ETV Bharat / spiritual

ఆ రాశివారికి నేడు వ్యాపారాల్లో లాభాలు- ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే బెటర్!

2026 మే 1వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2026 at 12:01 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today May 1st 2026 : 2026 మే 1వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో క్రమశిక్షణతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా పొదుపు ధోరణి అవలంబించడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నందున అన్నింటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నతమైన యోగం ఉంటుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్థికంగా మేలైన సమయం. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి అడుగేయాలి. చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని అవమానకర సంఘటనలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శనిధ్యాన శ్లోకాలు పఠించడం ఉత్తమం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల నష్టాలు తగ్గుతాయి. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులతో ఘర్షణలకు అవకాశం ఉంది. ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శివారాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మీ కృషితో పోటీ దారులపై విజయం సాధిస్తారు. వ్యాపారంలో స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి మంగళకరమైన రోజు. ఉద్యోగంలో స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ రుణాల విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలున్నాయి. కీలక సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో శ్రేష్టమైన లాభాలు ఉంటాయి. ఆర్థికంగా ఎదుగుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గొప్ప ఆత్మ విశ్వాసంతో ప్రారంభించిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం ఉంటాయి. ఆర్థికపరంగా అనుకూలమైన సమయం. స్థిరాస్తి యోగం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు. కుటుంబంలో వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ పట్టుదలతో అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూలం. పొదుపు చర్యలు పాటించడం అవసరం. కుటుంబంలో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్యనారాయణస్వామి దర్శనం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారంలో నష్టభయం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించండి. రుణాలు, ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ కలహాలు అశాంతి కలిగిస్తాయి. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రమాదకరమైన వ్యవహారాలు, సందర్భాలకు దూరంగా ఉండటం మంచిది. అభయ ఆంజనేయస్వామి దర్శనంతో ఆపదలు తొలగుతాయి.

.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అంతా మంచి జరుగుతుంది. మీ ప్రతిభకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వచ్చి ధనవంతులవుతారు. గతంలోని ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ముఖ్యమైన విషయాల్లో శాంతంగా, తెలివిగా వ్యవహరించాలి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు తెలివిగా నిర్వహించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శ్రీనివాసుని గోవింద నామాలు పఠించడం శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శాంతంగా, సహనంగా వ్యవహరించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. పనిప్రదేశంలో ఎవరితోనూ ఘర్షణలకు దిగవద్దు. కోపం అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారంలో ముందుచూపుతో నడుచుకుంటే నష్టాలు తగ్గుతాయి. మొహమాటాలతో చిక్కుల్లో పడతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. వృథా ఖర్చులు నివారించండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నవగ్రహ ఆరాధనతో ప్రతికూలతలు తొలగుతాయి.

పవిత్ర వైశాఖ మాసంలో నృసింహ జయంతి- ఆ రోజున స్వామిని భక్తితో పూజిస్తే అనేక శుభాలు!

శ్రీ వేంకటేశ్వరుని భర్తగా భావించిన మహా భక్తురాలు- తరిగొండ వెంగమాంబ అద్భుత కథ!