ETV Bharat / spiritual

'వామాచారం, దక్షిణాచారం'తో పరమేశ్వరుడు ప్రసన్నం! - ఈ రెండింటిలో ఏది విశేషమైనది?

వామాచారం, దక్షిణాచారం మధ్య ఉన్న తేడా ఏమిటి? - ఏది విశేషమైనదో ఆధ్యాత్మికవేత్త పతంజలి వివరిస్తున్నారిలా!

Vamacharam
Vamacharam (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 5:15 PM IST

2 Min Read
Choose ETV Bharat

and Dakshinacharam Difference : వామాచారం, దక్షిణాచారం పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలు. ఈ రెండు ప్రక్రియల మధ్య ఉన్న తేడా ఏమిటి? వీటిలో ఏది విశేషమైనది? ఈ అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త 'తాడేపల్లి పతంజలి' పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వామాచారం, దక్షిణాచారం అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే, మామూలు పరిభాషలో చెప్పాలంటే దక్షిణ అంటే "కుడి వైపు", వామ అంటే "ఎడమ వైపు" అని అర్థం. ఇందులో వామాచారం ఈకాలంలో చేయడం చాలా కష్టం. దక్షిణాచారం ఇది అందరూ చేయవచ్చు. ఇవన్నీ శివుడి ఆచారాలే. పరమేశ్వరుడికి వామ ఎడమ పక్కన ఉంటుంది. అర్ధనారీశ్వర స్వరూపం కదా అమ్మవారు కాబట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసేటువంటి ఆచారం "వామాచారం". ఇవతల పక్క కుడి వైపు ఉండేటువంటి వాడు శివుడు. ఆయన శివం కరోతి. శివం అంటే శుభం. శుభాన్ని అనుగ్రహించేటువంటివాడు కాబట్టి 'దక్షిణాచారం' అంటారు. అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి, కుడివైపున ఉన్నటువంటి శివుడికి చేసేటువంటి పూజ ఏదైతే ఉన్నదో అది దక్షిణాచారం అని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్త పతంజలి.

ఈ రెండింటిలో ఏది విశేషమైనదంటే?

వామాచారం, దక్షిణాచారం ఈ రెండింటిలో ఏది విశేషమైనది అంటే రెండు గొప్పవే అంటున్నారు ఆధ్యాత్మికవేత్త తాడేపల్లి పతంజలి. కానీ, రెండింటిలోనూ అందరూ ఈరోజు చేయవలసినటువంటి పని దక్షిణాచారం. వామాచారం విషయానికొస్తే అది 'తాంత్రిక పద్ధతి'. కుముద చింతామణి ఇలాంటి తాంత్రిక గ్రంథాలు కొన్ని ఉన్నాయి.

అమ్మవారి లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారు వామాచార పారాయణ కూడా ఉంది. కాబట్టి వామాచారం కూడా చేస్తుంటారు. కానీ, కత్తి మీద నడక లాంటిది వామాచారం. అంటే కత్తి మీద అంచుపై అడుగు గట్టిగా పడిందా కస్సుమని తెగిపోతుంది. అలాగని నడవకుండా ఉండాలా? లేదు నడవాలి అంటే చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా నడవాలి. లేకపోతే కాలు దెబ్బ తింటుంది. ఆ రకంగానే ఈ వామాచారంలో ఉన్న పంచమకారాలు ఏదైతే ఉన్నాయో మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునము. అమ్మవారి ఆరాధన అర్ధరాత్రి అమవాస్య పూట చేస్తూ ఉంటారు. ఈ రకంగా వామాచారం అనేది తాంత్రిక పద్ధతిలో ఉంటుంది. కాబట్టి , దీన్ని అందరూ చేయలేరని చెబుతున్నారు తాడేపల్లి పతంజలి. సమయాచారం అని చెప్పి రెండిట్లో మధ్యలో ఒక మధ్యే మార్గం కింద పెట్టారు. వామాచారానికి, దక్షిణాచారానికి మధ్యలో శ్రీ విద్యా సంప్రదాయంలో 'సమయాచారం' అని చెప్పి ఒకటి ఉందంటున్నారు తాడేపల్లి పతంజలి.

దేవతల చేతుల్లో "త్రిశూలం" ఎందుకు? - ఇది దేనికి సంకేతం?

సమయాచారం అంటే ఏమిటి?

'సమయాచారం' అంటే ఏమిటనగా ఒక శుద్ధోదకంలో అల్లం ముక్క వేశామనుకోండి అది మాంసం తోటి సమానం. ఆ రకంగా వామాచార పద్ధతి అనుసరించే వాళ్లు కొంతమంది దక్షిణాచారం పాటిస్తూ మళ్లీ వామాచారం పద్ధతి చేసేవాళ్లూ కొంతమంది ఉన్నారు. అసలు ఎందుకు ఇవన్నీ చక్కగా ఈ రెండింటిలో దక్షిణాచారం శుభ్రమైనటువంటిది. అది మనందరినీ అనుగ్రహిస్తుంది. అని పతంజలి పేర్కొన్నారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

గుడి చుట్టూ "ప్రదక్షిణలు" ఎందుకు చేయాలి? - ఎలా చేస్తే మంచిది?

దేవాలయంలో తలపై "శఠగోపం" ఎందుకు పెడతారు? - దీని వెనకున్న రహస్యమిదే!