ఆ రాశివారికి ఆరోగ్య సమస్యలు- శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం!
2026 మార్చి 3వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Published : March 3, 2026 at 12:02 AM IST
Horoscope Today March 3nd 2026 : 2026 మార్చి 3వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ప్రయత్నంతోనే విశేష ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శనం శుభకరం.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా నూతన శిఖరాలు అధిరోహిస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన ఆటంకాలు తొలగిపోతాయి. ఇక మీకు సర్వత్రా విజయమే ! ఆత్మ విశ్వాసంతో ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. పితృ సంబంధమైన ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. శ్రీలక్ష్మి యోగంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కొంతమంది బంధువుల ప్రవర్తన సంకటంగా మారుతుంది. సౌమ్యంగా వ్యవహరించడం వల్ల బంధాలు బలపడతాయి. కీలక వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పటికీ సహనంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేయడం మొదలుపెడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. వృథా ఖర్చులు నివారించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శని ధ్యానంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా సహకరిస్తోంది. లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో సమష్టి కృషితో విజయావకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం సహకరిస్తోంది. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరమైన లాభాలు అందుకుంటారు. కుటుంబం వాతావరణం సామరస్యంగా ఉంటుంది. అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థికాభివృద్ధి స్పష్టంగా గోచరిస్తోంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిరకాల ఆశయాలు నెరవేరుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఊహించని మేలు జరుగుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గ్రహసంచారం విశేషంగా యోగిస్తుంది. రాజయోగ సూచనలున్నాయి. ఉద్యోగంలో ఉన్నతస్థితి లభిస్తుంది. వ్యాపారంలో సమస్యల నుంచి బయట పడతారు. ఆర్థికంగా శుభప్రదమైన సమయం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. ధనయోగం బలంగా ఉంది. రుణసమస్యలు తొలగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. న్యాయపరమైన అంశాల్లో విజయం మీదే అవుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అవసరం. కాలం సహకరిస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. చంచల స్వభావంతో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే గట్టి ప్రయత్నాలు అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో సమయపాలన, క్రమశిక్షణ అవసరం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సూచనలు విజయానికి చేరువ చేస్తాయి. అధిక ఖర్చులు నియంత్రించండి. అనారోగ్య సమస్యలు అశ్రద్ధ చేయవద్దు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

