఎట్రాక్ట్ చేశాయి. ఒకరు సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కాగా, మరొకరు ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్. ఇద్దరి ప్రయాణం ఇప్పటివరకు వేర్వేరుగా సాగినా ఇప్పుడు ఒకే సిరీస్‌లో భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చింది.
ఆర్యవీర్‌కు ఇదే ఫస్ట్ కాల్
18 ఏళ్ల ఆర్యవీర్ సెహ్వాగ్‌కు భారత్ అండర్ 19 జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న అతడు దేశవాళీ స్థాయి క్రికెట్‌లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ ఆర్డర్‌లో ఆడే ఆర్యవీర్‌పై తండ్రి సెహ్వాగ్ ప్రభావం గురించి గతంలోనూ చాలాసార్లు కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు అతిపెద్ద అవకాశం మాత్రం భారత్ అండర్ 19 ఎంపికే. దేశవాళీ స్థాయిలో పరుగులు చేయడం ఒక ఎత్తయితే, ఆస్ట్రేలియా లాంటి జట్టుపై భారత్ తరఫున ఆడటం మరో టెస్ట్. ఈ సిరీస్‌లో బాగా ఆడితే ఆర్యవీర్ తన ఆటను జాతీయ స్థాయిలో చూపించేందుకు ఇదే మంచి ఛాన్స్ అవుతుంది.
🔴JUNIOR SEHWAG & JUNIOR DRAVID READY FOR INDIA DEBUT 🤯
— Sam (@cricsam02) August 27, 2026
- Aaryveer Sehwag smashed 297-run knock for Delhi U-19 team against Meghalaya at age of 17 in November 2024.
- Anvay Dravid Smashed 87(67) against Sri Lanka A in July 2026.
After seeing such good records, both have… pic.twitter.com/VYxmKuY5IB
అన్వయ్‌కు ఇప్పటికే అనుభవం
17 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్‌కు మాత్రం అండర్ 19 స్థాయిలో భారత్ తరఫున ఆడిన అనుభవం ఉంది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్ గత నెల శ్రీలంక పర్యటనకు వెళ్లిన వన్డే జట్టులో కూడా ఉన్నాడు. అక్కడ రెండు యూత్ వన్డేల్లో అవకాశం దక్కగా 14, 87 పరుగులు చేశాడు. ముఖ్యంగా రెండో వన్డేలో భారత్ 81/4తో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 67 బంతుల్లో 87 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్‌తో వచ్చిన ఆ ఇన్నింగ్స్‌లో అర్జున్ రాజ్‌పుత్‌తో కలిసి 145 పరుగుల భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. ఆ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా సెలెక్టర్లు అన్వయ్‌ను కొనసాగించారు.
ఇద్దరికీ వన్డేల్లోనే ఛాన్స్
ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం బీసీసీఐ వన్డేలు, మల్టీ డే మ్యాచ్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఆర్యవీర్, అన్వయ్ ఇద్దరూ 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టులోనే ఉన్నాడు. మల్టీ డే స్క్వాడ్‌లో మాత్రం వారికి చోటు దక్కలేదు. వన్డే జట్టుకు లక్ష్య రాయ్‌చందాని కెప్టెన్‌గా వ్యవహరించనుండగా యశ్‌బర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. రాజత్ బఘేల్‌తో పాటు అన్వయ్ రెండో వికెట్ కీపర్ ఆప్షన్‌గా జట్టులో ఉన్నాడు.
Two familiar surnames in that squad 👀
— Cricbuzz (@cricbuzz) August 27, 2026
Aaryavir Sehwag (son of Virender Sehwag) and Anvay Dravid (son of Rahul Dravid) have been named in India's U19 squad for three One-Day matches against Australia
Image Credit: DPL pic.twitter.com/XyEdIQhchO
సెప్టెంబర్ 18 నుంచి మ్యాచ్‌లు
ఆస్ట్రేలియా అండర్ 19 పర్యటనలో మొత్తం మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు వన్డేలకు రాజ్‌కోట్ వేదిక కానుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 18న, రెండో వన్డే సెప్టెంబర్ 21న, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 23న జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు తొలి మల్టీ డే మ్యాచ్ కూడా రాజ్‌కోట్‌లోనే నిర్వహిస్తారు. రెండో మల్టీ డే మ్యాచ్ అక్టోబర్ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఈ ఫార్మాట్ జట్టుకు యశ్‌బర్ధన్ చౌహాన్ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్‌చందాని వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మాత్రం అందరి చూపు ముందుగా జరిగే వన్డే సిరీస్‌పైనే ఉంది. అక్కడ ఆర్యవీర్‌కు తొలి అవకాశం ఎలా ఉంటుంది? అన్వయ్ శ్రీలంకలో చూపించిన ఫామ్‌ను కొనసాగిస్తారా? ఇద్దరూ సత్తా చాటుతారా అనేది చూడాలి.
టెస్టు క్రికెటే అన్ని ఫార్మాట్లకు ప్రామాణికం- ఆటను అమ్మకూడదు, నేర్పించాలి: మాజీ ప్లేయర్ శ్రీనాథ్
బుమ్రా డామినేషన్‌కు చెక్- టాప్‌లోకి దూసుకొచ్చిన 36 ఏళ్ల స్టార్ పేసర్

