ETV Bharat / spiritual

ఆ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది- సూర్య ఆరాధన శ్రేయస్కరం!

2026 మార్చి 2వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 2:45 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today March 2nd 2026 : 2026 మార్చి 2వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సమర్థవంతంగా పనిచేసి పదోన్నతులు పొందుతారు. చక్కటి ప్రణాళిక, ముందుచూపుతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తిరీత్యా తీరికలేని పరిస్థితి ఉంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. వృథా ఖర్చులు నివారించండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఒక సంఘటన నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది. స్థిర నిశ్చయంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజుమిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నిర్వహించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మసిద్ధి ఉంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారంతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. పెద్దలతో మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే మంచిది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నిరాశావాదాన్ని వీడి ఆశావాద దృక్పధంతో ముందుకెళ్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. పరోపకార కార్యక్రమాలతో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలో మీ కృషి సత్ఫలితాన్నిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనువైన సమయం. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలతో ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. మనోధైర్యంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కనకధారా స్తోత్ర పారాయణం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడికి గురికాకుండా పనిచేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు పట్టించుకోకుండా ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. స్వీయ నిర్ణయాలతో వ్యాపారంలో అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. కుటుంబంతో విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దైవానుగ్రహంతో సంపద, సంతోషం కలుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలమైన రోజు. కొనుగోళ్లు, అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగంలో అందరినీ కలుపుకుని పోవడం వల్ల ఆశించిన ఫలితాలు పొందవచ్చు. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. అభయ ఆంజనేయస్వామి దర్శనంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.