ఆ రాశివారికి జలగండం- సూర్య ఆరాధన శ్రేయస్కరం!
2026 మార్చి 1వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Published : March 1, 2026 at 12:01 AM IST
Horoscope Today March 1st 2026 : 2026 మార్చి 1వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాలకు ఈ రోజు అంత అనుకూలం కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శని ధ్యానంతో ప్రతికూలతలు తొలగుతాయి.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి పరంగా ఎదురయ్యే సవాళ్లు అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగితే విజయం మీదే! ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఒక సంఘటనతో మీ కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కోసం మీరు పడే శ్రమ వృథా కాదు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా సంతోషం, అదృష్టం, ఆనందం, అధికారం అన్ని లభిస్తాయి. అన్ని వైపుల నుంచి శుభయోగాలతో ఈ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ధనయోగాలున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభకరం.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి మనోధైర్యంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీ సహనమే మీ విజయానికి బాటలు వేస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబంలో సమస్యల ఒత్తిడి, ఉద్రిక్తత ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం కూడా ఆందోళనకు గురిచేస్తుంది. న్యాయపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ఆపదలు తొలగుతాయి.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి బాగా పెరుగుతుంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆత్మీయుల సహకారంతో కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిత్రుల సహకారంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. వివాదాలు ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్ఠమైన సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. వ్యాపారంలో చక్కగా రాణిస్తారు. అందరికీ విశ్వాసపాత్రంగా ఉంటారు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గణనాయకాష్టకం పఠించడం శుభప్రదం.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ ఫలితం ఆనందదాయకం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక నిల్వలు పెరగడంతో సంతోషంగా ఉంటారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేపట్టిన పరోపకార కార్యక్రమాలు మీకు పేరు, గుర్తింపు తెచ్చిపెడతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగులు వృత్తి పరంగా రాణిస్తారు. ప్రారంభించిన పనుల్లో ఆలస్యం అయినా ఆశించిన ఫలితం తప్పక లభిస్తుంది. నూతన కార్యక్రమాలు సఫలం అవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

