ETV Bharat / spiritual

కలలో ఈ "దృశ్యాలు" కనిపిస్తే చాలా మంచిదట! - పాములు వస్తే దేనికి సంకేతమో తెలుసా?

నిద్రలో 'కలలు' రావడం సహజం - ఇవి కనిపిస్తే అద్భుత ఫలితాలుంటాయంటున్న జ్యోతిష్యులు!

What does Animal Dreams Mean
What does Animal Dreams Mean (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 8, 2026 at 3:33 PM IST

4 Min Read
Choose ETV Bharat

What does Animal Dreams Mean : మనం నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ఈ కలలు రకరకాలుగా ఉంటాయి. వీటికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. కలల గురించి బృహస్పతి "స్వప్నాధ్యాయం" అని ప్రత్యేకంగా పురాణాల్లో ఒక అధ్యాయం రాశాడు. అయితే, ఎప్పుడైనా సరే ఎవరికైనా కలలో ఈ ఏడు దృశ్యాలు కనిపిస్తే త్వరలోనే మీకు అదృష్టయోగం పట్టనుందని స్వప్నాధ్యాయం చెబుతోంది. మరి, అదృష్టాన్ని తెచ్చే ఆ దృశ్యాలేంటి? ఏం కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కలలో ఎవరికైనా సరే కొండ, చెట్టు, ఎద్దు, ఏనుగు వంటివి ఎక్కినట్టు కనిపిస్తే త్వరలోనే రాజయోగం పడుతుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​కుమార్. అంటే, పదవీ యోగంతో ప్రమోషన్లు లభిస్తాయట. పనులన్నీ త్వరగా పూర్తవుతాయట. జీవితంలో మంచి ఉన్నత స్థాయి వస్తుందంటున్నారు.

  • ఎప్పుడైనా కలలో బాగా ఏడుస్తున్నట్లు లేదా చనిపోయినట్లు కనిపిస్తే వాళ్లకి దీర్ఘాయుదాయం కలుగుతుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​. అలాగే, ఎవరికైనా కలలో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుందంటున్నారు.
  • కలలో దేవతలు దర్శనమిస్తే మనకి సహాయం చేసే స్నేహితులు పెరుగుతారట. కలలో పైన చెప్పిన ఏడు దృశ్యాలు కనిపిస్తే మీకు తిరుగుండదని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పారు.
  • ఇవికాకుండా ఒక్కోసారి పీడకలలు వస్తుంటాయి. అవి రాకుండా మీరు పాటించాల్సిన ఒక అద్భుతమైన పరిహారం ఉందని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు.
  • అదేంటంటే, ఒక తెల్లని క్లాత్​లో కొంచెం బియ్యం, హారతి కర్పూరం బిల్లలు తీసుకుని కలిపి మూటలా కట్టి తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి. ఇలా చేయడం ద్వారా పీడకలలు రానే రావట. ఉదయం లేచాక దాన్ని ఎక్కడైనా ఉంచి మళ్లీ రాత్రి నిద్రపోయే ముందు అదే మూట తల దగ్గర పెట్టుకొని పడుకోవడం మంచి రిజల్ట్​ను ఇస్తుందంటున్నారు.
  • ఒకవేళ పీడకలలు బాగా వస్తుంటే మాత్రం శివాలయంలో దీపం పెట్టిరండి. అలాగే, కలలో క్రూర మృగాలు, భయానకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తే ఆంజనేయస్వామికి పంచదార, పాలు నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా అలాంటివి రాకుండా చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్​.

ఏ కలలు ఫలిస్తాయంటే?

  • బృహస్పతి స్వప్నాధ్యాయం ప్రకారం ఏ కలలు ఫలిస్తాయో ఇప్పుడు చూద్దాం. వాత దోషం, పిత్త దోషం(పైత్యం) ఉన్నప్పుడు నిద్రపోతే ఆ కలలు పని చేయవట.
  • అలాగే, ఒక విషయం గురించి బాగా ఆలోచిస్తూ నిద్రపోయినప్పుడు కలలు వస్తే అవి కూడా పని చేయవట.
  • ఆరోగ్యంగా ఉన్నప్పుడు సహజంగా వచ్చే కలలు మాత్రమే కచ్చితంగా పని చేస్తాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు.

తిరుమల, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలా? - నియమం ఏమైనా ఉందా?

కలలో పాము కనిపిస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే?

  • కలలో వివిధ రకాల జంతువులు కనిపించడం సహజం. అందులో భాగంగానే అప్పుడప్పుడు పాములు కనిపిస్తుంటాయి. అయితే, కలలో సర్పాలు కనిపించే ప్రత్యేకమైన తీరును బట్టి ఫలితాలు ఉంటాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు.
  • ఎప్పుడైనా కలలో తెల్లపాము కనిపిస్తే చాలా మంచిదని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇలా శ్వేత సర్పం కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి త్వరగా బయటపడతారట. అలాగే జీవితంలో విజయం సాధిస్తారని స్వప్న సిద్ధాంతం చెబుతుందంటున్నారు.
  • కలలో త్రాచుపాము కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనలాభంతో పాటు రాజయోగం కలుగుతుందట. అదే సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కనిపిస్తే త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలంటున్నారు జ్యోతిష్యులు.
  • మీకు ఎప్పుడైనా కలలో పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తే అది త్వరలోనే ధనయోగం కలుగుతుందనడానికి శుభ సంకేతంగా భావించవచ్చట. అదే, పుట్టలో నుంచి సర్పం బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు.
  • పాము చెట్టు ఎక్కినట్లు కొందరికి కలలు వస్తుంటాయి. ఇలా కనిపిస్తే తొందరలోనే జీవితంలో స్థిరపడడమే కాకుండా విశేషమైన ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలట. ఒకవేళ చెట్టు నుంచి కిందకు దిగుతున్నట్లు కనిపిస్తే మాత్రం ధన నష్టం జరుగుతుందని, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందంటున్నారు!
  • ఎప్పుడైనా సరే కలలో దేవాలయంలో పాము ఉన్నట్లు కనిపిస్తే చాలా అద్భుతమైన రాజయోగం పడుతుందట. అలాగే, ఇంట్లో పాము ఉన్నట్లు కనిపించినా చాలా మంచిదంటున్నారు.
  • కొందరికి కలలో పాముని చూడగానే భయం వేస్తుంది. అలా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ లేదా బంధువులు మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారని గ్రహించాలట. అందుకే, ఎప్పుడైనా కలలో సర్పాన్ని చూసి భయపడ్డారనుకో వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించడం మంచిదని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.

Note: పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పూజగదిలో 'వీటిని' ఉంచకండి! - మనసంతా కేంద్రీకరించాలంటే ఏం చేయాలో తెలుసా?

"పూజ" చేసేటప్పుడు నేల మీద కూర్చోకూడదంటారు ఎందుకు? - మరి ఎలా చేస్తే మంచి ఫలితాలు?