ETV Bharat / spiritual

ఆ రాశివారికి పదోన్నతులు- వ్యాపారంలో లాభాలు- దుర్గాదేవి దర్శనం శుభకరం!

2026 మే 7వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2026 at 12:01 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today May 7th 2026 : 2026 మే 7వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా వ్యవహరించడం వలన మేలు జరుగుతుంది. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. అనవసర ధనవ్యయం ఉండవచ్చు. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగంలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి. అభయ ఆంజనేయస్వామి దర్శనం శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మానసిక సంతోషం కలిగించే సంఘటనలు జరుగుతాయి. మనోబలంతో ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు అందుకోవడంతో ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో సరికొత్త వ్యూహాలతో లాభాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన అంశాల్లో అనుకూలత ఉంటుంది. నూతన వాహనయోగం ఉంది. అధికారయోగం, పదవి యోగం ఉన్నాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. కుటుంబ వ్యవహారాల్లో సమయం, సందర్భం దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తే శుభం జరుగుతుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. విఘ్నవినాయకుని ప్రార్థన ప్రశాంతతనిస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆటంకాలు అధిగమిస్తారు. వృత్తి రీత్యా చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. డబ్బుకు లోటుండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఒక సందర్భంలో సన్నిహితుల వలన మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో స్వీయ నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ధన,వస్తు లాభాలున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దుర్గాదేవి దర్శనం శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషిని అధికారులు గుర్తిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఆర్థికంగా మేలైన సమయం. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. సన్నిహితులతో పర్యాటక ప్రదేశాలకు వెళ్తారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణనాయకాష్టకం పఠించడం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడుస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో అధికారులు నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త వ్యాపారంలో మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ, పనిఒత్తిడి పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోండి. వ్యాపారంలో నిదానించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు. కుటుంబంలో మంచి సమయం గడుపుతారు. సామాజిక కార్యకలాపాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ లక్ష్యాలు, ఆశయాలు అన్ని నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయపరంపరాలు కొనసాగుతాయి. ఆర్థికంగా మీ అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. కుటుంబ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు శుభప్రదమైన రోజు. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. అవివాహితులకు కల్యాణయోగం ఉంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో దృఢ సంకల్పంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. కుటుంబంలో కలహాలు రాకుండా కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో ప్రతికూలతలు తొలగుతాయి.

తెలంగాణలో స్వయంభువు గణపతి ఆలయాలు- కోరికలు తీర్చే మహిమాన్విత క్షేత్రాల విశేషాలివే!

శ్రీరాముడు నడయాడిన పుణ్యక్షేత్రాలు- అయోధ్య నుంచి భద్రాచలం వరకు రామాయణానికి సాక్ష్యాలైన పవిత్ర స్థలాలు!