ETV Bharat / spiritual

శివలింగంపై దర్శనమిస్తున్న "వేంకటేశ్వరుడు" - ఒక్కసారి దర్శిస్తే పాపాలు తొలగిపోతాయట!

త్రిమూర్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న వేంకటేశ్వర స్వామి టెంపుల్! - ఎక్కడ ఉందో తెలుసా?

Thiruparkadal Prasanna Venkateswara Perumal
Thiruparkadal Prasanna Venkateswara Perumal (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 28, 2026 at 1:05 PM IST

4 Min Read
Choose ETV Bharat

Thiruparkadal Prasanna Venkateswara Perumal Temple : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడు కొలువైన క్షేత్రాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అందులో కొన్ని దేవాలయాలు ప్రాంతం, చరిత్ర, రూపాన్ని బట్టి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే, ప్రసిద్ధి చెందిన ఒక వెేంకటేశ్వరస్వామి దేవాలయం పేరు చెప్పమనగానే మనందరికీ ముందుగా తిరుమల పుణ్యక్షేత్రం గుర్తొస్తుంది. అది మాత్రమే కాదు శ్రీనివాసుడు కొలువైన క్షేత్రాల్లో మీరు తప్పక చూడాల్సిన మరో అద్భుతమైన ఆలయం ఉంది. ఇక్కడ దేవదేవుడు శివలింగంపైన నిల్చుని పూజలు అందుకుంటూ హరిహరులిద్దరూ ఒకటేనని చాటుతున్నాడు. ఇంతకీ, ఈ దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? చరిత్ర, విశిష్టత, ఎలా చేరుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సాధారణంగా శ్రీనివాసుడు పద్మపీఠంపైన దర్శనం ఇస్తుంటాడు. కానీ, ఇక్కడ శ్రీ వెంకటేశ్వరస్వామి శివలింగంపైన నిల్చుని పూజలు అందుకుంటూ హరిహరులిద్దరూ ఒకటేనని చాటుతున్నాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మనసారా వీక్షించి, భక్తిభావం పొందాలంటే మాత్రం తమిళనాడులోని చెన్నై-రాణిపేట జిల్లా, వాలాజాపేటలోని తిరుప్పార్‌కడల్‌ వేంకటేశ పెరుమాళ్‌ ఆలయానికి వెళ్లిరావాల్సిందే. అలాగే, ఈ టెంపుల్​లో విష్ణుమూర్తి అవతారమైన "రంగనాథుడు" చిత్రగుప్తుడి చిట్టాలో భక్తుల పాపాలను తొలగించే పుణ్యమూర్తిగా కొలువుదీరాడు. తిరుప్పార్‌కడల్‌కు వచ్చే భక్తులు శివలింగంపై దర్శనమిచ్చే వెంకటేశ్వరస్వామితోపాటు రంగనాథుడినీ దర్శించుకోవాలని చెబుతారు.

స్థల పురాణం ఏం చెబుతుందంటే :

ఓసారి "పుండరీకుడు" అనే మహర్షి బ్రహ్మ నిర్వహించిన యాగానికి వెళ్లి వస్తూ ఈ ప్రదేశానికి చేరుకున్నాడట. ఆ మహిర్షి పరమ వైష్ణవుడు కావడంతో తన ఇష్టదైవాన్ని దర్శించుకోవాలనుకుని వెతికితే ఈ టెంపుల్ కనిపించిందట. అప్పుడు పుష్కరిణిలో స్నానమాచరించి, తీరా గర్భగుడి వద్దకు వెళ్లగానే అక్కడ శివలింగం కనిపించడంతో నిరుత్సాహానికి గురై వెనక్కి వెళ్లిపోయాడట. అది తెలిసిన విష్ణుమూర్తి వృద్ధుడి వేషధారణలో పుండరీకుడి దగ్గరకు వచ్చి అతని నిరాశకు కారణాన్ని అడిగాడట.

అప్పుడు పుండరీకుడు తాను విష్ణుమూర్తిని దర్శించుకోలేక పోయానని చెబుతూ ఏడ్చాడట. ఆ టైమ్​లో మారువేషంలో ఉన్న శ్రీమన్నారాయణుడు.. ఆ గర్భగుడిలో విష్ణుమూర్తే ఉన్నాడనీ, ఆ స్వామి దర్శనం చేయిస్తాననీ తన వెంట మళ్లీ ఆ టెంపుల్​లోకి తీసుకెళ్లాడట. తీరా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ అభయముద్రతో శివలింగం పైన నిల్చున్న శ్రీనివాసుడు కనిపించాడట. అప్పటినుంచీ శ్రీనివాసుడు అక్కడ "ప్రసన్న వేంకటేశ్వర పెరుమాళ్‌"గా పూజలు అందుకుంటున్నాడట. ఈ దేవాలయాన్ని ఎవరు కట్టారనేది స్పష్టత లేకపోయినా, కాలక్రమంలో విజయనగర రాజులు దీన్ని పునర్నిర్మించినట్లుగా చరిత్ర తెలియజేస్తోంది.

