ETV Bharat / spiritual

ఆ రాశివారికి వ్యాపారంలో లాభాలు- గొడవలకు దూరంగా ఉండాలి- ఇష్ట దేవతారాధన శుభకరం!

2026 ​​జనవరి 8వ తేదీ (గురువారం) రాశిఫలాలు

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 12:02 AM IST

4 Min Read
Choose ETV Bharat

Horoscope Today January 8th 2026 : 2026 జనవరి 8వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించండి. వృథా ఖర్చులు నివారించండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని, ప్రతిభను అందరూ గుర్తిస్తారు. వ్యాపారంలో పోటీని సమర్థవంతంగా అధిగమిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగంలో లభించే నూతన అవకాశాలు లాభదాయకంగా ఉంటాయి. సంపదలు పెరుగుతాయి. గొడవలకి, వివాదాలకి దూరంగా ఉండండి. మోసపూరిత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గొప్పవారిని చూసి స్ఫూర్తి పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి కొన్ని లాభాలు అందుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్ఠమైన సమయం నడుస్తోంది. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : ప్రణాళికతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వచ్చే రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఆశించవచ్చు. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు ఈ రోజు విపరీతమైన లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. బంధువులు, రక్త సంబంధీకులు, స్నేహితుల నుంచి ఆర్థిక లబ్ధి కలుగుతుంది. ప్రారంభించిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతి, పరపతి, ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక విషయాలకు మంచి సమయం. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అధికార యోగం ఉంటుంది. స్వస్థానప్రాప్తి కూడా ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులన్నీ సావకాశంగా పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనువైన రోజు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పరోపకార కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. సమాజంలో గౌరవం, పరపతి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో అనవసర వాదనలు కలహాలకు దారితీస్తాయి. సహనంతో క్రమంగా పరిస్థితి మెరుగు పడుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.