ETV Bharat / spiritual

దైవానికీ ఆకలేస్తుందా? - దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? -

దేవుడికి నైవేద్యం పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? - ఆధ్యాత్మికవేత్త సూర్యనారాయణమూర్తి వివరిస్తున్నారిలా!

Why Do We Offer Naivedyam to God
Why Do We Offer Naivedyam to God (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 23, 2026 at 4:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Why Do We Offer Naivedyam to God : దేవాలయాలకు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో భగవంతుడికి పూజ చేసినప్పుడు నైవేద్యం సమర్పిస్తాం. ఆపై దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తుంటాం. ఇదే క్రమంలో చాలా మందికి నైవేద్యం విషయంలో రకరకాల సందేహాలు వస్తుంటాయి. మనం పెట్టే నైవేద్యాన్ని పరమాత్ముడు స్వీకరిస్తాడా? దైవానికీ ఆకలి వేస్తుందా? దేవుడికి నైవేద్యం పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? తదితర విషయాలను ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణమూర్తి ఈవిధంగా వివరిస్తున్నారు.

నైవేద్యం స్వామివారి సన్నిధానంలో ఉంచి ఆపైన నేతితో అభీకరించిన తర్వాత కాసిన్ని నీళ్లు చేతిలోకి తీసుకుని అవోక్షణం అంటూ చేతిని బోర్లా వేసి నీటిని చిలకరిస్తాం. ఆ తర్వాత చుట్టూరా నీళ్లు తిప్పి స్వామివారి నామం స్మరిస్తూ నైవేద్యం సమర్పిస్తుంటాం. పరమాత్ముడు నిజంగా మనం ప్రసాదాల రూపంలో అర్పించే పదార్థాలను నివేదనగా స్వీకరిస్తాడా? అంటే, స్వామివారు నిజంగా స్వీకరించే ప్రయత్నమే చేస్తే ప్రపంచంలో పదార్థమే లేకుండా పోతుంది. పరమాత్ముడు ప్రపంచంలో సమస్తాన్ని సృష్టించినవారు కదా మరి ఇది ఎలా సమర్థించుకోవాలి. విష్ణుపురాణం ఇక్కడ ఒక ప్రతీకాత్మకమైనటువంటి శ్లోకంతో పరమాద్భుతమైన సందర్భరూపమైనటువంటి ధర్మాన్ని బోధిస్తుంది. అదేంటంటే,

"ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః

త్రిల్లోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః"

ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఒకే విశ్వరూపం ప్రపంచవ్యాప్తమైన చైతన్య స్వరూపం, సమస్త జీవకోటిలో రుచి అనే రూపంలో చేరి ఆ పదార్థాన్ని వాసనతో స్వీకరిస్తుంది. ప్రత్యక్షంగా ఆ పదార్థం అలాగే ఉంటుంది.

ఆజన్మ బ్రహ్మచారి హనుమ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సువర్చలా దేవి కల్యాణ రహస్యమిదే!

కానీ, ఆ పదార్థానికి అలా నీళ్లు చిలకరించి, గాయత్రీ మంత్రంతో అభిమంత్రించిన అనంతరం నివేదన ముద్రలతో సమర్పిస్తే స్వామి స్వీకరిస్తున్నాడు. మనం మౌనం పాటిస్తున్నాం. కళ్లు మూసుకుంటున్నాం. ఈ భక్తి భావన జతపరిచిన కారణం చేత ఆ పదార్థం ప్రసాదంగా మనం స్వీకరించే యోగ్యతతో ఇప్పుడు నైవేద్యంగా రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి. ఇలా పదార్థం- నైవేద్యం-ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదాన్ని మనం పరమాత్ముడు తిరిగి ఇచ్చిన దానిగా భావన చేసి స్వీకరిస్తామని చెబుతున్నారు.

ప్రకృతిలో లభించే ప్రతిదానిని పరమాత్మ సన్నిధానంలో ఉంచి పరమాత్మ కారణంగానే ఈ పదార్థం మనకు లభించింది. అది బట్టి పదార్థం పరమాత్ముడి దృష్టి చేత నైవేద్యంగా, అనంతరం మనం స్వీకరించే ప్రసాదంగా రూపుదిద్దుకుంటుందంటున్నారు. అప్పుడు దాన్ని స్వీకరిస్తే అది ప్రసాదం అవుతుందంటున్నారు. మనలో ఉన్నటువంటి వైశ్వావరుడికి ఈ ప్రసాదం శక్తిని అందిస్తుంది. యోగులు, మహారుషులు చాలా తక్కువగా తింటారు. దొరికిందల్లా తినేయరు. ఓసారి తింటారు అయిపోయింది ఈరోజుకి అనుకుంటారు. మిగతా సమయమంతా ధ్యానంపైనే దృష్టిపెడతారు. ఈ ధ్యాన దృష్టిని పెంచేది నైవేద్యం, ప్రసాదం అని చెబుతున్నారు ప్రవచనకర్త సూర్యనారాయణ.

చివరగా విష్ణు పురాణంలో ఈ నైవేద్యానికి సంబంధించిన భావన ఎలాంటిదంటే, సమస్త జీవులలో ఉన్నటువంటి రుచి, వాసన ఈ రెండింటి కారణంగానే పరమాత్మ ఆ పదార్థాన్ని స్వీకరించాడు అన్న జ్ఞానం మనలో స్థిరపడుతుంది. ఇది అసలైన వాస్తవమని ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి చెబుతున్నారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

శ్రీశైలంలో తపస్సు చేసి మల్లికార్జునిలో ఐక్యమైన మహా భక్తురాలు- అక్కమహాదేవి జీవిత విశేషాలివే!

కోటి జన్మల పుణ్యఫలం అందించే దక్షిణ కాశీ- కడపలోని ఈ మహిమాన్విత శివక్షేత్రం గురించి తెలుసా?