త్రిమూర్తి క్షేత్రంగా ప్రాచుర్యం పొందిన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు గర్భగుడిలో శివలింగంపైన నిల్చుని దర్శనమిస్తున్న వెంకటేశ్వరస్వామిని చూసి తరిస్తారు. అలాగే, అలమేలుమంగ తాయారు, ఆంజనేయస్వామి, గరుడాళ్వార్, రుక్మిణి, సత్యభామ కొలువైన ఉపాలయాలను కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక, గర్భగుడిపైన నిర్మించిన పుండరీక విమాన గోపురమూ ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విమాన గోపురానికి దక్షిణంవైపు దక్షిణామూర్తి ఉంటే, పశ్చిమాన లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు. తూర్పున గజేంద్రుడిని, ఉత్తరం సైడ్ బ్రహ్మనూ చూడొచ్చు. సంవత్సరం మొత్తం విశేష పూజలు జరిగే ఈ దేవాలయ సందర్శన తర్వాత, రంగనాథస్వామి దర్శనంతో తిరుప్పార్‌కడల్‌ క్షేత్ర పర్యటన కంప్లీట్ అవుతుంది.

తాబేలుని పెంచుకుంటే ధనం లభిస్తుందా? - ఇందులో నిజమెంత?

ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే!

శివలింగంపై దర్శనమిస్తున్న ప్రసన్న వేంకటేశ్వర పెరుమాళ్‌ ఆలయానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో 'రంగనాథర్‌ క్షేత్రం' ఉంటుంది. స్వయంభుగా వెలిసిన ఈ స్వామిని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు నయమవడమే కాక, పాపాలూ తొలగిపోతాయని ఓ నమ్మకం. ఈ టెంపుల్​ వెనుక కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి బ్రహ్మ యాగం తలపెడితే తాను లేకుండా యాగం ఏమిటని ఆగ్రహించిన సరస్వతీదేవి-వేగావతి నది రూపంలో ఉద్ధృతంగా ప్రవహించి ఆ యాగానికి ఆటంకం కలిగించేందుకు ట్రై చేసిందట.

ఆ విషయం తెలిసిన విష్ణుమూర్తి ఆ ప్రదేశానికి చేరుకుని నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఇక్కడ శయనించి, తర్వాత రంగనాథుడిగా పూజలు అందుకోవడం మొదలుపెట్టాడట. కాలక్రమంలో అనారోగ్యానికి గురైన చిత్రగుప్తుడు ఇక్కడకు వచ్చి స్వామిని ఆరాధించి, కోలుకున్నాడట. అందుకు కృతజ్ఞతగా శ్రీనివాసుడితో పాటు రంగనాథుడిని కూడా దర్శించుకునే భక్తుల పాపాలను తన చిట్టా నుంచి తొలగిస్తానని స్వామికి విన్నవించుకున్నాడట. అందుకే, ఈ రెండు టెంపుల్స్​ను తప్పక చూడాలంటారు. కంప్లీట్​గా మేడిపండు చెట్టుచెక్కతో తయారైన రంగనాథస్వామి విగ్రహాన్ని దర్శించే భక్తులు.. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠఏకాదశితోపాటు ఇతర ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఇక్కడకు ఎలా చేరుకోవాలి :

తిరుప్పార్‌కడల్​లో కొలువైన "ప్రసన్న వేంకటేశ్వర పెరుమాళ్‌"ను దర్శించుకోవాలనుకునే భక్తులు విమానంలో వెళ్లాలనుకుంటే చెన్నై విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ప్రైవేటు వెహికల్స్ ద్వారా వేలూరు మీదుగా కావేరీపాక్కంకు చేరుకుని ఈ టెంపుల్స్​ను సందర్శించవచ్చు. అదే, ట్రైన్​లో వెళ్లాలనుకునేవారు వాలాజాపేట రైల్వే జంక్షన్‌లో దిగితే అక్కడి నుంచి ఇతర వాహనాల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాలను చేరుకోవచ్చు.

గుడిలో "ధ్వజస్తంభం" ఎందుకు ప్రతిష్ఠిస్తారు? - దీని వెనుకున్న అసలు రహస్యమిదే!

దైవానికీ ఆకలేస్తుందా? - దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? -