ETV Bharat / sports

హ్యారీ బ్రూక్​ను కొట్టిన క్లబ్ బౌన్సర్- తాగిన మత్తులో గొడవ

మద్యం మత్తులో నైట్​క్లబ్​ బౌన్సర్​తో గొడవ పెట్టుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్​- సీరియస్​గా తీసుకున్న బోర్డు మేనేజ్​మెంట్- 30 వేల పౌండ్ల ఫైన్!

Harry Brook
Harry Brook (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : January 8, 2026 at 9:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Harry Brook Fight With Bouncer : ఇంగ్లాండ్ వైట్​బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్​పై ఓ నైట్​క్లబ్ బౌన్సర్ చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గతేడాది నవంబర్‌ 1న న్యూజిలాండ్‌తో మూడో వన్డే మ్యాచ్​కు ముందు రోజు బ్రూక్ మద్యం మత్తులో ఓ నైట్‌క్లబ్‌ వద్ద గొడవకు దిగాడు. ఈ క్రమంలో సదరు బౌన్సర్ బ్రూక్‌పై బౌన్సర్ చేయి చేసుకున్న. దీన్ని సీరియస్​గా తీసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మేనేజ్​మెంట్ బ్రూక్​కు 30 వేల పౌండ్లు జరిమానా విధించింది.

ఇదీ జరిగింది
2025 అక్టోబర్ 31న బ్రూక్ తన సహచర క్రికెటర్లు జాకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్‌తో కలిసి వెల్లింగ్‌టన్‌లో ఓ నైట్‌ క్లబ్‌కు వెళ్లాడు. అయితే ఈ సమయంలో బ్రూక్ మద్యం తాగి ఉన్నాడని అనుమానించిన బౌన్సర్ అతడిని లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే క్లబ్ వద్ద తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదంలో బ్రూక్​పై బౌన్సర్ చేయిచేసుకున్నాడు.

అయితే ఈ వివాదంపై ఇంగ్లాండ్ బోర్డు విచారణ చేపట్టింది. దీనిపై బ్రూక్ కూడా బోర్డుకు వివరణ ఇచ్చాడట. తన ప్రవర్తనకుగానూ బ్రూక్ క్షమాపణలు చెప్పాడు. తన చర్యలు తప్పు అని, దానిని అతడు పూర్తిగా అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. 'నా చర్యలు తప్పు అని నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. నా చర్యలు నాకే కాదు, మా జట్టుకు కూడా ఇబ్బంది కలిగించాయి. ఇంగ్లాండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప గౌరవం'

'జరిగిన దాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తాను. సహచరు ఆటగాళ్లు, కోచ్‌లు, మద్దతుదారులను నిరాశపరిచినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నా' అని బ్రూక్ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇక బ్రూక్ చర్యలను తీవ్రంగా పరిగణించిన ఇంగ్లాండ్ బోర్డు, అతడికి ఫైనల్‌ వార్నింగ్ ఇచ్చి 30 వేల పౌండ్లు జరిమానాగా విధించింది.

ఆసీస్​లో ఫుల్​గా తాగిన ఇంగ్లాండ్ ప్లేయర్లు!
ప్రస్తుతం యాషెస్ సిరీస్​ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాలో ఉంది. అయితే ఈ సిరీస్​లో రెండు- మూడో టెస్టుకు మధ్య 9 రోజుల విరామం దొరికింది. దీంతో ఈ గ్యాప్​లో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఫుల్లుగా మద్యం తాగి ఎంజాయ్ చేసినట్లు వార్తలొచ్చాయి. నోసా బీచ్‌ రిసార్ట్‌లో మద్యం మత్తులో మునిగితేలారని ఇటీవల కథనాలు వచ్చాయి.

యాషెస్​లో బ్రూక్
ఈ యాషెస్​లో బ్రూక్ ఫర్వాలేదనిపించాడు. 10 ఇన్నింగ్స్​ల్లో కలిపి 39.78 యావరేజ్​తో 358 పరుగులు చేశాడు. ఇందులో రెండుసార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. దీంతో ఈ సిరీస్​లో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ల లిస్ట్​లో మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్నాడు. అతడు 10 ఇన్నింగ్స్​ల్లో 62.90 సగటుతో 629 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ 400 రన్స్​తో రెండో స్థానంలో నిలిచాడు.

టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు- 4- 1తేడాతో యాషెస్ ఆసీస్ కైవసం

స్మిత్, బ్రూక్ సెంచరీల మోత- 14ఏళ్లలో రేర్ రికార్డ్​- ఇంగ్లాండ్ స్ట్రాంగ్ రిప్లై